కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ర‌చ్చ చేసిన జ్యోత్స్న‌-కావేరి గురించి నీచ‌పు మాట‌లు-ర‌గిలిపోయిన కార్తీక్‌-జ్యో సారీ

కార్తీక దీపం 2 టుడే నవంబర్ 20 ఎపిసోడ్ లో కావేరీ, కాంచనతో కలిసి శివన్నారాయణ ఇంటికి హోమానికి వస్తాడు శ్రీధర్. కావేరి, కాంచన, స్వప్న, దీప కాళ్లకు జ్యోను పసుపు రాయమంటుంది సుమిత్ర. అప్పుడు జ్యో గొడవ స్టార్ట్ చేస్తుంది. కావేరి, స్వప్నను నానా మాటలంటుంది. కార్తీక్ ఫైర్ అవుతాడు. జ్యో సారీ చెప్తుంది.

Published on: Nov 20, 2025, 07:13:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే నవంబర్ 20 ఎపిసోడ్ లో హోమానికి ఏర్పాట్లు చేస్తారు. కావేరీ, కాంచన కుటుంబాలతో కలిసి అప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. శ్రీధర్ ను చూసి దిగాడండీ ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు అని అనుకుంటుంది పారిజాతం. ఇంట్లో చిన్న పిల్ల ఉంటే ఆ సందడే వేరు అని శౌర్యను చూసి సుమిత్ర సంబరపడుతుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

శివన్నారాయణ పరివారం

కావేరీని సుమిత్ర వదిన అని పిలుస్తుంది. కలిసి చాలా రోజులైంది కదా ఎలా ఉన్నారు? అని అడుగుతుంది. కావేరీ అండి అంటే వదిన అని పిలవమని చెప్తుంది సుమిత్ర. జరిగిన గతాన్ని మర్చిపోయి అందరం ఇలాగే ఉండాలని శివన్నారాయణ అంటాడు. ఇకపై ఇదంతా శివన్నారాయణ పరివారమే అని అంటాడు. మమ్మల్ని మీ కుటుంబంలో కలుపుకున్నారని కావేరీ చేతులెత్తి దండం పెట్టి ఎమోషనల్ అవుతుంది. కొన్నింటికి గుర్తింపు ఆలస్యంగా వస్తుందంటాడు శివన్నారాయణ.

కావేరీ అత్త

కాంచనకు హాయ్ చెప్తుంది జ్యోత్స్న. మేనత్తతో మేనకోడలికి సరసం ఉండాలంటుంది. అవును అమ్మాయి గారు అని దీప అంటుంది. అమ్మాయి గారు ఏంటీ వదిన పేరుతో పిలువు, మనమందరం చుట్టాలమని చెప్పారు కదా తాతయ్య అదంతా అబద్దమా అని స్వప్న అడుగుతుంది. అబద్దం కాదు ఆడపడుచు, ఇప్పుడు మనమందరం ఒకే కుటుంబం. కాంచన అత్త అని పిలిచినట్లు, కావేరీ అత్త అని పిలవొచ్చు కదా అని జ్యో అంటుంది. ముందు ముత్తైదువు కాళ్లకు పసుపు రాయి, అమ్మవారికి మొక్కుకున్నానని జ్యోకు చెప్తుంది సుమిత్ర.

జ్యో గొడవ

నువ్వు ఈ నలుగురికి, మీ నానమ్మకు రాస్తే చాలని జ్యోకు చెప్తుంది సుమిత్ర. నీ భర్త నీతో ఉన్నాడు మమ్మీ నువ్వు ముత్తైదువే, గ్రానీ భర్త గ్రానీతో ఉన్నాడు ఆమె ముత్తైదువే, దీప, స్వప్న కూడా ముత్తైదువులే కదా. కానీ అత్తతో భర్త లేడుగా అని జ్యో గొడవ స్టార్ట్ చేస్తుంది. అత్తతో భర్త లేడని మాట్లాడాను కానీ అత్తకు భర్త లేడని కాదు. అత్తకు, మామయ్యకు ఘనంగా పెళ్లి జరిగింది. అంతే కానీ గుళ్లో సీక్రెట్ గా పెళ్లి జరగలేదు. శ్రీధర్ ఎవరంటే కాంచన భర్త అంటారు కానీ కావేరీ భర్త అనరు కదా. కార్తీక్ తండ్రి అంటారు కానీ స్వప్న తండ్రి అనరు కదా అని జ్యో నానామాటలు అంటుంది.

