కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న‌పై తాత సీరియ‌స్‌-నిజాలు మాట్లాడిన శ్రీధ‌ర్‌-కూతురికి మళ్లీ షాకిచ్చిన సుమిత్ర

కార్తీక దీపం 2 టుడే నవంబర్ 13 ఎపిసోడ్ లో ఇంట్లో నుంచే కాదు దేశం వదిలి వెళ్లిపో అని జ్యోత్స్నపై సీరియస్ అవుతాడు శివన్నారాయణ. పెళ్లి చేసుకో జ్యో అని లగేజీ లోపల పెడుతుంది సుమిత్ర. శ్రీధర్ నిజాలు మాట్లాడతాడు. పారుకు దీప కౌంటర్ వేస్తుంది. కాంచన, శ్రీధర్ ను కలపాలని కార్తీక్ కు చెప్తాడు తాత.

Published on: Nov 13, 2025 6:54 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే నవంబర్ 13 ఎపిసోడ్ లో మీ ప్రేమ కావాలి, మీతో ఉండే అవకాశం కావాలి. అది ఇలా అందింది. నీపై నాకు ఎలాంటి కోపం లేదు. జ్యోత్స్న నువ్వు కంపెనీలో ఉండాలని శ్రీధర్ అంటాడు. కానీ జ్యోత్స్న మాత్రం కోపంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంది. చేతులు కట్టుకుని నిలబడ్డానికే అలవాటు పడ్డ జీవితాలకు కూర్చోవడానికి చోటిస్తే ఎగిరి గెంతేస్తారు. కానీ శాసించే స్థితిలో ఉన్నవాళ్లకు చిన్న అవమానం అగ్గి లాంటిదని జ్యోత్స్న అంటుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

శివన్నారాయణ ఫైర్

నాకు జరిగిన అవమానం చాలు. ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్లిపోతా ఎవరికి ఇష్టం ఉన్నా, లేకపోయినా అని జ్యోత్స్న అంటుంది. వెంటనే శివన్నారాయణ వెళ్లిపో అని గట్టిగా అరుస్తాడు. ఈ క్షణమే ఇంటి నుంచే కాదు ఈ దేశం వదిలి వెళ్లిపో. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించని తొందరపాటు మరోసారి తప్పు చేయిస్తోంది. జ్యోత్స్న భవిష్యత్ ఏమవుతుందేమోనని సుమిత్ర బాధపడుతోందని శివన్నారాయణ అంటాడు. అవును, అందుకే జ్యోత్స్న బాధపడుతోందని తెలిసినా నాన్న కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడని అంటాడు దశరథ.

పెళ్లి చేసుకో జ్యోత్స్న

నువ్వు చెప్పత్తా. అన్ని నీ కళ్ల ముందే జరిగాయి. జ్యోత్స్న సీఈఓగా ఉండాలని నువ్వు అనుకుంటే తాత చేతులు పట్టుకొని అయినా ఒప్పిస్తానని కార్తీక్ అంటాడు. నా తండ్రికి పదవి ఇవ్వడం వల్ల నీ కూతురు నీకు దూరం కావడం నాకిష్టం లేదు. నీ కోసం ఏమైనా వదులుకోవడానికి అంతా సిద్ధంగా ఉన్నామంటాడు కార్తీక్. నా నిర్ణయంలో ఎప్పుడూ మార్పు లేదు. జ్యోత్స్న నువ్వు నాతో ఉండు. నేను కోరుకున్నట్లు ఉండు. మంచి సంబంధం చూస్తారు పెళ్లి చేసుకో అని జ్యో లగేజీని లోపలికి తీసుకెళ్తుంది సుమిత్ర.

అందరిని తీసుకొచ్చి

నువ్వు మాజీ సీఈఓ. నేను సీఈఓగా వర్క్ స్టార్ట్ చేస్తా కాబట్టి. కంపెనీ లావాదేవీలు, లాభనష్టాలు నువ్వే చెప్పాల్సింది. అందుకే టీమ్ లో ఉండాలని శ్రీధర్ అడుగుతాడు. నీకిచ్చే రెస్పెక్ట్ నీకు ఇస్తారని కార్తీక్ అంటాడు. వెనకాల నుంచి నడిపించేది నువ్వే. చాపకింద నీరులా పాక్కుంటూ పోతున్నావో మాకు తెలియదా? మిగిలిన మూడు ‘క’లను కూడా తీసుకొచ్చి ఏదో ఒక పోస్టు ఇచ్చేయండి. అంటే కాంచన, కావేరీ, కాశీని తీసుకొచ్చి పెట్టండని పారిజాతం వాగుతుంది.

