కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: బావ ద‌క్క‌డ‌ని జ్యో టెన్ష‌న్‌-ప్ర‌మాదం తప్పదని గురువు హెచ్చ‌రిక‌-నిజం చెప్పేస్తాన‌న్న దాసు

కార్తీక దీపం 2 టుడే నవంబర్ 25 ఎపిసోడ్ లో దీప ప్రెగ్నెంట్ అనే నిజాన్ని జ్యోత్స్న నమ్మలేకపోతుంది. బావ తనకు దక్కడని టెన్షన్ పడుతుంది. మరోవైపు ఇంకా ప్రమాదం తప్పలేదని శివన్నారాయణను హెచ్చరిస్తాడు గురువు. 

Published on: Nov 25, 2025, 06:55:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే నవంబర్ 25 ఎపిసోడ్ లో దీప ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పడంతో పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీలవుతారు. నీకు తమ్ముడో, చెల్లో పుడతారే అని శౌర్యకు అర్థమయ్యేలా చెప్తుంది సుమిత్ర. మా అమ్మ నా మనవరాలి రూపంలో నా ఇంట్లోనే పుట్టబోతుంది నాన్న అని ఆనందంతో కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

జ్యో టెన్షన్

ఇంట్లో హోమం జరిగింది. మంచి జరిగిందని శ్రీధర్ అంటాడు. గురువు గారు ఓ శుభవార్త విన్నా. నాకున్న భయాలన్నీ పోయాయని శివన్నారాయణ సంతోషపడతాడు. కానీ ముప్పు తొలగిపోలేదని గురువు అనుకుంటాడు. దీప ప్రెగ్నెంట్ అయిందని డాక్టర్ చెప్పిందా? లేదా నేనే ఊహించుకుంటున్నానా? అని షాక్ లో పారును అడుగుతుంది జ్యోత్స్న. వాళ్ల ఇద్దరి మధ్య ఇలాంటివి ఏవీ లేవు కాబట్టే నా ఆశలను చంపుకోలేదు. కానీ ఇప్పుడు బావ వల్ల దీప ప్రెగ్నెంట్ అయింది. రేప్పొద్దున బిడ్డ పుడితే నేను అనుకున్నది సాధించగలనా? అని జ్యోత్స్న అడుగుతుంది.

కార్తీక్ నీవాడు కాలేడు

హలో మిస్ హైదరాబాద్ ఇంకా కలల్లోనే బతుకుతున్నావు. కార్తీక్ ఎప్పటికీ నీవాడు కాలేడు. కార్తీక్ లేడనుకొని నీకు కావాల్సిన వాడిని వెతుక్కొని పెళ్లి చేసుకోమని జ్యోకు పారు సలహా ఇస్తుంది. ముందు దీప సంగతి ఏంటో చూద్దాం. గురువు చెప్పాడు కదా ఇంటి వారసురాలికి మంచి జరుగుతుందని జ్యో నోరు జారుతుంది. నువ్వు పడుతున్న టెన్షన్ చూస్తుంటే దీపే ఈ ఇంటి వారసురాలేమో అనిపిస్తుంది. నా దగ్గర ఏం దాయడం లేదు కదా అని పారు డౌట్ పడుతుంది.

ప్రశాంతంగా ఉండదమ్మా

అప్పుడే వచ్చిన దాసు.. ఎవరినీ మనకంటే తక్కువ అంచనా వేయకూడదు. విర్రవీగితే నాశనమే అని జ్యోత్స్నతో చెప్తాడు. ఉపమానాలు, ఉదాహరణలు చెప్పి నన్ను కిందకు లాగకండని జ్యో అంటుంది. మనం ఎదుటివాళ్లకు చెడు చేయాలని చూస్తాం కానీ మంచే జరుగుతోంది. ఇక మీదట జ్యో ప్రశాంతంగా ఉండదమ్మా. విన్న వార్త అలాంటిది. ఈ కథ ఒక పుట్టుక, ఒక చావు, ఒక బతుకు మధ్య జరుగుతుంది కాబట్టి. నేను ఎప్పుడో మొదలెట్టా అమ్మా కానీ పూర్తి చేయలేదు. దీప ప్రెగ్నెంట్ అయింది కదా అందరికీ స్వీట్లు పంచాను. మీరే మిగిలిపోయారు అని పారు, జ్యో చేతిలో లడ్డూలు పెడతాడు దాసు.

