కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:కార్తీక్‌ ఆఫ్ట్రాల్ డ్రైవ‌రన్న కాశీ-శ్రీధ‌ర్ ఫైర్-దీప‌ను అవ‌మానించిన జ్యో-సుమిత్ర చెంపదెబ్బ

కార్తీక దీపం 2 టుడే నవంబర్ 26 ఎపిసోడ్ లో దీప, కడుపులో బిడ్డ జోలికి వెళ్లకంటూ జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు దాసు. దీపకు సేవలు చేసుకుంటానని కార్తీక్ అంటాడు. కార్తీక్ గురించి నోరుజారిన కాశీపై ఫైర్ అవుతాడు శ్రీధర్. దీపను అవమానించిన జ్యో చెంపై కొడుతుంది సుమిత్ర. 

Published on: Nov 26, 2025, 07:06:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే నవంబర్ 26 ఎపిసోడ్ లో దీప బిడ్డ ఓ గొప్పింటి బిడ్డగానే ఈ అంతపురంలో అడుగుపెడుతుంది. ఇది భవిష్యవాణి. దీన్ని ఎవరూ ఆపలేరమ్మా. రాతను ఎవరూ మార్చలేరు. మార్చాలని నీ చేతులు ప్రయత్నిస్తే నీ తలరాతను నేను మారుస్తానని జ్యోత్స్నకు దాసు వార్నింగ్ ఇస్తాడు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

దాసు వార్నింగ్

దీపకే కాదు కడుపులో బిడ్డకు అన్యాయం చేయాలని చూసినా పిలవగానే ఆ దేవుడు ప్రత్యక్షమవుతాడో లేదో తెలియదు కానీ నేను మాత్రం ప్రత్యక్షమవుతా. నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నా. ఎప్పుడు వస్తానో తెలియదు. కానీ నువ్వు తప్పు చేస్తే మాత్రం కచ్చితంగా వస్తాను. నువ్వు అన్నింటికి సిద్ధంగా ఉండు. నువ్వు నా కూతురు అని తెలిసే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పి దాసు వెళ్లిపోతాడు.

దీపకు జాగ్రత్తలు

ఇప్పుడు కన్సీవ్ అయ్యావని తెలిసినప్పటి నుంచే మందులు వాడాలి. నెలకోసారి టెస్టు చేయించుకోవాలి. కనీసం రోజుకు 8 గంటలు నిద్రపోవాలి. ప్రోటీన్ ఫుడ్ తినాలంటూ దీపకు జాగ్రత్తలు చెబుతాడు కార్తీక్. రాత్రి అమ్మ కలలోకి వచ్చిందని గురువుకు అమ్మ, తాత చెప్పారు. అదే సమయంలో నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని తెలియడం. పెద్దమ్మ శౌర్యకు ఆడపిల్ల బొమ్మ కొనియ్యడం.. ఇవన్నీ చూసి నేను ఏం అనుకోవాలని కార్తీక్ అడుగుతాడు. నాకు ఎవరైనా ఓకేనని అంటాడు.

నాన్న అనే పిలుపు

సంతోషంతో కార్తీక్ ను హత్తుకుంటుంది దీప. చాలా ఆనందంగా ఉంది. తెలియకుండానే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ 9 నెలలు రంగుల రాట్నంలా తిరిగిపోతే బాగుండని దీప అంటుంది. వద్దు మరదలా. కడుపులో బిడ్డ పెరగడం ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? పుట్టబోయేది బిడ్డ కాదు నాన్న అనే పిలుపు. ఈ 9 నెలలు నీకు సేవలు చేయాలి. ఓ చంటి పాపాయిలా చూసుకోవాలి. ఈ ప్రయాణం ఎంత బాగుంటుందో తెలుసా? అంటూ కార్తీక్ ఫీల్ అవుతాడు. మా ఇద్దరికి సేవలు చేసుకోమని దీప అంటుంది.

మన బిడ్డ భూమ్మీదకు వచ్చే లోపు ఏ సమస్యా ఉండకూడదు. కుటుంబం అంతా ఒకటిగా కలిసి ఉండేలా చేయాలి. రేపటి నుంచి తాతయ్య ఇంటికి రాకూడదు అని కార్తీక్ చెప్తాడు. లేదు బావ వస్తా. అక్కడ అమ్మానాన్నలు ఉంటారని దీప చెప్తుంది. పారు మంచిది కాదు నేనే దీపను జాగ్రత్తగా చూసుకోవాలని కార్తీక్ అనుకుంటాడు.

