కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీప నాశనం కావాలంటూ జ్యో-శౌర్య కార్తీక్ కూతురు కాదని కాంచనకు పారు ఫోన్-దీప కడుపులో నొప్పి
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 2 ఎపిసోడ్ లో దీప నాశనం కోరుకుంటున్నానని జ్యోత్స్న చెప్తుంది. దీప కడుపులోని బావ వారసత్వాన్ని మాత్రం ఉండనివ్వను అని అనుకుంటుంది. కాంచనకు పారిజాతం ఫోన్ చేసి శౌర్యను అనాథ శరణాలయంలో చేర్పించమని చెప్తుంది.
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 2 ఎపిసోడ్ లో నువ్వు ఈ జన్మలో మారవంటూ జ్యోత్స్నకు క్లాస్ పీకుతూ ఆమె బట్టలను సూట్ కేసులో సర్దుతుంది పారిజాతం. అర్జెంట్ గా కెనడాలోని ఫ్రెండ్ దగ్గరకి వెళ్లిపోమ్మని పారు అంటుంది. నువ్వు దీపను పడగొట్టాలని కాలు అడ్డం పెట్టావు. అది ఎవరు చూడలేదనుకున్నావు, కానీ కార్తీక్ చూశాడు. కొట్టడమే తక్కువ అని పారు చెప్తుంది. నన్ను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు గ్రానీ వదిలేయ్ అని జ్యోత్స్న చెప్తుంది.

దీప నాశనం
దీపకు ఏదైనా జరిగితే అనుమానం వచ్చేది నీ మీదేనని జ్యోత్స్నతో పారు అంటుంది. దీప కడుపులో పెరుగుతున్న బావ వారసత్వాన్ని మాత్రం ఉండనివ్వను అని జ్యో కన్నింగ్ గా చెప్తుంది. అదంతా జరగదు. కొన్ని రోజులు దేశం వదిలి వెళ్లిపోవడం మంచిదని పారు చెప్తుంది. కానీ నేను మారను గ్రానీ. వీళ్లంతా ఇక్కడ హ్యాపీగా ఉంటే నేను ఎక్కడికో పారిపోవాలా? దీప పూర్తిగా నాశనం అయ్యేంతవరకూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటా. నా నుంచి దీపను బావ ఎలా కాపాడతాడో చూస్తానని జ్యో చెప్తుంది.
సమాధానం లేదని
కార్తీక్ పై దీప అలుగుతుంది. కాంచన మాటలు గుర్తు చేస్తూ మీరు నా చీర కొంగు షర్ట్ కు ముడి వేసుకున్నారు కదా. అత్తయ్యకు దూరంగా ఉండలేక మామయ్య ఎంతలా బాధపడుతున్నారో తెలియదా? నా గురించి కూడా మామయ్య మాట్లాడారు. ఇవన్నీ కలిసి అత్తయ్య తట్టుకోలేకపోయారని దీప చెప్తుంది. అత్త అడిగిన దానికి మన దగ్గర సమాధానం లేదు బావ అని దీప ఏదో పని చేస్తూనే ఉంటుంది.
ఎక్కడికి వెళ్లాలి?
తల్లిని అవుతున్నానని తెలిసినప్పటి నుంచి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉందని దీప అంటుంది. రెండు రోజులు సరదాగా ఎక్కడికైనా వెళ్దామా అని కార్తీక్ అడుగుతాడు. వద్దు మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు నచ్చకపోతే కదా ఇంకా ఎక్కడికైనా వెళ్లాలనిపించేది. నిన్ను, శౌర్య, అత్త, పుట్టింట్లో అమ్మానాన్న, తాత.. ఇలా నా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే అది కదా బావ నిజమైన ఆనందం. ఇంకా బయటకు ఎందుకు? నాపై ప్రేమ ఉంది కదా. మరి ఎందుకు లోపలికి వెళ్లమని గట్టిగా అరిచావని దీప అడుగుతుంది.
