కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపను తోసేసిన జ్యోత్స్న- దీపకు సుమిత్ర సేవలు- దీపే వారసురాలని పారిజాతంతో నోరు జారిన జ్యో!
కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 22 ఎపిసోడ్‌లో దీప చేతుల మీదుగా హోమంలో పూర్ణాహుతి పడటంతో జ్యోత్స్న పెద్ద రచ్చ చేస్తుంది. ఆఖరికి గురువు గారు దాని వల్లే మంచే జరిగిందని చెబుతాడు. కోపంతో దీపను తోసేస్తుంది జ్యోత్స్న. స్పృహ తప్పిపోయిన దీపకు సుమిత్ర సేవలు చేస్తుంది. పారుతో జ్యోత్స్న నోరు జారుతుంది.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో హోమంలో పూర్ణాహుతిని పడకుండా కింద పడేసేలా జ్యోత్స్న చేస్తే హోమంలోనే పడేటట్లు దీప చేస్తుంది. అంతా షాక్ అవుతారు. దీప చేత్తోనే హోమం పూర్తి అయిందని దాసు, కార్తీక్ సంతోషిస్తారు. దాసు వెళ్లిపోతాడు. దీపను పారిజాతం అనబోతుంటే శివ నారాయణ పూజ కానివ్వని అంటుంది.

నీ నుంచి జారితే దీప పట్టుకుంది
పంతులు వెళ్తానంటే.. జ్యోత్స్స ఆపి హోమం ఇంటి వారసురాలు చేతులతో పూర్తి కాలేదు. ఇంటి పని మనిషి దీపతో అయిందని అంటుంది. దీప వేసింది కానీ, కావాలని వేసిందా. నీ చేతులో నుంచి జారిపోతుంటే దీప పట్టుకోబోయింది. దాంతో హోమంలో పడింది అని కార్తీక్ అంటాడు. ఈవిడ అసలు పట్టుకుంటే కదా. ఆలోచనలన్నీ ఎక్కడో అని స్వప్న అంటుంది.
నోర్ మూయవే పిల్లకుంకా అని పారు అంటే.. కాశీ కోప్పడతాడు. నోర్ మూయిరా సన్నాసి అని పారు అంటుంది. మా అల్లుడిని అంటే ఊరుకోమని కావేరి అంటుంది. నువ్వు తప్పు చేసి దీపను అంటావేంటని జ్యోత్స్నను దశరథ్ అంటాడు. అంటే నేను తప్పులు చేస్తుంటే దీప వచ్చి కరెక్ట్ చేసిందంటారు అని జ్యోత్స్న అంటుంది.
నువ్వు కావాలని తప్పు చేస్తే దీప కరెక్ట్ చేసిందనుకోవచ్చు. నువ్వు కావాలనే తప్పు చేశావా అని శివ నారాయణ అంటాడు. అడుగుతున్నారుగా చెప్పు. పూర్ణాహుతి సరిగ్గా పట్టుకునే బాధ్యత నీది కాదా అని సుమిత్ర కూడా అంటుంది. జ్యోత్స్న అలాగే పెద్ద రచ్చ చేస్తుంది. పూర్ణాహుతి కింద పడితే అరిష్టం అన్నారు. మరి ఈమె చేతులమీదుగా పడితే అరిష్టం కాదా అని జ్యోత్స్న అంటుంది. కాదమ్మా అని గురువు అంటాడు.
మనుషుల కోరికలతోనే
అదేలా గురువు గారు. అది ఒక అనాథ అని పారిజాతం అంటాడు. భగవంతుడు పిల్లలను అనాథలుగా పుట్టించడు. మనుషుల కోరికలు, వికృత వాంఛల వల్ల అనాథలుగా మారుతారు అని ఇన్‌డైరెక్ట్‌గా పారును అంటాడు గురువు. ఇక పూర్ణాహుతి కిందపడితే అరిష్టం జరిగేది. అలా జరగకుండా దీప ఆపింది. అందుకు దీపను మెచ్చుకోవాల్సిందే అని గురువు అంటాడు.
