కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీప కోసం శివ‌న్నారాయ‌ణ టెన్ష‌న్‌- డాక్ట‌ర్‌తో కూతురి ఇంటికి- శౌర్య మ‌న‌సులో విషం నాటిన పారు

కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 3 ఎపిసోడ్ లో దీపకు కడుపు నొప్పి వచ్చిందని తెలిసి శివన్నారాయణ కంగారు పడతాడు. సుమిత్ర, పారుతో కలిసి డాక్టర్ ను తీసుకుని కాంచన ఇంటికి వెళ్తాడు. దీపను జాగ్రత్తగా ఉండమని డాక్టర్ చెప్తుంది. శౌర్య మనసులో పారు విషం నాటుతుంది. 

Published on: Dec 3, 2025, 07:03:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 3 ఎపిసోడ్ లో తొమ్మిది దాటిన పనివాళ్లు ఇంకా రాలేదని శివన్నారాయణతో కోపంగా చెప్తుంది పారిజాతం. కడుపుతో ఉన్న మనిషి, వట్టి మనిషి ఒకటే కాదు. అది ఆలోచించే తెలివి నీకు లేదు. రాక పోవడానికి కారణం ఉంటే అని పారుతో శివన్నారాయణ అంటాడు. కార్తీక్ కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. అందుకే పనివాళ్లకు చనువు ఇవ్వకూడదంటానని పారు అంటుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

శివన్నారాయణ టెన్షన్

కాంచనకు కాల్ చేస్తాడు శివన్నారాయణ. కార్తీక్ కు ఫోన్ ఇవ్వమంటాడు. వాళ్లు ఇంకా లేవలేదు. రాత్రి త్వరగా పడుకోలేదు. దీపకు కడుపులో నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్దామంటే వద్దని చెప్పిందని కాంచన చెప్తుంది. ఫోన్ పెట్టేసిన శివన్నారాయణ సుమిత్రను తీసుకు రమ్మని పారుకు చెప్తాడు. ముసలోడి టెన్షన్ చూస్తుంటే దీప కడుపు పోయినట్లే ఉంది. అదే నిజమైతే పండగే అని పారు అనుకుంటుంది.

డాక్టర్ తో ఇంటికి

కార్తీక్ లేచి టైమ్ చూస్తే పది అవుతుంది. డ్యూటీకి వెళ్లాలని కంగారు పడతాడు. దీపను లేపకుండా వెళ్లిపోతాడు. మరోవైపు జడల విషయంలో అనసూయతో సరదాగా గొడవ పడుతుంది శౌర్య. దీంతో వేగలేను చెల్లెమ్మ, ఎక్కడికైనా పంపించేయ్ అని అనసూయ అనగానే పారు చెప్పిన మాటలను కాంచన గుర్తు చేసుకుంటుంది. మా పిన్ని రాత్రి ఫోన్ లో అని కాంచన చెప్తుండగానే శివన్నారాయణ, సుమిత్ర, పారిజాతం కలిసి డాక్టర్ ను తీసుకొని వస్తారు.

మీ అమ్మ కదా

కార్తీక్ లేచి బయటకు వచ్చేసరికి అందరూ ఉంటారు. తాత ఏంటీ డాక్టర్ ను తీసుకొచ్చారని కార్తీక్ అడుగుతాడు. దీప కోసం రా, మేం అడిగే వరకూ మీరు ఏం చెప్పరు కదా. అమ్మ సుమిత్ర ముందు డాక్టర్ ను దీప దగ్గరకు తీసుకెళ్లమని చెప్తాడు శివన్నారాయణ. దీప కడుపులో పెరుగుతుంది నా మనవరాలు కాదు మీ అమ్మ అని అన్నావ్. అమ్మను ఇలాగేనే చూసుకునేది. నాకు చెప్పొద్దా అని కాంచనను శివన్నారాయణ అడుగుతాడు.

