కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: అందరికీ షాకిచ్చిన దీప-ఆవేశంతో ఊగిపోయిన కాంచ‌న‌-స్వార్థ‌ప‌రురాలివి, అహంకార‌మంటూ ఘాటు మాట‌లు

కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 5 ఎపిసోడ్ లో దీపను ఇంటికి పనికి రావొద్దని శివన్నారాయణ ఫ్యామిలీ కోరుతుంది. కానీ మా బావ ఎక్కడుంటే తాను అక్కడే ఉంటానని దీప షాక్ ఇస్తుంది. ఈ మాటలతో కాంచనకు తిక్క రేగుతుంది. దీపపై ఇష్టం వచ్చినట్లు మండిపడుతుంది. 

Dec 5, 2025, 07:11:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 5 ఎపిసోడ్ లో రేపటి నుంచి దీప మా ఇంటికి రానవసరం లేదని దశరథ అంటాడు. తన ఆరోగ్యం గురించి డాక్టర్ ఇంతకుముందే చెప్పారు. ఇప్పుడు మరోసారి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థమైంది. అందుకే రేపటి నుంచి మా ఇంటికి రానవసరం లేదని సుమిత్ర కూడా చెప్తుంది. కాంచన, శివన్నారాయణ కూడా అదే మాట అంటారు. ఖర్చులన్నీ నేనే చూసుకుంటా, అవసరమైతే పని మనిషిని పెడతానని శివన్నారాయణ అంటాడు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

ఇంటికి రావొద్దని

దీపను మన ఇంటికి వచ్చేలా చేయ్ అని పారిజాతంతో జ్యోత్స్న చెప్తుంది. వెంటనే దీప మన ఇంటికి వస్తే సరిపోతుంది కదా అని స్టార్ట్ చేస్తుంది పారు. థ్యాంక్స్ అత్త మీరు అర్థం చేసుకున్నందుకు, పెద్ద మేడం మీరు ఏమంటారు? అని జ్యోత్స్నను అడుగుతాడు కార్తీక్. మా మాటే తన మాట. కార్పొరేట్ కంపెనీలో మెటర్నిటీ లీవ్ ఇస్తారు కదా ఇది కూడా అలాగే అని దశరథ అంటాడు.

షాకిచ్చిన దీప

నేను సెలవు తీసుకోవడం లేదని దీప షాక్ ఇస్తుంది. చూడు దీప నీ ఇష్టమే నా ఇష్టం. ఇక్కడున్నవాళ్లంతా నీ ఆరోగ్యం గురించే ఆలోచిస్తున్నారు. భార్య కడుపుతో ఉన్నప్పుడు భర్త కోరిక తీర్చడం భార్యకు ఆనందం. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని కార్తీక్ అడుగుతాడు. ఆలోచించి నిర్ణయం తీసుకోమంటాడు.

మామయ్య కాదు సర్

మరోవైపు ఆఫీస్ లో శ్రీధర్ ను కాశీ మామయ్య అని పిలుస్తాడు. నీ డ్యూటీ ఏంటీ? ఇది ఇల్లు కాదు మామయ్య అని పిలవడానికి. నాకున్న షార్ట్ టైమ్ లో నీకు ఆఫర్ చేయగలిగిన జాబ్ ఇదొక్కటే. ఇష్టం లేదంటే చెప్పు అని శ్రీధర్ అడుగుతాడు. కానీ స్వప్న గుర్తొచ్చి జాబ్ ఇష్టమే సర్ అని చెప్తాడు. నాకు పీఏ పోస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సర్ అని కూడా చెప్తాడు కాశీ.

షెడ్యూల్ ప్లాన్ ఎలా చేయాలో కాశీకి చెప్తాడు శ్రీధర్. ఫస్ట్ డేనే ఇలా ఉందంటే ఇక ముందు ముందు ఎలా ఉంటుందో అని అనుకుంటాడు కాశీ.

