కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీప ప్రెగ్నెంట్ అవడం నీకిష్టం లేదు-కాంచనను రెచ్చగొట్టిన శ్రీధర్-మామయ్య పీఏగా కాశీకి జాబ్
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 1 ఎపిసోడ్ లో కార్తీక్, దీపను శివన్నారాయణ ఇంటికి పనికి వెళ్లకుండా చేసేలా కాంచనను రెచ్చగొడతాడు శ్రీధర్. దీప ప్రెగ్నెంట్ అవడం ఇష్టం లేదని అంటాడు. మరోవైపు శ్రీధర్ పీఏగా కాశీని ఒప్పిస్తుంది స్వప్న.
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 1 ఎపిసోడ్ లో కాంచన ఇంట్లో శ్రీధర్ ఉండగా కావేరి వస్తుంది. నా కోడలు దీప కోసం వచ్చాను. తాటి బెల్లంతో చేసిన సున్నుండలు మాత్రం దీపకే పెట్టు అక్క అని కాంచనతో అంటుంది కావేరి. తాత అస్తమానం వస్తాడని శౌర్య చెప్పడంతో దొరికిపోయానని శ్రీధర్ అనుకుంటాడు. సీఈఓ కదా కార్తీక్ తో మాట్లాడేందుకు వస్తాడని కాంచన కవర్ చేస్తుంది. ఇది కూడా ఆయన ఇల్లే కదా అని కావేరి చెప్తుంది.

కాంచనకు ఇష్టం లేదని
దీప గురించి మాట్లాడాలి. ఇన్ని రోజులు దీప అంటే నాకు మాత్రమే పెద్దగా పడదు అనుకునేవాణ్ని. కానీ మీ అమ్మకు కూడా దీప అంటే ఇష్టం లేదని ఈ రోజే తెలిసిందే. ఇంకా నిజం మాట్లాడాలి అనుకంటే దీప ప్రెగ్నెంట్ అవడం కూడా నీకు ఇష్టం లేదు కాంచన అని శ్రీధర్ బాంబ్ పేలుస్తాడు. దీపకు బిడ్డ పుట్టడం కూడా కాంచనకు ఇష్టం లేదని శ్రీధర్ అంటాడు. ఇక చాలు ఆపండి, నా కోడలి కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద నేను పెంచుకున్న ఆశల గురించి తప్పుగా మాట్లాడే అర్హత మీకు లేదని కాంచన సీరియస్ గా చెప్తుంది.
అమ్మ చచ్చిపోయేది
నువ్వు అంత ఆశలు పెట్టుకున్న అత్తగారివే అయితే కడుపుతో ఉన్న కోడలిని మీ నాన్న ఇంటికి పని చేయడానికి పంపించవు. ఈ రోజు నీ కోడలు కాలు జారి కింద పడిపోబోయింది నీకు తెలుసా? మా అమ్మ నా మనవరాలి రూపంలో మళ్లీ పుట్టబోతుందని మీ నాన్నతో అన్నావు. ఈ రోజు సుమిత్ర దీపను పట్టుకోకపోయి ఉంటే మీ అమ్మ మరోసారి చచ్చిపోయేది. నీకు తండ్రి మీద అంత ప్రేమ ఉంటే ఆ ఇంట్లో పని చేయడానికి ఇంకా ఎవరినైనా పంపించు కాంచన అని శ్రీధర్ అంటాడు.
రెచ్చగొట్టేలా శ్రీధర్
దీప అసలు నువ్వు పని చేయాల్సిన అవసరం ఏముంది? కాంచన ఇది నేను కాదు నువ్వు అడగాలి. ఎందుకు పనికి వెళ్తున్నావని అడగాలి అని శ్రీధర్ అంటాడు. దీప పడకుండా చూసుకునే బాధ్యత నాది అని కార్తీక్ మధ్యలో మాట్లాడతాడు. పడకుండా చూసుకుంటానని చెప్తున్నాడే కానీ పనికి మాత్రం పంపనని అనడం లేదు. చూడు కాంచన నీ పుట్టింటి మీద నీకున్న ప్రేమలో కనీసం పావు వంతు అయినా నీ కోడలి మీద చూపించు. వీళ్లిద్దరినీ ఆ ఇంటికి వెళ్లకుండా ఆపు. దీపను జాగ్రత్తగా చూసుకో. కుదరకపోతే కావేరీ క్యారేజీ పట్టుకుని వస్తుందని శ్రీధర్ కాంచనను రెచ్చగొడతాడు.