దాంతో అంతా సంతోషిస్తారు. జ్యో, పారు మాత్రం రగిలిపోతారు. చెప్పు దీప నీకే అందరూ వత్తాసు పలుకుతున్నారు. నువ్వు ఏం చేసిన నన్ను ఫూల్‌ను చేయడానికేగా అని దీపను తోసేస్తుంది. దీప కిందపడిపోతుంది. అంత దీపను లేపుతారు. దీప స్పృహ తప్పిపోతుంది. జ్యోత్స్నను కోపంగా పారు చూస్తుంది. జ్యోత్స్న నువ్వు అసలు మనిషివేనా అని శివ నారాయణ తిడతాడు.
తర్వాత దీప కళ్లు తెరుస్తుంది. దీపను లోపల పడుకోబెట్టమని సుమిత్ర చెబుతుంది. కొన్ని జీవితాలు అంతేనేమో మంచి చేసి కూడా బాధపడాలి అని కార్తీక్ అంటడు. దీప పడుకుని ఉంటుంది. అందరికి ప్రసాదం పెట్టమని సుమిత్ర అంటే సరే మమ్మీ అని జ్యో అంటుంది. నీకు చెప్పానా. స్వప్న అందరికి ప్రసాదం పెట్టు. అత్తయ్య జ్యోత్స్నను పక్కకు తీసుకెళ్లు అని సుమిత్ర అంటుంది.
దీపకు సుమిత్ర సేవలు
దాంతో జ్యోత్స్నను పారు తీసుకెళ్తుంది. దీప చేయి రుద్దుతూ సుమిత్ర సేవలు చేస్తుంది. అందరిని బయటకు వెళ్లమని, దీపతో తానుంటానని సుమిత్ర చెబుతుంది. ముందు దీపను కోలుకోనివ్వండి, దీనికి కారణమైన వాళ్లను ఏం చేయాలో చూద్దాం అని శివ నారాయణ అంటాడు. జ్యోత్స్నను తిడుతుంది పారిజాతం. ఎప్పుడు ఏదో పెంట చేసి ఛీ అనిపించుకుంటున్నావ్ పారు అంటుంది.
ఎవరి చేత్తో పడిన పర్లేదు కానీ దీప చేత్తో పడకూడదు అని జ్యోత్స్న అంటుంది. ఎందుకు, దాన్ని కూడా వేరే అనుకోవచ్చుగా అని పారు అంటుంది. అనుకోను. ఎందుకంటే దీపే ఈ ఇంటి అని జ్యోత్స్న ఆగిపోతుంది. చెప్పవే దీప ఎవరు అని పారు అంటుంది. ఈ ఇంటి పని మనిషి. అదంటే నాకు పడదు అని జ్యో అంటుంది. దీపను ఏం చేయకుంటే వారసురాలి స్థానాన్ని కూడా పోగొట్టుకుంటాను అని జ్యో నోరు జారుతుంది.
అదేంటీ అదెలా. నువ్వు దాసు కూతురు అని తెలియాలి. లేదా సుమిత్ర కూతురు బతికి రావాలి. ఈ రెండు కాకుండా నువ్వు వారసురాలి స్థానం కోల్పోతావ్ అని పారు అడుగుతుంది. నీ కొడుకు దీపకు చెబితే అని జ్యోత్స్న అంటుంది. దీప ఇంకా స్పృహలోకి రాలేదు. నువ్వు ఎదురుపడితే కార్తీక్ గాడు కొట్టిన కొడతాడు అని పారు అంటుంది. అది ఇంకా నాటకం ఆడుతుంది అని ఇంకా రగిలిపోతుంది జ్యోత్స్న.
ప్రసాదం పెట్టని స్వప్న
అందరికి ప్రసాదం పెట్టి కాశీకి పెట్టదు స్వప్న. అది చూసిన కార్తీక్ కాశీకి కూడా ప్రసాదం పెట్టమని చెబుతాడు. స్వప్న పెడుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.