బావ ఎక్కడుంటే అక్కడే

ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు దీప. దేవుడు నీకు ఇంత పెద్ద కుటుంబాన్ని బహుమతిగా ఇచ్చాడు. నువ్వు నీళ్లు పోసుకుంటే వాళ్ల బిడ్డకు కడుపు వచ్చినంత సంతోషపడుతున్నారు. డాక్టర్ ను తీసుకొచ్చారు. అమ్మ లేని లోటు తెలియకూడదని సారె తెచ్చారు. పెద్దయ్య మీరు ఎలా చెప్తే అలా వింటానని చెప్పు అని దీపతో అనసూయ అంటుంది.

మా బావ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానత్తయ్యా అని దీప అంటుంది. దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో నీకంటే తెలివైన మనిషి మరొకరు ఉండరు దీప. చూశారా తాత మీరేమో కడుపు గురించి ఆలోచించి లీవ్ తీసుకోమంటున్నారు. కానీ అడగరు కదా అని బావను కూడా ఇంటికి రాకుండా చేస్తుందని జ్యోత్స్న అంటుంది. ఒకటే అర్థం మా బావ మీ ఇంటికి వస్తాడు, నేనూ మీ ఇంటికి వస్తానని స్పష్టం చేస్తుంది దీప.

బావతో పాటే

నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా ఆలోచించమని దశరథ అంటాడు. క్షమించండి మా బావ ఎక్కడుంటే అక్కడే ఉంటానని దీప మరోసారి చెప్తుంది. కార్తీక్ రాకపోతే నీకు ఓకేనా దీప అని అడుగుతాడు శివన్నారాయణ. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా దీప వినదు. కార్తీక్ నువ్వు రావొద్దురా అని శివన్నారాయణ అంటే, బావ నువ్వు నాకు రాసిచ్చిన అగ్రిమెంట్ ప్రకారం ఆగిపోవద్దని జ్యోత్స్న అంటుంది.

నేను వస్తానని కార్తీక్ అంటాడు. మా బావతో పాటే నేనూ వస్తాను. ఇంకెవరూ నన్ను అడగకండి. ఇబ్బంది పెట్టకండని దీప అంటుంది. అందరూ మొండివాళ్లే అని వెళ్లిపోతాడు శివన్నారాయణ.

మండిపడ్డ కాంచన

రాత్రి భోజనం కోసం కాంచనను పిలుస్తుంది దీప. భోజనం చేసే పరిస్థితుల్లో ఉంచావా నన్ను? భార్య మీద భర్తకు అధికారం ఉండదా? పుట్టబోయే బిడ్డ మీద అధికారం ఉండదా? మీ నాన్న చెప్తే విన్నారా? నేను అడిగితే సమాధానం చెప్పారా? మీ జీవితాలు మీకు ముఖ్యం. నీ భార్యకు నువ్వే చెప్పాలిరా. మీ తాత అంటే దీప ఇష్టం అంటావేంట్రా? దీప నువ్వు వెళ్లొద్దు అంటే నీ మాట వినదా? అని కాంచన ఫైర్ అవుతుంది.

అహంకారంతో

నీకు అహంకారమే. మనుషులంటే లెక్కలేనితనం. నువ్వు ఎవరి మాట వింటావని. నీకంటే పెద్దవాళ్లందరూ ఇంట్లో ఉండు అంటే ఎందుకు చెప్పారని ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు దీప. నువ్వు ఒక స్వార్థపరురాలివి. నీకు ఒక బిడ్డ ఉంది కాబట్టి ఈ బిడ్డ ఉంటే ఎంత? పోతే ఎంత? అనుకుంటున్నావ్ అని కాంచన ఘాటుగా మాట్లాడుతుంది.

కడుపుతో ఉన్న పెళ్లాలందరూ భర్త ఎక్కడుంటే అక్కడే ఉంటున్నారా? అని అనసూయ కూడా మండిపడుతుంది. మా నాన్న అంత బతిమిలాడితే సరే అని చెప్పలేదు. మా అమ్మ నా మనవరాలి రూపంలో మళ్లీ నా ఇంట్లో పుడుతుందని ఆశపడ్డా. కానీ ఆ ఆశలు మిగిల్చేలా లేదు. నీ కడుపులో ఉంది నా కొడుకు వారసత్వం. పారిజాతం, జ్యోత్స్న ఎలాంటి వాళ్లో నాకు తెలుసు అని కాంచన అనడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More