కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పారును ఇంట్లోనుంచి వెళ్లిపొమ్మన్న శివన్నారాయణ-శ్రీధర్‌తో కాళ్లబేరం-జ్యోకు అవమానం
కార్తీక దీపం 2 టుడే నవంబర్ 18 ఎపిసోడ్ లో జ్యోత్స్న మారదని కార్తీక్ తో అంటుంది దీప. అందరికీ బుద్ధి చెప్తానని కార్తీక్ భరోసా ఇస్తాడు. హోమం జరిగేలా చూడాలని దీపను కోరతాడు దశరథ. పారుపై సీరియస్ అయిన శివన్నారాయణ.. శ్రీధర్ కుటుంబాన్ని పిలవాలని పంపిస్తాడు.
కార్తీక దీపం 2 టుడే నవంబర్ 18 ఎపిసోడ్ లో తనలో ఏ మార్పు రాదని జ్యోత్స్న నిరూపించుకుంటూనే ఉంది బావ. ఆమెను కొట్టాలి. మామయ్య పెళ్లిల్ల గురించి ఆమెకు ఎందుకు? మామయ్య నీ కోసం పూర్తిగా మారిపోయారు. హోమానికి కావేరీని పిలవమని తాత అనగానే ఎంత సంతోషపడ్డానో. కానీ అంతా చెడగొట్టిందని కార్తీక్ తో దీప చెప్తుంది.

తాతను అడ్డుపెట్టుకుని
దారిలో వెళ్తుంటే రాయి కారణంగా దెబ్బ తగిలితే కట్టు కంటుకుంటావా? రాయితో గొడవ పెట్టుకుంటావా? అని కార్తీక్ అడుగుతాడు. హోమానికి అందరూ వస్తారు. కట్టు కట్టుకున్న తర్వాత రాయికి బుద్ధి చెప్పాలి కదా. తాతయ్యను అడ్డుపెట్టుకుని అందరికీ బుద్ధి చెప్తానని దీపతో కార్తీక్ అంటాడు. ఇటు జ్యోత్స్న వయసేంటీ? దాని మాటలేంటీ అని దశరథతో అంటుంది సుమిత్ర.
సుమిత్ర కంగారు
మనం దాన్ని ఇలాగే వదిలేస్తే అత్తయ్య మాటలు విని ఎందుకు పనికిరాకుండా తయారవుతుందని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న దాసును చంపాలనుకుందనే విషయం తెలిస్తే తట్టుకోలేవు సుమిత్ర అని దశరథ అనుకుంటాడు. జ్యోత్స్న పెళ్లి విషయంలో తొందరపడొద్దని దశరథ అంటాడు. గురువు గారు విపత్తు అన్నారు కదా అని భయంగా ఉంది. పరిహారం జరగదండి. అందరూ రావాలి. ఇంటి అల్లుడు రాకపోతే ఎలా? గురువు గారు చెప్పిన దోషం ఎవరి ప్రాణాన్నైనా తీస్తే అని సుమిత్ర కంగారు పడుతుంది. అనవసర విషయాల గురించి ఆలోచించకు అని దశరథ చెప్తాడు.
హోమం జరగాలి
నేను మాత్రం నిన్ను కూతురిలానే చూస్తున్నా. సుమిత్రను తల్లిలా అనుకుంటావని తెలుసు. కన్నకూతురి కంటే ఎక్కువ ప్రేమనే చూపిస్తున్నావు. నిన్ను ఎవరైనా తక్కువగా చూసినా, పొరపాటున ఏమైనా మాట అన్నా పట్టించుకోకు. జ్యోత్స్నను నీ తోబుట్టువు అనుకో. బావను చాలా మాటలన్నారు. గురువు గారు చెప్పిన విపత్తు ఏ రూపంలో రాబోతుందని సుమిత్ర బాధపడుతుంది. నాక్కూడా భయంగా ఉంది. సుమిత్ర బాధ్యత నీకు, కార్తీక్ కు అప్పగిస్తున్నా. మీరు ఏం చేస్తారో చేయండి. హోమం మాత్రం జరగాలని దీపకు చెప్తాడు దశరథ.
