కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న ప్లాన్ అట్టర్ ఫ్లాప్- దీపతోనే హోమం పూర్తి- కాంచన మనసులో మాటను అడ్డుకున్న దాసు!
కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 21 ఎపిసోడ్‌లో శ్రీధర్‌ను క్షమించమని కాంచనతో శివ నారాయణ అడుగుతాడు. భర్తను క్షమించాలంటే అని కాంచన మనసులో మాట చెప్పబోతుంటే దాసు వచ్చి అడ్డుకుంటాడు. హోమం ఫెయిల్ చేయడానికి నానా రకాలుగా ప్రయత్నించిన జ్యోత్స్న ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. దీపతోనే హోమం పూర్తి అవుతుంది.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న సారీ చెప్పి కావేరి కాళ్లకు పసుపు రాస్తుంది. మిగతా వాళ్లకు కూడా రాయు అని సుమిత్ర అంటే.. నేను రాస్తాను అని దీప తీసుకుంటుంది. జ్యోత్స్న అంతా బాగానే చేసింది కానీ ఈ కార్తీక్ గాడు వచ్చి అంతా చెడగొట్టాడు అని పారిజాతం మనసులో అనుకుంటుంది. కాంచన కాళ్లకు పసుపు రాస్తుంది.

భర్తను క్షమించలేవా
అది చూసి సుమిత్ర, దీప మురిసిపోతారు. కార్తీక్ సంతోషిస్తాడు. సుమిత్ర కాళ్లకు కూడా దీప పసుపు రాస్తుంది. ఎమోషనల్ అవుతుంది. కాంచనతో శ్రీధర్ గురించి శివ నారాయణ మాట్లాడుతాడు. ఆ మాటలు శ్రీధర్ వింటుంటాడు. శ్రీధర్ వింటుంది కార్తీక్ చూస్తాడు. శ్రీధర్ విషయంలో మార్పు చూసి అవమానించిన నేనే అధికారం ఇచ్చాను. నిన్ను ఒకటి అడగాలి. నీ భర్తను క్షమించలేవా అని శివనారాయణ అంటాడు.
నేను శ్రీధర్‌ను సీఈఓ చేయడానికి ఒక కారణం కార్తీక్ అయితే మరోటి నువ్వు. నువ్వు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నావో నాకు తెలుసు. నాకోసం అయినా నీ భర్తను క్షమించలేవా. నాకోసం నీ భర్తను క్షమించాలమ్మా అని కాంచన చేయి పట్టుకుని మరి శివ నారాయణ అడుగుతాడు. క్షమిస్తాను నాన్న. నువ్వు అడుగుతున్నావ్ కాబట్టి క్షమిస్తాను. కానీ, భర్తగా మాత్రం దగ్గరికి తీసుకోలేను అని కాంచన అంటుంది.
అల్లుడు మోసం చేయడానికి, భర్త మోసం చేయడానికి చాలా తేడా ఉంది. నా భర్తను దైవంలా చూశాను. నువ్వు క్షమించినంత సులభంగా నేను క్షమించలేను. క్షమించినా భర్తగా తీసుకోలేను. కావేరికి నా భర్తను ఇచ్చేశాను. నేను ఎప్పుడు ఆయన్ను క్షమించి భర్తగా తీసుకుంటానో తెలుసా అని కాంచన చెబుతుంటే దాసు వస్తాడు. దాంతో అంతా దాసును ఆహ్వానిస్తారు.
శ్రీధర్ డౌట్
శ్రీధర్ ఎమోషనల్ అవుతాడు. హాయ్ మావయ్య అంటూ శ్రీధర్ వెనుక నుంచి కార్తీక్ వెళ్తాడు. అది చూసి వీడెప్పుడు వచ్చాడు. అంతా విన్నాడా అని డౌట్ పడతాడు శ్రీధర్. దాసు రావడం ఆలస్యం అయుంటే కాంచన మనసులో ఉన్న మాట చెప్పేది అని శివ నారాయణ, శ్రీధర్ ఒకేలా ఆలోచిస్తారు. కిందకు వచ్చిన జ్యోత్స్న దాసును చూసి షాక్ అవుతుంది. ఇంతలో పంతులు వస్తాడు.
