కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:హోమం జరగనివ్వనని జ్యో-మ‌ర‌ద‌లుకు కార్తీక్ వార్నింగ్‌-వారసురాలివి కాదా అని ప్రశ్న-పారుకు డౌట్

కార్తీక దీపం 2 టుడే నవంబర్ 19 ఎపిసోడ్ లో కావేరీ చేతులు పట్టుకుని మరీ పారిజాతం బతిమిలాడుతుంది. హోమానికి వస్తామని కావేరీ చెప్తుంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది ఆపేయ్ అని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. జ్యోపై పారుకు డౌట్ వస్తుంది. 

Published on: Nov 19, 2025, 06:57:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే నవంబర్ 19 ఎపిసోడ్ లో పారిజాతం, జ్యోత్స్న వచ్చి హోమానికి రావాలని పిలిస్తే వస్తానని చెప్తాడు శ్రీధర్. కానీ మా ఆవిడ వస్తానంటేనే వస్తానని కండీషన్ పెడతాడు. కానీ కావేరీ మాత్రం రానంటుంది. నేను వేరు, మీరు వేరు. నేను వస్తే మీరు తల దించుకోవాల్సి వస్తుందని కావేరీ అంటుంది. కావేరీ చేతులు పట్టుకుని సారీ చెప్తుంది పారు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

వస్తామన్న కావేరీ

మీరు ఇలా బతిమిలాడాల్సిన అవసరం లేదు. ఫోన్ చేసి చెప్పినా వచ్చేవాళ్లం. కానీ మీరు నా భర్తను అవమానించారని కావేరీ అంటుంది. సారీ చెప్పాను కదా అని పారు మళ్లీ రిక్వెస్ట్ చేస్తుంది. సరే, వస్తానని కావేరీ చెప్పే సరికి హమ్మయ్యా అంటూ రిలాక్స్ అవుతుంది పారు. అందరిని రమ్మని చెప్పి పారు వెళ్లిపోతుంది. స్వప్న, కాశీకి మధ్య ఏదో జరిగిందని కార్తీక్ కు డౌట్ వస్తుంది.

కార్తీక్ వార్నింగ్

చూడు చిన్న మరదలా.. ఆపేయ్. నువ్వేదో కొత్తగా గేమ్ స్టార్ట్ చేశావ్ అది ఆపేయ్. మామయ్య ఫ్యామిలీని పిలువు అవసరం ఉంది అదేంటో తర్వాత చెప్తానని పారుతో అన్నావు కదా. అంతా ప్రశాంతంగా ఉందనుకున్నా ప్రతిసారి పద్ధతిగా నాశనం చేస్తావు. రేపు జరగబోయే హోమం మన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. ఏ కారణంతోనైనా దాన్ని చెడగొట్టాలనుకుంటే అని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. ఈ ఇంటి వారసురాలికి మంచి జరుగుతుందని చెప్పినప్పుడు హ్యాపీగా ఉండొచ్చు కదా. మరి నువ్వేదో వారసురాలివి కాదు అన్నట్లు బిహేవ్ చేస్తావు ఏంటీ? అని జ్యోత్స్నను అడుగుతాడు కార్తీక్.

వారసురాలివి కాదా?

నేను సుమిత్ర కూతురిని కాదు అని నీ ఉద్దేశమా? అని అడుగుతుంది జ్యో. ఈ మాట నువ్వే అన్నావు. నువ్వు సుమిత్ర, దశరథల కూతురివి కాదా? ఈ ఇంటి వారసురాలివి కాదా? అని అడుగుతాడు కార్తీక్. నేను శివన్నారాయణ మనవరాలిని, దీంట్లో ఏ అనుమానం లేదని జ్యో చెప్తుంది. ఇదంతా తలుపు చాటు నుంచి వింటున్న శివన్నారాయణను చూసి భయపడుతుంది.

హోమం జరగదని

నువ్వు, జ్యోత్స్న ఏం మాట్లాడుకుంటున్నారాని పారు తొంగి చూస్తుంది. పాపం, మధ్యలో నిలబెట్టి మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ తో అంటాడు శివన్నారాయణ. వెళ్లిన పని అయిందని, రేపు వాళ్ల ఫ్యామిలీ అంతా హోమానికి వస్తున్నారని పారు చెప్తుంది. దాసును పిలిచారా? రేపు హోమం నిర్విగ్నంగా జరుగుతుందనే నమ్మకం నాకు వచ్చిందని కార్తీక్ తో తాత అంటాడు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఈ హోమం జరగదు బావ అని జ్యోత్స్న అనుకుంటుంది.

పారుకు డౌట్

కావేరీని మన ఫ్యామిలీలో మెంబర్ ను చేశాడంటే ఆవిడ స్థాయి పెరిగిందా? మనం దిగజారిపోయామా? హోమం సక్రమంగా జరగదు గ్రానీ. గురువు చెప్పిన దేంట్లోనూ మనం లేం. ఫ్యామిలీకి విపత్తు రాబోతుందన్నాడు. మనం వాళ్ల ఫ్యామిలీ కాదు. ఇంటి వారసురాలికి మంచి జరగబోతుందన్నాదు. అది కూడా నేను కాదు ఆ దీ.. అసలైన వారసురాలికి అని పారుతో జ్యో అంటుంది. ఈ ఇంటి అసలైన వారసురాలు ఎవరో నీకు తెలుసు అని గట్టిగా అడుగుతుంది పారు.

నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు, నేను ఒకటి అని జ్యోత్స్న కవర్ చేస్తుంది. గురువు అన్న ఆ అరిష్టం జరగాలి. ఎవరో ఒకరికి ఏదో ఒకటి జరగాలి. అప్పుడే మన మాట వింటారని జ్యో అంటుంది. నువ్వు శివన్నారాయణ మనవరాలివి. ఇది బ్రహ్మ రాసిన రాత కాదు పారిజాతం రాసిన రాత అని పారు గర్వంగా అంటుంది. ఈ హోమం జరగకూడదని జ్యో అనుకుంటుంది.

కార్తీక్ ధైర్యం

హోమం చేస్తే ఏం కాదమ్మా అని కాంచనకు ధైర్యం చెప్తాడు కార్తీక్. మా అమ్మకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఓ గురువు ఇలాగే చెప్పాడు. కానీ పరిహారం చేసేలోపే చనిపోయిందని కాంచన బాధ పడుతుంది. కావేరీని రమ్మనడం ఏంటీ? మా నాన్న మారిపోయారు. హోమం పూర్తయ్యే వరకు నువ్వు, దీప దగ్గరుండి చూసుకోండని కాంచన చెప్తుంది. జ్యోత్స్న గురించి కాంచన బాధపడుతుంది.

ఒకేసారి శివన్నారాయణకు భార్య, కాంచనకు తల్లి జ్యోత్స్న కలలోకి వస్తుంది. ఇద్దరు ఉలిక్కిపడి లేస్తారు. మీరు నన్ను మర్చిపోలేదని తెలుసు, మళ్లీ మీ ముందుకు వస్తానని చెప్పింది అక్క అని అనసూయతో అంటుంది కాంచన. ఫోన్ లోని తల్లి ఫొటోకు ముద్దు పెడుతుంది కాంచన. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More