నీచమైన మాటలు

జ్యోత్స్న నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావని దీప అంటుంది. నీకు కొంచమైనా బుద్ధి ఉందా పిన్ని, వయసుకు మించి జ్యోత్స్న మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావని కాంచన సీరియస్ అవుతుంది. నీకు అన్యాయం జరిగింది అత్త అని జ్యో అంటే, అది నీకు సంబంధం లేని విషయమని కాంచన చెప్తుంది. నువ్వు త్యాగం చేసినంత మాత్రాన వీళ్లకు గుర్తింపు రాదత్తా. ఇంకా పచ్చిగ మాట్లాడాలంటే ఈవిడను ఉంపుడుగత్తె అంటారని జ్యో అంటుంది. సుమిత్ర కోపం చేయి ఎత్తుతుంది కానీ కావేరీ ఆపుతుంది.

స్వప్న కన్నీళ్లు

నా కూతురి కోసం నీ కూతురి మీద చేయి చేసుకోవడం నాకు ఇష్టం లేదు వదిన. తప్పు నాదే. రమ్మని పిలవగానే రాను అని చెప్పాల్సింది. ఎందుకంటే నా పెళ్లే సక్రమమైంది కాదు. నా బతుకే సక్రమమైంది కాదు అని కావేరీ బాధపడుతుంది. కాంచన మాట్లాడుతుంటే వద్దు పెద్దమ్మ నువ్వు కూడా ఏం మాట్లాడొద్దు. ఇక్కడ మాకెంత మర్యాద ఉందో అర్థమైంది. అమ్మ పద వెళ్దాం. మమ్మల్ని వెళ్లనియ్యు అత్త. ఆ ఇంటికొచ్చి పిలిచింది, ఈ ఇంటి వాకిట్లో నిలబెట్టి అవమానించేందుకే అని అర్థమైందని అమ్మను తీసుకుని స్వప్న వెళ్తుంది.

కార్తీక్ ఫైర్

అప్పుడే కార్తీక్, శివన్నారాయణ వస్తారు. నువ్వెందుకు ఏడుస్తున్నావ్ చెప్పు అని స్వప్నను అడుగుతాడు కార్తీక్. అమ్మ గురించి జ్యోత్స్న చాలా నీచంగా మాట్లాడింది అన్నయ్య అని స్వప్న కన్నీళ్లు పెట్టుకుంటుంది. జ్యోత్స్న మా చిన్నమ్మను ఏమన్నావ్? అని కార్తీక్ ఫైర్ అవుతాడు. సుమిత్ర ఏమైందని దశరథ అడుగుతాడు. ఎక్కడో మొదలెట్టి ఏదేదో మాట్లాడింది. కొట్టబోతే కావేరీ వదిన ఆపింది. లేదంటే చెంప పగిలేదని జ్యో గురించి చెప్తుంది సుమిత్ర.

జ్యోత్స్న సారీ

మేమంతా ఒకటే కుటుంబం. నీకేంటి బాధ? నచ్చితే మాట్లాడు లేదంటే మానేయ్. అంతే కానీ నోటికొచ్చినట్లు మాట్లాడకు. నేను మా చిన్నమ్మ, చెల్లి గురించి మాట్లాడుతున్నా. ముందు వాళ్లకు సారీ చెప్పు అని కార్తీక్ అడుగుతాడు. శివన్నారాయణ కూడా జ్యోపై సీరియస్ అవుతాడు. జ్యోత్స్న కావేరీకి సారీ చెప్పు అని శివన్నారాయణ కూడా అంటాడు. సారీ అత్త, ఏదో తెలియక అలా మాట్లాడానని జ్యో చెప్తుంది. కావేరీ అత్త కాళ్లకు పసుపు రాయమని కూతురికి చెప్తుంది సుమిత్ర. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More