దీప నువ్వు ఆ ఇంటికి వెళ్లడానికి వీల్లేదు. దీని గురించి మీ భార్యాభర్తలు ఆలోచించుకుని మీ నిర్ణయం నాకు చెప్పండని కాంచన లోపలికి వెళ్లిపోతుంది. ఇప్పుడేం చేద్దాం బావ అని కార్తీక్ ను అడుగుతుంది దీప.
కాశీకి జాబ్
నాన్న కవర్ ఇచ్చాడని సంతోషంతో కాశీకి ఇస్తుంది స్వప్న. అది చూసి కోపంగా శ్రీధర్ దగ్గరకు వెళ్తాడు కాశీ. జ్యోత్స్న గ్రూఫ్ ఆఫ్ రెస్టారెంట్స్ సీఈఓకు పీఏగా జాబ్ ఇచ్చారు అత్తయ్య. నేను పర్సనల్ అసిస్టెంట్ గా చేయలేను మామయ్య. కావాలంటే బడ్డీ కొట్లో జాయిన్ అవుతాను. దీన్ని మీ దగ్గరే పెట్టుకోండని ఆఫర్ లెటర్ ను పారేసి వెళ్లిపోతాడు కాశీ. రూ.40 వేల జీతం. నా దగ్గర పని చేస్తే బిజినెస్ లోకి ఎంటర్ కావొచ్చు. సొంత రెస్టారెంట్ పెట్టుకోవచ్చని కావేరీతో శ్రీధర్ అంటాడు.
ప్రేమ కోసం
కాశీని ఒప్పిస్తానని బెడ్ రూమ్ లోకి వెళ్తుంది స్వప్న. నేను మా అన్నయ్య వాళ్ల ఇంటికి వెళ్తున్నా. ఇక రాను. నువ్వు మా నాన్న చెప్పిందానికి ఒప్పుకొంటే అన్నీ మర్చిపోయి ఇదివరకులా ఉంటా. లేదు నాకు నచ్చినట్లుగా ఉంటానంటావా? ఉండు కానీ నీతో నేను ఉండను. నీకు నేను కావాలి అంటే మా నాన్న చెప్పింది చేయ్. వద్దంటే చెప్పు మా అన్నయ్య దగ్గరకు వెళ్లిపోతా. జాయినింగ్ లెటర్ తీసుకుంటే కలిసి ఉంటామని అయిదు అంకెలు కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది స్వప్న. కాశీ ఆ లెటర్ తీసుకుంటాడు.
కాంచనను మేనత్త
మనం ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నామో తెలియక అడుగుతున్నారు. తెలిస్తే అడగరు కదా అని కార్తీక్ తో దీప అంటుంది. మరి నువ్వే శివన్నారాయణ వారసురాలివనే నిజం చెబుదామా అని కార్తీక్ అంటుండగా ఏంటా నిజం అంటూ కాంచన వస్తుంది. కానీ కార్తీక్ కవర్ చేస్తాడు. మేనత్తవు కదా ఎన్నైనా అంటావని దీప అనడంతో మేనత్త ఏంటీ? అని కాంచన అడుగుతుంది. కార్తీక్ కవర్ చేస్తాడు.
మీ నాన్న అన్నదాని గురించి ఏం ఆలోచించావు? ఆయన నిలదీసి అడిగింది నన్నురా. ఆయన అడిగిన ప్రశ్నే నేను అడుగుతున్నా. దీప కింద పడిపోయి ఉంటే ఏంటి పరిస్థితి? అని అడుగుతుంది కాంచన. మధ్యలో వచ్చిన శౌర్యపై కోప్పడుతుంది కాంచన. ఎవరు ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదని బాధ పడుతూ కాంచన వెళ్లిపోతుంది. నా కోపం ఎవరి మీద చూపించాలని కార్తీక్ ఫ్రస్టేట్ అవుతాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