నిజాలు చెప్పిన శ్రీధర్

శ్రీధర్ ను సీఈఓ చేయడమన్నది పూర్తిగా నా నిర్ణయం. మీరు చేసిన తప్పును ఎదుటివాళ్లు చెప్తే కానీ బుద్ధి రాదా? అని శివన్నారాయణ మండిపడతాడు. నా కొడుకుతో అగ్రిమెంట్ రాయించుకోవడం తప్పు కాదా? వీణ్ని ఇలా బంధీ చేశారు కాబట్టి జ్యోత్స్న రెస్టారెంట్ ఇంకా ఉంది. లేదంటే నా కొడుకు స్పీడ్ కు సత్యరాజ్ రెస్టారెంట్ ఇంకో నాలుగు బ్రాంచీలు విస్తరించి ఉండేదని నిజాలు మాట్లాడతాడు శ్రీధర్.

దీప కౌంటర్

జ్యోత్స్న అగ్రిమెంట్ రాయించడం తన తెలివితేటలే అల్లుడు. శివన్నారాయణ మనవరాలు తన అపారమైన తెలివితేటలతో అగ్రిమెంట్ అనే స్పీడ్ బ్రేకర్ వేసి కంపెనీని కాపాడింది. జ్యోత్స్నకు సీఈఓ పోస్టు కాదు ఎండీ పోస్టు ఇవ్వొచ్చని అంటుంది పారిజాతం. చావుబతుకుల్లో నిలబడ్డ వ్యక్తితో అగ్రిమెంట్ చేయించుకోవడం తెలివితేటలు కాదు స్వార్థం. మేరుపర్వతం లాంటి నా బావ చిన్న రాళ్ల గుట్ట ముందు చేతులు కట్టుకొని నిలబడటం ఏమవుతుంది? నా బావ ఔన్నత్యాన్ని కొలవడానికి సరిపడా పదాలు నా దగ్గర లేవు అని దీప కౌంటర్ వేస్తుంది.

తప్పు చేశా

వీళ్లంతా నీ కారణంగానే మీ నాన్న సీఈఓ అయ్యారని అనుకుంటున్నా. కానీ నాకు మాత్రమే తెలుసు అది పూర్తిగా నా నిర్ణయమే అని. నువ్వు సీఈఓ అయితే బాగుండు అనిపించింది. కానీ అడ్డుపడుతుందని ముందే తెలుసు. అనుకోకుండా దీప పేరు ముందుకొచ్చింది. అయినా ఓకే అనుకున్నా. కానీ దీప చేయనంది. అందుకే మొదటగా అనుకున్న మనిషిని పిలిపించా. మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడనే మీ అమ్మ ముందు కొట్టా. ఇంటి నుంచి గెంటేశా. నేను చేసిన తప్పే నా కూతురు కూడా చేసిందని కార్తీక్ తో శివన్నారాయణ చెప్తాడు.

మనమే కలపాలి

నా కూతురి జీవితానికి అన్యాయం చేశా. న్యాయం చేయాలంటే ముందు నీ తండ్రిని క్షమించాలి. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా. మీ నాన్నను సీఈఓగా ఒప్పుకొన్నానని తెలియగానే మీ అమ్మ ఎంతో కొంత ఆలోచిస్తుంది. మళ్లీ వాళ్లను ఒక్కటి చేసేందుకు దారి అవుతుంది. మనమే వాళ్లను కలపాలి. కార్తీక్ మీ అమ్మ మనసు మార్చే ప్రయత్నం చేయమని చెప్తాడు తాత.

మాట మార్చిన కాంచన

మీ నాన్నను సీఈఓగా మా నాన్న ఒప్పుకొన్నారంటే ఆశ్చర్యంగా ఉందని కాంచన అంటుంది. పిల్లనిచ్చే మామకు పెట్టే హక్కు, కొట్టే హక్కు ఉంటుంది. తప్పు చేశాడని దూరం పెట్టారు. మార్పు చూసి దగ్గరకు తీసుకున్నారని అనసూయ అంటుంది. మాట వరసకు కూడా ఇద్దరికి కలిపి ఏమనొద్దని అంటుంది కాంచన. ఒకవేళ నీ అభిప్రాయంతోనే జరగాల్సి వస్తే నాన్నను సీఈఓగా కావాలంటావా? వద్దా? అని తల్లిని అడుగుతాడు కార్తీక్.

నా భర్త ముందుండాలని కోరుకునే నేను ముందు ఉండాలని ఎందుకు కోరుకుంటానని దీప అంటుంది. ఇది పూర్తిగా నా తండ్రి నిర్ణయమేనని అంటుంది కాంచన. మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైమ్ ఇది అని కార్తీక్ అంటే, కాంచన డైవర్ట్ చేస్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

News/Entertainment/కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న‌పై తాత సీరియ‌స్‌-నిజాలు మాట్లాడిన శ్రీధ‌ర్‌-కూతురికి మళ్లీ షాకిచ్చిన సుమిత్ర
News/Entertainment/కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న‌పై తాత సీరియ‌స్‌-నిజాలు మాట్లాడిన శ్రీధ‌ర్‌-కూతురికి మళ్లీ షాకిచ్చిన సుమిత్ర