శ్రీధర్ ను పిలవాలని
తాత పిలుస్తున్నాడని కార్తీక్ వచ్చి పారిజాతాన్ని రమ్మంటాడు. ఆయన సింహం అయితే నేను సివంగిని అని పారు రెచ్చిపోతుంది. రానంటే రానని అంటుంది. అసలు తగ్గేదేలేదన్నట్లు పారు మాట్లాడుతుంది. పెద్ద మేడం మిమ్మల్ని కూడా పిలుస్తున్నారని కార్తీక్ చెప్తాడు. పారు, జ్యోత్స్న కలిసి వెళ్తారు. నువ్వు, జ్యోత్స్న శ్రీధర్ ఇంటికి వెళ్లి, రేపు మన ఇంట్లో జరిగే హోమానికి వాళ్ల కుటుంబాన్ని పిలవాలని శివన్నారాయణ చెప్తాడు.
పిలిస్తేనే ఎంట్రీ
నేను పిలిచాను, నువ్వు అవమానించావు. వాళ్లు రారు. అందుకే నువ్వు, జ్యోత్స్న వెళ్లి పిలవండి. లేదంటే నా మాట వినని మనషులు నాకెందుకు? ఈ క్షణమే నీ వస్తువులు తీసుకుని ఇంటిని వదిలి వెళ్లిపోవచ్చు. నాకు తెలియకుండా ఆ ఇంటికి చాలా సార్లు వెళ్లావు. ఇప్పుడు వెళ్తావా? లేదా? జ్యోత్స్నతో కలిసి వెళ్లి పిలిస్తేనే పారుకు ఇంట్లోకి ఎంట్రీ అని శివన్నారాయణ ఫైర్ అవుతాడు. వెళ్తానని పారు చెప్తుంది. వెళ్లడమే కాదు వస్తామని వాళ్లతో మాట తీసుకోవాలని కూడా శివన్నారాయణ చెప్తాడు.
మీరెవరు అంటూ శ్రీధర్
పారు మాటలను తలుచుకుని శ్రీధర్ బాధపడతాడు. అప్పుడే తన ఇంటికి పారు, జ్యోత్స్న వస్తారు. వాళ్లను చూసి వీళ్లెవరూ అని అడుగుతాడు. మా అత్తగారు ఏనాడో చచ్చిపోయారు. ఈ అమ్మాయిని నేనెక్కడ చూసినట్లు లేదే. ముక్కు మొహం తెలియనివాళ్లతో మామయ్య అని పిలిపించుకునే అలవాటు నాకు లేదమ్మా. కార్తీక్ నువ్వు ఒక్కడివే లోపలికి రా అని పిలిచి శ్రీధర్ లోపలికి వెళ్లిపోతాడు.
కాశీ కౌంటర్
పారు, జ్యోత్స్న కలిసి శ్రీధర్ ఇంట్లోకి వెళ్తారు. కావేరీ నీ చేత్తో ఓ గ్లాస్ చల్లని మజ్జిగ పట్టుకురా అని మామూలుగా మాట్లాడేందుకు ట్రై చేస్తుంది పారు. ఇంతకీ మీరెవరో చెప్తారా? అసలు లోపలికి ఎందుకు వచ్చారు? అని శ్రీధర్ అడుగుతాడు. ఇక్కడ జరుగుతుంది చూశా. అక్కడ జరిగింది విన్నానని కావేరీ చెప్తుంది. అప్పుడే కాశీ వచ్చి ఇంటికి వచ్చిన మనిషిని నిలబెట్టే మాట్లాడుతున్నావు ఏంటీ స్వప్న అని అంటాడు. నేను చెప్పింది మా బావ గురించి అని కౌంటర్ ఇస్తాడు.
మామయ్య ఇక ఆటపట్టించింది చాలు. రేపు మా ఇంట్లో హోమం ఉంది. పిలవమని తాత చెప్పాడు. మీరు రావాలని మేమూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని జ్యోత్స్న చెప్తుంది. శ్రీధర్ కాలు మీద కాలు వేసుకుని వినపడలేదంటాడు. పారు మరోసారి చెప్తుంది. చూడు అల్లుడు ప్రేమతో పిలుస్తున్నానని పారు అంటే, మేం రామని శ్రీధర్ చెప్తాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


