కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:స్వప్న, కాశీని కలిపిన కార్తీక్-కాంచనకు శ్రీధర్ బొట్టు -దీప ప్రెగ్నెంట్-షాక్‌లో జ్యో
కార్తీక దీపం 2 టుడే నవంబర్ 24 ఎపిసోడ్ లో స్వప్న, కాశీని కలుపుతాడు కార్తీక్. తన బెంగ అంతా అమ్మానాన్న గురించే అని చెప్తాడు. కాంచనకు బొట్టు పెడతాడు శ్రీధర్. దీప వాంతులు చేసుకుంటుంది. ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసి పారు, జ్యో షాక్ అవుతారు.
కార్తీక దీపం 2 టుడే నవంబర్ 24 ఎపిసోడ్ లో స్వప్న, కాశీ గొడవ పడుతుంటారు. అసలు మీ మధ్య ఏం జరుగుతుంది? అని కార్తీక్ వచ్చి అడుగుతాడు. కాశీ ఆపుతుంటే స్వప్న నిజం చెప్పేస్తోంది. జాబ్ లేకపోయినా వచ్చినట్లు అబద్దం చెప్పి కాశీ నన్ను మోసం చేశాడన్నయ్యా అని స్వప్న ఎమోషనల్ అవుతుంది. కాశీ కవర్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. మాట్లాడితే కొడతానని స్వప్న సీరియస్ అవుతుంది.

వదిలేసేందుకు వంద కారణాలు
ప్రేమకు, ప్రేమించిన మనిషికి విలువ ఇవ్వని ఇలాంటి మనిషి నాకు అవసరం లేదన్నయ్యా అని స్వప్న అంటుంది. ఓ మనిషిని వదిలేసేందుకు వంద కారణాలు ఉండొచ్చు. కానీ మనిషిని కలుపుకోవడం మాత్రం అంత తేలిక కాదు స్వప్న. మోసాన్ని నేను, మీ ఆయన కూడా భరించలేడు. మన ముగ్గురి లక్షణాలు ఒకటి. కానీ కొన్నిసార్లు ఆలోచించాలి. దీపను జ్యోత్స్న నెట్టేసింది. లాగిపెట్టి కొట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ కొట్టలేను. దీపకు ఏమవుతుందోననే భయం ఉంది. కానీ పైకి అలా లేను. ఇప్పుడు నేను భరిస్తున్నానని కార్తీక్ చెప్తాడు.
కలిసి ఉండాలని
నువ్వు ఆలోచించాలి స్వప్న. అనుకున్న టైమ్ కు జాబ్ రాలేదు. నీ సంగతి కాశీకి తెలుసు కదా. నిజం చెప్తే నువ్వు ఊరుకుంటావా? ఇల్లు పీకి పందిరి వేస్తావు. నీ ప్రేమ కోసం అబద్దం చెప్పాడు కాశీ. భార్యభర్తలంటేనే ఒకటి. ఇద్దరు కలిస్తేనే జీవితం. ప్రేమ కోసం అందరిని వదిలేసుకోవాలని అనుకున్నారు. ఇప్పుడు ఒకరిని ఒకరు వదిలేసుకుంటారా? ఇలా కలిసి ఉండండి అని స్వప్న చేతిలో కాశీ చేయిని పెడతాడు కార్తీక్. అప్పుడే చప్పట్లు కొడుతూ దాసు వస్తాడు.
కాంచన ఆందోళన
నా బెంగంతా దీప గురించే అల్లుడు. ఇంకా ఎన్ని రోజులని నా కూతురిని నువ్వు భరించాలని కార్తీక్ ను దాసు అడుగుతాడు. అతి పెద్ద సమస్య మా అమ్మది. అమ్మానాన్నను ఎలా కలపాలో అర్థం కావడం లేదు మామయ్య. ఆ మనిషి అందరు ఉన్నా ఒంటరిది అవుతుందని కార్తీక్ చెప్తాడు. మరోవైపు కోడలు కోసం బాధ పడుతున్న కాంచన దగ్గరకు శ్రీధర్ వెళ్తాడు. కోడలు బాగుంటే కొడుకు బాగుంటాడని కాంచన చెప్తుంది.