తాత దగ్గరకు వెళ్లిపో
కన్నతల్లి, కట్టుకున్న భార్య గొడవపడుతుంటే ఎంత పెద్ద మేధావి అయినా తల పట్టుకుంటాడు. ధైర్యం చేసి ఎవరినో ఒకరిని కంట్రోల్ చేయాలి. అందుకే అలా చేశా. నాన్న భయంలో అర్థం ఉంది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని దీపకు చెప్తాడు కార్తీక్. మరోవైపు శౌర్య హోం వర్క్ చేస్తుంటుంది. నీ మీద అరవడం నా తప్పే సారీ అని చెప్తుంది కాంచన. శౌర్యను తన దగ్గర పడుకోమని చెప్తుంది కాంచన. మరి నువ్వు తాత దగ్గర ఉండాలి కదా, ఇక్కడెందుకు ఉన్నావు నాన్నమ్మ? తాత దగ్గరకు వెళ్లిపో అని శౌర్య అనగానే కాంచన షాక్ అవుతుంది.
శౌర్య కూతురు ఎలా?
కాంచనకు పారిజాతం ఫోన్ చేసి మాట్లాడుతుంది. నీ కొడుకు మొదటిసారి తండ్రి కాబోతున్నాడు కదా నీతో మాట్లాడి సంతోషాన్ని పంచుకుందామని చేశా. నీ కోడలికి కూతురు పుడతారా? కొడుకు పుడతారా? అని అడుగుతుంది కాంచన. కూతురు ఉంది కదా కొడుకు పుట్టాలని అనుకుంటున్నా అని కాంచన చెప్తుంది. దీపకు, ఇంకా ఎవరికో పుట్టిన కూతురు కార్తీక్ కు కూతురు ఎలా అవుతుంది కాంచన. వాస్తవాలు వేరేగా ఉంటాయి. ఉదాహరణకు నేను మీ నాన్నకు భార్యను. తల్లిలా చూస్తున్నావా? పిన్నిలా చూస్తున్నావా? పిన్ని అనే పిలుస్తావు అని అంటుంది పారు.
అనాథ శరణాలయంలో
నీ సవతి కూతురు అదే కావేరీ కూతురు స్వప్న. ఆ పిల్లను కార్తీక్ చెల్లి అంటాడు. నువ్వు కూతురిలా చూస్తావు. కార్తీక్, స్వప్నలో ఎవరు ఎక్కువ అంటే ఏం చెప్తావ్? నీ సవతి కూతురు నీ సొంత కూతురు ఎలా కాలేదో ఎవరికో పుట్టిన బిడ్డ కార్తీక్ కు కూతురు కాదు. నీ కొడుకు రక్తం శౌర్యలో లేదు కాబట్టి దాన్ని పరాయిదానిలాగే చూడాలి. కార్తీక్ కు బిడ్డ పుట్టిన తర్వాత అయిన అలాగే చూస్తావు. ఇప్పుడే దాన్ని అనాథ శరణాలయంలో చేర్పించావనుకో అని పారు ఫోన్ పెట్టేస్తుంది.
దీపకు నొప్పి
నిద్రలో శౌర్య కాలు దీప కడుపులో తాకడంతో అమ్మా అని నొప్పితో విలవిలలాడుతుంది దీప. నొప్పిగా ఉంది బావ అని దీప ఏడుస్తుంది. అప్పుడే కాంచన డోర్ కొడుతుంది. దీపకు ఏమైంది? అని కాంచన కంగారు పడుతుంది. కడుపులో నొప్పి అంటుందని కార్తీక్ చెప్తాడు. శౌర్య కాలు ఏమైనా తగిలిందా అంటే లేదని దీప చెప్తుంది.
హాస్పిటల్ తీసుకెళ్లమని కాంచన చెప్తుంటే, నొప్పి తగ్గిపోయిందని దీప చెప్తుంది. కార్తీక్ గుండెల మీద తల పెట్టుకుని పడుకుంటే నొప్పి తగ్గిపోతుందని దీప అలాగే పడుకుంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.