ఇంకా ఈ ఇంటి వారసురాలి కోసం వెతుకుతున్నావా అని దాసుతో పారు అంటే అవును అనుకో అంటాడు. రేయ్ నీ కూతురుకి ద్రోహం చేస్తున్నావు అని పారు అంటే.. అది నువ్వు ఎప్పుడో చేశావ్ అని దాసు అంటాడు. ఇంట్లో హోమం జరిపిస్తారు పంతులు. కాశీ, స్వప్నను కార్తీక్ గమనించి గొడవ జరిగిందనుకుంటాడు.
పూర్ణాహుతిని పట్టుకుని ఇంటి వారసురాలితో కలిసి చుట్టూ తిరిగి హోమంలో వేయాలి. మీ చేతి నుంచి పూర్ణాహుతి హోమంలోనే పడాలి. అలా కాకుండా కింద పడితే వచ్చే విపత్తను ఎవరు అడ్డుకోలేరు. ఏం భయంలేదు. ఇష్ట దైవాన్ని స్మరించుకోని వేయండి అని పంతులు చెబుతాడు. ఇంటి వారసులు దీప. జ్యోత్స్నతో వేయిస్తే అరిష్టం. తెలిసి కూడా ఏం చేయకుంటే ఎలా అని దాసు ఆలోచిస్తాడు.
కార్తీక్ మాట కోసం
జ్యోత్స్నకు వద్దని దాసు సైగ చేస్తే పట్టించుకోదు. పారిజాతం వచ్చి దాసును పక్కకు తీసుకెళ్లి జ్యోత్స్న దగ్గరికి ఎందుకు వెళ్తున్నావ్. ఎవరికైనా ఏమైనా కానీ నీ కూతురుకు ఏం కాదుగా అని పారు అంటుంది. జరగాల్సిన అరిష్టం ఆపుతాను అని దాసు అంటాడు. దాసుతో పారు మాట్లాడటం కార్తీక్ చూస్తాడు. కార్తీక్‌కు మాట ఇవ్వకుంటే దీప వారసురాలని చెప్పేవాన్ని అని దాసు అనుకుంటాడు.
అన్నయ్య కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే చూస్తు ఉండలేను. నిజం బయటపడే సమయం వచ్చినట్లుందేమో. జ్యోత్స్న నా కూతురు అని అందరికి చెప్పేస్తాను అని ఇంట్లోకి వస్తాడు దాసు. సుమిత్ర కళ్లు తిరుగుతుంటే దీప పట్టుకుంటుంది. అది చూసి దాసు ఆగుతాడు. మీకేం కాదు మీకు సాయంగా ఉంటాను అని దీప అంటుంది. జ్యోత్స్న అరిస్తే శివ నారాయణ అంటాడు.
కర్మ సిద్ధాంతం బాగా పనిచేస్తుంది. కన్నతల్లికి కన్న కూతురు సాయం చేస్తుంది. కానీ, నా ముందు ఏ సిద్ధాంతం పనిచేయదు అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇంటి వారసురాలే సుమిత్రకు సహాయంగా ఉండేలా దేవుడు చేశాడని దాసు అనుకుంటాడు. పూర్ణాహుతిని హోమంలో వేయమని పంతులు చెబుతాడు.
దీపతోనే హోమం పూర్తి
దాంతో సుమిత్ర, దశరథ్, దీప పూర్ణాహుతిని జ్యోత్స్న చేతులో వేస్తుంటారు. పక్కకు జ్యోత్స్న చూస్తూ కింద పడేస్తుంది. కానీ, దీప తన చేతులతో పూర్ణాహుతి హోమంలోనే పడేలా చేస్తుంది. అదంతా చూసి అంతా షాక్ అవుతారు.
జ్యోత్స్న, పారు ప్లాన్ అట్టర్ ప్లాప్ అవుతుంది. వారసురాలి చేత్తోనే పూర్ణాహుతి పడిందని దాసు, కార్తీక్ సంతోషిస్తారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


