కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న పతనం, ముచ్చెమటలు పట్టేలా కార్తీక్ వార్నింగ్- శివ నారాయణ డౌట్- నిజం దాచిన దీప
కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 29 ఎపిసోడ్‌లో దీపకు జ్యోత్స్న కాలు అడ్డు పెట్టడం గురించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. కార్తీక్ మాటలకు జ్యోత్స్నకు ముచ్చెమటలు పడతాయి. డేంజర్‌లో ఉన్నానుకుంటుంది జ్యో. దీప పడేలా ఎవరైనా కారణం అయ్యారా అని శివ నారాయణ డౌట్‌గా అడుగుతాడు. దీప మాత్రం నిజం దాస్తుంది.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దీప కడుపు పోవాలని కావాలనే జ్యోత్స్న కాలు అడ్డం పెడుతుంది. కానీ, సుమిత్ర పట్టుకుంటుంది. జ్యోత్స్నను దీప కోపంగా చూస్తుంది. దీపకు అంతా జాగ్రత్తలు చెబుతారు. సుమిత్ర కాపాడటం గుర్తుకు చేసుకుని రగులుపోతింది జ్యోత్స్న. మనుషుల బంధాల మధ్య ఏదో పవర్ ఉంటుందనుకుంటా. అందుకే అమ్మమ్మే బిడ్డను కాపాడుకుంది అని జ్యో అనుకుంటుంది.

నిలదీసిన కార్తీక్
కానీ, ప్రతిసారి అది పనిచేయదు. ఈసారి నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తాను అని జ్యో అనుకుంటుంటే కార్తీక్ వస్తాడు. కాలు తడబడటం వల్ల దీప పడిపోయింది. కాలు అడ్డం పెట్టడం వల్ల నా భార్య పడిపోయిందా అని అడుగుతాడు కార్తీక్. నీకు అనుమానం వస్తే నన్ను అడుగుతావేంటీ అని జ్యోత్స్న అంటుంది.
ఎవరైనా కాలు అడ్డం పెట్టడం చూశారా అని కార్తీక్ అడిగితే.. లేదని జ్యో అంటుంది. మరి మీరు పెట్టారా అని కార్తీక్ అడుగుతాడు. దాంతో జ్యోకి చెమటలు పడతాయి. సమాధానం వస్తుందనుకుంటే చెమటలు వస్తున్నాయి. చూల్లేదు కాబట్టే ఇలా అడుగుతున్నా. చూసి ఉంటే కర్ర పట్టుకుని వచ్చేవాన్ని. ఇక్కడ తల మీద కొడితే కింద పడిపోవాలి అని కార్తీక్ అంటాడు.
దాసును నేను కొట్టినట్లు చెబుతున్నాడేంటీ అని భయపడుతుంది జ్యోత్స్న. ఇంకాస్తా లోతుగా దాని గురించి చెబుతాడు కార్తీక్. నా భార్యకు, కడుపులో బిడ్డకు ఏమైనా ప్రమాదం తలపెట్టాలని చూస్తే నేను కొట్టే దెబ్బ అలాగే ఉంటుంది. కడుపులో బిడ్డను చంపాలని చూస్తే ఆడ అయినా, మగ అయినా వదిలిపెట్టను. నేను దీప భర్తలా ఉన్నాను. కార్తీక్‌లా మారితే కురుక్షేత్రమే అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు కార్తీక్.
జ్యోత్స్న పతనం
నాకు తిరిగి ఇవ్వడం అలవాటు. నేను వాళ్లకు తిరిగి ఇస్తే పతనమైపోతారు. కాలు అడ్డు పెట్టినవాళ్లు మీకు తెలిస్తే వాళ్లకు చెప్పండి. వాళ్ల పతనం మొదలైనట్లే. వాళ్లను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి అర్హత ఏంటో గుర్తు చేస్తా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు కార్తీక్. భయంతో చెమటలు తుడుచుకుంటుంది జ్యోత్స్న. నీకు ఏం తెలుసో ఏం తెలియదో, ఏం చేస్తావో అర్థం కావట్లేదు. నేను మాత్రం డేంజర్‌లో ఉన్నాను అని జ్యోత్స్న అనుకుంటుంది.