బొట్టు పెట్టిన శ్రీధర్
దైవ మంత్రాల సాక్షిగా ముడిపడిన మనుషులు ఇద్దరు కారు ఒక్కరే అవుతారు. కోడలు క్షేమం కోరుకుంటున్నానంటే కొడుకు క్షేమం కోరుకున్నట్లే అని కాంచన చెప్తుంది. మరి నన్ను ఎందుకు దూరం చేశావని శ్రీధర్ మళ్లీ అడుగుతాడు. కొన్నింటికి మౌనమే సమాధానమని కాంచన అంటుంది. కొన్నింటికి చేతలే సమాధానమని కాంచనకు బొట్టు పెడతాడు శ్రీధర్. అప్పుడే కావేరీ వస్తుంది. పైట చెంగుతో తుడుచుకుంటే బొట్టు చెదిరిపోయింది. అందుకే పెట్టానని శ్రీధర్ చెప్తాడు. మీరు అక్కకు బొట్టు పెట్టడంలో తప్పేముంది? నాకు చెప్పాల్సిన అవసరం లేదని కావేరీ అంటుంది.
పారిజాతం రచ్చ
పారిజాతం వచ్చి మళ్లీ రచ్చ చేయాలని చూస్తుంది. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు భార్యల్ని పక్కనపెట్టుకుని ఉన్న అల్లుడిని చూస్తుంటే దిష్టి తీయాలనిపిస్తుందని పారు అంటుంది. గుమ్మడికాయ, ఎర్రనీళ్లు తీసుకుని రండి. మీ కన్ను పడితే పచ్చని సంసారం కూడా తగలబడి బూడిది అయిపోతాయి. అందరూ దీప గురించి ఆలోచిస్తుంటే ఈవిడది మాత్రం ఎంతసేపు మొగుళ్లు, పెళ్లాలు గొడవ అని కావేరీ అంటుంది. కావేరీని ఆపి వెళ్లమని చెప్తాడు శ్రీధర్. ఎప్పటికైనా కాంచన, కావేరీ అక్కచెల్లెలిగా ఉంటారు. కానీ రెండింటికి చెడ్డ రేవడి అయ్యేది నువ్వే అని శ్రీధర్ ను పారు అంటుంది.
దీప వాంతులు
కార్తీక్ పిలవడంతో దీప నెమ్మదిగా కళ్లు తెరుస్తుంది. నాతో పాటు ఉపవాసం ఉన్నావు కదా, అన్ని పనులు చేసి నీరసం తెచ్చుకున్నావని దీపకు జ్యూస్ తాగిస్తుంది సుమిత్ర. దీప వాంతులు చేసుకుంటుంది. ముందు డాక్టర్ ను పిలిపించమని శివన్నారాయణ చెప్తాడు. నీకు, జ్యోత్స్నకు కలిపి తర్వాత థ్యాంక్స్ చెప్తానని శివన్నారాయణ అంటాడు.
కలలో అమ్మ
ఈ ఇంటికి ఒక విపత్తు ఉందని అన్నారు. దాని నివారణకు హోమం జరిపించాం. కానీ ఆనందం లేదు. ఇంటి వారసురాలికి మంచి జరుగుతుందని చెప్పారు. కానీ మాకు ఏం కనిపించడం లేదని దశరథ ఆవేదన చెందుతాడు. కనిపించదు కానీ వినిపించదు. ఇంట్లో ఏదైనా మంచి జరుగుతుంటే దానికి సంబంధించిన సన్నివేశాలు కలలోకి వస్తాయని గురువు చెప్తాడు. అమ్మ కలలోకి వచ్చిందని కాంచన అంటే, నాక్కూడా భార్య కలలోకి వచ్చిందని శివన్నారాయణ అంటాడు.
మీ మీదే పెద్ద బాధ్యత ఉంది. తండ్రి అవడమంటే బాధ్యతే కదా అని డాక్టర్ దీప గర్భం దాల్చడం గురించి చెప్తుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అయితే జ్యో, పారు మాత్రం షాక్ అవుతారు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


