కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ఒట్టు వేసి అత్త‌ను ఒప్పించిన దీప‌- కాంచ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోతారా? శ్రీధ‌ర్‌కు కావేరి షాక్

కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 8 ఎపిసోడ్ లో శివనారాయణ ఇంటికి వెళ్తానని అత్త కాంచనను ఒప్పిస్తుంది దీప. కడుపులో బిడ్డకు ఏం కానివ్వనని మాట ఇస్తుంది. మరోవైపు కాంచన దగ్గరకు వెళ్లిపోతారా? అని శ్రీధర్ ను అడుగుతుంది కావేరి. 

Published on: Dec 8, 2025, 06:58:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 8 ఎపిసోడ్ లో దీప గురించి ఎక్కువగా ఆలోచించొద్దని కాంచనకు చెప్తుంది అనసూయ. అప్పుడే వచ్చి అత్తయ్య అని పిలుస్తుంది దీప కానీ కాంచన సరిగ్గా రియాక్ట్ కాదు. అత్తయ్య నువ్వు చెప్పిన ప్రతి మాట నా క్షేమం గురించి చెప్పిందే. శౌర్య నా కూతురే. ఇది కూడా నా బిడ్డే కదా. మీరే ఆశలు పెట్టుకుంటే నేను ఎన్ని ఆశలు పెట్టుకుంటారని దీప ఎమోషనల్ అవుతుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

కాళ్ల మీద దీప

నీకు మాటిస్తున్నా అత్తయ్య నీ కొడుకు వారసత్వాన్ని నీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది. కానీ నేను ఆ ఇంటికి వెళ్లాలి అని దీప మళ్లీ షాక్ ఇస్తుంది. మాట విన్నావు అనుకున్నా కానీ మొండి పట్టుదల వదల్లేదని కాంచన అంటుంది. అది నా పుట్టినల్లే అత్తయ్య. ఏం జరగదు అత్తయ్య అని దీప అంటుంది. ఇంటి దగ్గర ఉంటే అవిటి దానికి సేవలు చేయాలనుకుంటున్నావు కదా అని కాంచన అనగానే దీప ఆమె కాళ్ల మీద పడిపోతుంది.

మాటిచ్చిన కోడలు

మీరు నాకు జీవితాన్ని అందించారు. కోడలిగా ఆదరించారు. నా కూతురిని సొంత మనవరాలిగా చూస్తున్నారు. మీకు సేవలు చేసే అవకాశం రావడం నా అదృష్టం. నేను శివ నారాయణ ఇంటికి వెళ్లాలి. అందుకు కారణం ఉంది. కానీ ఇప్పుడే చెప్పలేం. చెప్పే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మీకు అర్థమవుతుంది. కడుపుతో ఉన్నాక సంతోషంగా ఉంటేనే కదా బిడ్డ ఆరోగ్యంగా పుట్టేది. నేను సంతోషంగా ఉండాలంటే ఆ ఇంటికి వెళ్లనివ్వండి. నా కడుపులో బిడ్డ క్షేమం కోసం నా ప్రాణం అడ్డుపెడతాను అత్తయ్య అని కాంచన చేతులు పట్టుకుంటుంది దీప.

ఆ ఇంటికి వెళ్లడానికి నాకు చెప్పకూడని కారణం ఉందని తెలుసు. ఇప్పుడు కోడలి మీద నమ్మకంతో వదిలేస్తున్నా. నేనే మొండిదాన్ని అనుకున్నా, కానీ ఇది నాకంటే మొండిది. దీప వాళ్ల ఇంటికి వెళ్లడం ఎవరికీ ఇష్టం లేదని కాంచన అంటుంది.