మరోవైపు కాంచన ఇంటికి వెళ్లిన శ్రీధర్ ఆవేశంగా మాట్లాడుతాడు. నేను కావేరిని వదిలేసి వస్తే నువ్వు నన్ను భర్తగా అంగీకరిస్తావా అని శ్రీధర్ అడుగుతాడు. అంగీకరించను. కావేరిని వదిలేయడం ఏంటీ అని నిలదీస్తుంది కాంచన. మీరు వెళ్లకుంటే నేను ఇంట్లోంచి వెళ్లిపోయేదాన్ని. నేను నా మనసులో నుంచి తీసేసాను. అనేవాళ్లు అంటారు. వీలైతే సమాధానం చెప్పండి అని కాంచన అంటుంది.
శివ నారాయణ కొట్టింది, కార్తీక్ తిట్టింది, స్వప్న అసహ్యించుకుంది అన్ని చెబుతుంటాడు శ్రీధర్. సంవత్సరం చెత్తంతా మళ్లీ ఇంటి ముందు వేసుకున్నట్లుందని కాంచన అంటుంది. తిట్టిన అందరు నన్ను అర్థం చేసుకున్నారు. కానీ, నేను అన్న పదాన్ని కలుపుకునేది నీతోనే. నా జీవితం ఉంటే నీతో ఉండాలి లేదా నీ జ్ఞాపకాలతో పోవాలి అని శ్రీధర్ అంటాడు.
శ్రీధర్‌కు శిక్ష
మనం కలిసి ఉండలేం. మీరు ఆ ఇంటిని కూల్చేశారు అని కాంచన గట్టిగానే చెబుతుంది. సరే అదే శిక్ష అనుభవిస్తాను. ఇంకోటి కూడా అడగాలి. దానికి కార్తీక్, దీప ముందు అడగాలి. వాళ్లు వచ్చాకే అడుగుతాను అని శ్రీధర్ అక్కడే ఉంటాడు. మరోవైపు దీపను పని తక్కువ చేసుకో అని కార్తీక్ మొక్కలకు నీళ్లు పోస్తాడు. ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటారు.
జ్యోత్స్నకు కార్తీక్ వార్నింగ్ ఇవ్వడం చూశానని దీప చెబుతుంది. నిజం చెప్పు జ్యోత్స్న కాలు అడ్డం పెట్టిందిగా అని కార్తీక్ అంటాడు. నేను చెప్పానా అని దీప అంటుంది. డౌట్ వచ్చింది కాబట్టే వార్నింగ్ ఇచ్చా లేకుంటే తోమేసేవాన్ని. ఏమైనా ఈరోజు మన అదృష్టం బాగుందని కార్తీక్ అంటుంటే నిజమేనని శివ నారాయణ వస్తాడు.
అలవాటైన ఇంట్లో పడిపోయావంటే ఎవరైనా పడిపోటానికి కారణమయ్యారా అని శివ నారాయణ డౌట్ పడతాడు. కార్తీక్ చెప్పబోతుంటే దీప ఆపి ఎవరు చేస్తారు. అంతా నా మంచి కోరుకునేవాళ్లే అని దీప నిజం దాస్తుంది. కార్తీక్, దీప వాళ్లు వెళ్లిపోతారు.
కాంచన ఇంటికి కావేరి
కార్తీక్, దీప కోసం కాంచన దగ్గర శ్రీధర్ ఎదురుచూస్తుంటాడు. ఇంతలో కావేరి క్యారేజ్ పట్టుకుని వస్తుంది. అది చూసి ఇద్దరు షాక్ అవుతారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