ఆఫ్ట్రాల్ కారు డ్రైవర్

మరోవైపు స్వప్నకు కాశీ డాష్ ఇస్తాడు. సారీ చెప్తాడు. బావ మన ఇద్దరిని కలిపాడు కదా అని కాశీ అంటే, అన్ని మర్చిపోయి ముందులా ఉండలేనని స్వప్న అంటుంది. నీకు జాబ్ వచ్చేంతవరకూ ఇలాగే ఉంటా. మా అన్నయ్యను చూడు. భార్యను ఎప్పుడూ మోసం చేయలేదు. మా అన్నయ్య ఏదైనా అనుకుంటే చాలు సాధించేవరకు వదిలిపెట్టడని స్వప్న అంటుంది. ఏంటీ అన్నయ్య అన్నయ్య అంటున్నావ్. ఏమైనా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హా? ఆఫ్ట్రాల్ కారు డ్రైవర్ అని కాశీ గట్టిగా అరుస్తాడు.

శ్రీధర్ సీరియస్

అప్పుడే కావేరీ, శ్రీధర్ వస్తారు. ఏంటీ నా కొడుకును పట్టుకుని ఆఫ్ట్రాల్ కారు డ్రైవర్ అంటున్నాడు. నా కొడుకుకు ఉన్న స్థాయి నీకుందా? నన్ను ఏమైనా అంటే పడతా కానీ నా కొడుకును అంటే ఊరుకోను. రూ.50 వేల కోసం కంపెనీలు తిరిగే నువ్వెక్కడా? ఇచ్చిన మాటకు కట్టుబడి సీఈఓ పదవినే వదిలేసుకున్న నా కొడుకు ఎక్కడ? అవును.. నా కొడుకు డ్రైవరే. వాడు రాజ్యాన్నే వదిలేసుకున్న రాజురా అని శ్రీధర్ సీరియస్ అవుతాడు.

నీ బతుకు నీ కోసం. వాడి బతుకు మా అందరి కోసం. అందరి కోసం అన్నీ వదిలేసుకున్నాడు. జీవితాన్ని త్యాగం చేయాలంటే నా కార్తీక్ అయి ఉండాలి. అలాంటి వాడి పేరు మీద మచ్చ పడ్డా ఊరుకోను. నీకిచ్చిన అవకాశాలు అయిపోయాయి అల్లుడు. నీ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నా. అది రాత్రికి చెప్తా అని శ్రీధర్ వెళ్లిపోతాడు. బావను ఏం అనకుండా ఉండాల్సిందని కాశీ అనుకుంటాడు.

జ్యోకు చెంపదెబ్బ

ప్రమాదం ఉందని గురువు చెప్పిన మాటలు తలుచుకుంటూ శివన్నారాయణ ఆలోచిస్తాడు. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. దీప ఇప్పుడు కడుపుతో ఉంది. తన జాగ్రత్త, కడుపులో పెరుగుతున్న బిడ్డ జాగ్రత్త తనదే అని శివన్నారాయణ అంటాడు. దీపకు దశరథ కూడా జాగ్రత్తలు చెప్తాడు. నవ్వేసిన జ్యోత్స్న తను ప్రెగ్నెంట్ అవడం ఇదే మొదటి సారి కాదు కదా. దీపకు ఏడేళ్ల కూతురు ఉంది. పిల్లలను కనడంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉన్నట్లే కదా. బావకు, దీపకు పిల్లలు పుట్టడం ఇదే మొదటిసారి కదా అందుకే చెప్పారా? అని జ్యోత్స్న అనగానే సుమిత్ర లాగిపెట్టి కొడుతుంది.

నీ మాటల్లో ఎంత అవమానం ఉందో నీకు అర్థమవుతుందా? నువ్వు అమ్మతనాన్ని అవమానిస్తున్నావు. శౌర్యను దీప ఎలా కన్నదో నేను నిన్ను అలాగే కన్నా. కడుపులో బిడ్డను మోయడం తేలికే కానీ బిడ్డ మీద ప్రేమను మోయడం ఎంత బరువో తెలుసా నీకు అంటూ కడుపులో బిడ్డ కదలికల గురించి, అమ్మతనం గురించి సుమిత్ర గొప్పగా చెప్తుంది. వెలుగునిచ్చే సూర్యుడి కంటే జన్మనిచ్చే తల్లి గొప్పది. దీప పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని సుమిత్ర సీరియస్ అవుతుంది.

శివన్నారాయణ భయం

సారీ రా కార్తీక్ అని సుమిత్ర చెప్తుంది. ఇక్కడ జరిగిందంతా నా చెల్లికి చెప్పకు అని దశరథ అంటాడు. నేను ఓ బాధలో ఉన్నానంటే వాళ్లు ఇంకా బాధ పెడుతున్నారు. సుమిత్ర కంటే ఎక్కువ కోసం నాకుందిరా. కానీ లోపల ఉన్న భయం ఆపేసింది. ప్రమాదం తప్పదని గురువు చెప్పారు. ఎవరి ముఖం చూసినా భయంగానే ఉంది. అప్పుడే కాంచన గుర్తొచ్చిందని కార్తీక్ తో శివన్నారాయణ అనడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More