జాగ్రత్తగా చూసుకోవాలని

దీపను చెక్ చేస్తుంది డాక్టర్. ఎందుకు కడుపు నొప్పి వచ్చిందని డాక్టర్ అడిగితే దీప సైలెంట్ గా ఉండిపోతుంది. ఒక ఇంజక్షన్ ఇస్తుంది. ఇప్పుడు తనకు ఏ ప్రాబ్లెం లేదు సుమిత్ర కానీ ఇది మళ్లీ రిపీట్ కాకూడదని డాక్టర్ చెప్తుంది. దీప బాగానే ఉంది. కడుపు నొప్పి ఎందుకు వచ్చిందంటే పడుకున్నప్పుడు శౌర్య కాలు దీపకు తగిలిందని చెప్పిందని సుమిత్ర అంటుంది. 4 నెలల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్తుంది. నీరసంగా ఉన్నావు సుమిత్ర ఓ సారి హాస్పిటల్ కు రమ్మంటే రానని చెప్తుంది. జాగ్రత్తగా చూసుకోమ్మని చెప్పి డాక్టర్ వెళ్లిపోతుంది.

శౌర్య సంగతి

శౌర్య నిద్రలో కాలు వేసిందని కార్తీక్ చెప్తాడు. శౌర్య నేను సున్నుండ ఇవ్వలేదని అలిగి నా దగ్గర పడుకోను అన్నదని కాంచన అంటుంది. దొరికిందే ఛాన్స్ అని ఈ సమయంలో పిల్లలను కాస్త దూరంగా ఉంచాలని పారిజాతం నొక్కి చెప్తుంది. కార్తీక్ తన పక్కన పడుకోబెట్టుకుంటానని అంటే, పిల్లలను మరీ గారాబం చేయొద్దని కాంచన అంటుంది. పర్లేదు నా మాటలు కాంచన మీద బాగానే పని చేశాయని పారు అనుకుంటుంది. ముందు నువ్వు దీప గురించి, దీప కడుపులో బిడ్డ గురించి ఆలోచించు. శౌర్య సంగతి మేం చూసుకుంటామని కార్తీక్ కు చెప్తుంది కాంచన.

సున్నుండ ఇవ్వలేదని

నువ్వు రాత్రి మీ అమ్మను తన్నావా? అని శౌర్యను అడుగుతుంది పారిజాతం. నువ్వు అబద్దం చెప్తున్నావని శౌర్య అంటుంది. అబద్దం అయితే మీ అమ్మ ఇప్పటి వరకూ ఎందుకు లేవలేదు. డాక్టర్ ఎందుకు వచ్చారో చెప్పు. నువ్వు తన్నడంతో కడుపు నొప్పి వచ్చింది. నిన్ను ఈ రోజు నుంచి మీ అమ్మానాన్న దగ్గర పడుకోనివ్వరంటా. మీ నానమ్మ దగ్గర ఎందుకు పడుకోలేదని పారు అడుగుతుంది. నాకు సున్నుండ పెట్టలేదని శౌర్య చెప్తుంది.

ప్రేమ తగ్గిపోతుందని

నీ గురించి తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. మీ నానమ్మ మారిపోయిందే. మీ అమ్మకు ఒక బిడ్డ పుట్టబోతుంది కదా. మీ నానమ్మ ప్రేమ అంతా ఆ బిడ్డ మీదే ఉంది. నీ మీద లేదు. ఇప్పుడు మీ నానమ్మే, ఆ తర్వాత మీ నాన్న కూడా నిన్ను పట్టించుకోడు. నానమ్మ దగ్గరే పడుకో అంటాడు. నీ మీద మీ నాన్నకు, అమ్మకు ప్రేమ తగ్గిపోతుంది. పెద్దవాళ్లకంటే ఎప్పుడు కూడా చిన్నవాళ్లకే ప్రేమ ఉంటుంది. నీ మీద ప్రేమ లేనట్లే. నీకు కొత్త బట్టలు కొనరు. నీకు ఏదీ చేయరని విషం నాటుతుంది పారు.

నిన్ను ఇప్పటివరకూ యువరాణిలా చూశారు. ఇకపై శౌర్యలా చూడరు. అలా చూడాలంటే బాగా అల్లరి చేయాలి. నాకు బేబీ వద్దు అనాలి. ఈ రోజు నుంచి నేను చెప్పింది చేస్తే నువ్వే యువరాణివి. లేదంటే నువ్వు ఎవరికీ అవసరం లేదని పారు అనడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More