కావేరి బాధ

మరోవైపు ఫోన్లో కాంచన ఫొటో చూస్తూ ఫీల్ అవుతాడు శ్రీధర్. అది చూసి కావేరి షాక్ అవుతుంది. మీరు కాంచన అక్క దగ్గరకు వెళ్లిపోతారా? అని కావేరి అడగ్గానే శ్రీధర్ కంగుతింటాడు. నేను చాలా మారానండీ. ఇదివరకు నా ఆనందం తీసుకోవడంలో ఉండేది. ఇప్పుడు ఇవ్వడంలో కనిపిస్తోంది. ఇప్పుడు మీరు నన్ను మర్చిపోయారు. కొన్ని రోజుల నుంచి బెడ్ రూమ్ లో పడుకోవడం లేదు. హాల్లో లేదా మెడ మీద పడుకుంటారు. ఇప్పుడు కూడా మీరు కాంచనక్క ఫొటో చూసి బాధపడుతున్నారని కావేరి అంటుంది.

నిన్ను వదలను

అక్క ఫొటో పక్కన నా ఫొటో కూడా ఉండాలి కదా. మీ సంతోషం తప్ప నేను వేరే ఏం కోరుకోవడం లేదు. ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉండాలని కావేరి చెప్తుంది. నాకు కాంచన కావాలి, నువ్వూ కావాలి. స్వప్న, కార్తీక్ ఇద్దరూ నా బిడ్డలే. నా మనసులో దీప మీద తప్ప ఎవరి మీద ద్వేషం లేదు. నా కొడుకు డ్రైవర్ గా బతకడానికి దీపే కారణం. నేను కార్తీక్ విషయంలో దీపను ఎలా క్షమించలేనో కాంచన కూడా నన్ను క్షమించలేదు. కొన్నాళ్లు నన్ను వదిలేయ్. నేను మాత్రం నిన్ను వదలను అని శ్రీధర్ చెప్తాడు.

కార్తీక్ మాట

నా వల్ల నీకు దెబ్బ తగిలింది సారీ అమ్మ. నేను నానమ్మ దగ్గర పడుకుంటానని శౌర్య దీపను పట్టుకుని కడుపులోని బేబీకి సారీ చెప్తుంది. దీపను అర్థం చేసుకున్నందుకు తల్లికి థ్యాంక్స్ చెప్తాడు కార్తీక్. దీప నాకు మాటిచ్చింది. కానీ భయం కూడా ఉంది. రోడ్డు మీద సరిగ్గా వెళ్తున్నా రాంగ్ రూట్ లో వచ్చి డాష్ ఇస్తారు. ఇక్కడ మనం తప్పు చేశామా? లేదు. కానీ నష్టం జరిగింది. జీవితం కూడా డ్రైవింగ్ లాంటిదే. మనమంటే పడనివాళ్ల చేతలు నష్టం చేస్తాయని కాంచన అంటుంది. కొడుకుగా నేను కూడా మాటిస్తున్నానని కార్తీక్ చెప్తాడు.

జాగ్రత్తగా ఉండాలని

నువ్వెందుకు అత్త వాళ్ల ఇంటికి వస్తానంటున్నావో నాకు మాత్రం తెలుసు. నువ్వు అమ్మానాన్నలతో ఎక్కువ సేపు గడపాలని అనుకుంటున్నావు. కానీ మా అమ్మ భయం అంతా బిడ్డపై ఉందని కార్తీక్ అంటాడు. మనం పెళ్లి చేసుకుంటామని తాళి కట్టేంత వరకూ అనుకున్నామా? కానీ నేను ఎందుకు తాళి తెంపలేదు? కానీ అత్త ముందే ఎందుకు కట్టావ్? సంకల్ప బలం బావ. అంతా దైవ శాసనం. అన్న మాట జరిగి తీరాల్సిందే. కడుపులో బిడ్డకు ఏం కాదు. జ్యోత్స్న, పారిజాతమే కాదు ఎవరు వచ్చినా బిడ్డను ఏం చేయలేరని దీప చెప్తుంది.

నేను ఆదిశక్తిని అయితే నువ్వు ఆది శంకరుడివి. జ్యోత్స్న జస్ట్ మిస్ అయింది బావ అని దీప అంటుంది. నువ్వు, నేను కలిసి బేబీకి ఏం జరగకుండా చూసుకోవాలని కార్తీక్ అంటాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More