కార్తీక్ కౌంటర్

ఇప్పుడు దీపను విష్ చేయకపోతే మీ తాత వేసుకుంటాడు. కొన్ని ఇష్టం లేకపోయినా చేయాలని చెప్పి పారు వెళ్లిపోతుంది. మన అమ్మ మనింట్లో మళ్లీ పుట్టడానికి కారణం నాన్నే. అమ్మ గుర్తుగా నాన్న దాచుకున్న తాళి దీప మెడలో పడిందని దశరథ అంటాడు. దీప కడుపులో పుడతానని మీ అమ్మ ఏమైనా చెప్పిందా? జ్యోత్స్న వారసురాలు కాబట్టి ఆమెకు పెళ్లయ్యాక పుడుతుందేమో అని పారిజాతం చెప్తుంది. నీకు ఏమైనా చెప్పిందా? అని కార్తీక్ కౌంటర్ వేస్తాడు.

ప్రమాదం తప్పదు

నీ సమస్యలకు పరిష్కారం దొరికే రోజు దగ్గర్లోనే ఉందమ్మా అని దీపతో చెప్పిన గురువు.. దశరథ, సుమిత్ర దంపతులను జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్లిపోతాడు. హోమం జరిపించింది జరగబోయే విపత్తును శాంతి పరచడానికే తప్పా, సమూలంగా లేకుండా చేయడానికి కాదు శివన్నారాయణ. మీ కుటుంబానికి ప్రమాదం ఉంది. ప్రమాదం స్థాయి తగ్గుతుంది తప్పా ప్రమాదం తప్పదు. ప్రమాదం ఎవరికో చెప్పలేను. ఎవరికైనా, ఎప్పుడైనా, ఏ రూపంలోనైనా రావొచ్చు అని శివన్నారాయణకు చెప్పి గురువు వెళ్లిపోతాడు.

అమ్మానాన్నలే

దీప గర్భవతి విషయాన్ని ఫొటోలోని కుబేరాకు చెప్తూ అనసూయ ఫీల్ అవుతుంది. ఆడపిల్ల తల్లి అవుతుందంటే అమ్మానాన్న ఉంటే వేరని అనసూయ అంటుంది. ఉన్నారు కదా సుమిత్ర, దశరథ అని కార్తీక్ అంటాడు. మాట వరసకు కూతురు అన్నంత మాత్రాన అమ్మానాన్న ఎలా అయిపోతారు? అని అడుగుతుంది అనసూయ. అలా కాలేరని కాంచన కూడా అంటుంది. అమ్మానాన్న అవుతేనే మీ జీవితానికి నిండుదనం వస్తుందని అంటుంది అనసూయ.

నా కూతురని చెప్తా

మరోవైపు జ్యోత్స్నతో దాసు మాట్లాడతాడు. నీ కూతురు బాగుండాలంటే, దీప గురించి నిజం చెప్పకపోతే చాలని జ్యో అంటుంది. నా తల్లి పాపాన్ని, నేను చేసిన తప్పును రెండిటిని నేను సరిదిద్దుతానమ్మా. శివన్నారాయణతో నువ్వు నా కూతురు అని చెప్తాను పదా అని దాసు అంటాడు. వద్దు నాన్న అంటూ రిక్వెస్ట్ చేస్తుంది జ్యో. వారసురాలినే పనిమనిషిని చేశావు. నువ్వు పనిమనిషిగా ఉంటే తప్పేంటీ? మా నోరును నువ్వు మూయించొచ్చు కానీ నిజం నోరును ఎవరూ మూయించలేరు. ఇప్పటికి వారసురాలు ఒక్కరే. కానీ ఇప్పుడు ఆమె కడుపులో మరో వారసురాలు ప్రాణం పోసుకుంది అని దాసు చెప్తాడు.

దీప సుమిత్ర కడపులో కోటీశ్వర్రాలిగా పెరిగింది. భూమ్మీద పడ్డాక పేదింటి దీపమైంది. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ పేదింటి ఆశాజ్యోతి. కానీ భూమ్మీద పడ్డాక మాత్రం పెద్దింటి బిడ్డగా ఈ అంతపురంలో అడుగుపెడుతుందని దాసు చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More