కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: నువ్ నా కూతురివి కాదు- జ్యోత్స్నతో దశరథ- గుక్కపెట్టి ఏడ్చిన శివనారాయణ- దీపకు పుట్టింటి సారే

కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 4 ఎపిసోడ్‌లో దీప ఇంటికి దశరథ్‌తో వెళ్తుండగా జ్యోత్స కోపంగా ఉంటుంది. కారు ఆపి జ్యోత్స్నతో మాట్లాడిన దశరథ నువ్వు నా కూతురువి కాదు అంటాడు. మరోవైపు శ్రీధర్‌ను అంగీకరించమని శివ నారాయణ చెబుతాడు. భర్తను చచ్చుపడిపోయిన తన కాళ్లతో పోలుస్తుంది కాంచన. దాంతో శివ నారాయణ ఏడుస్తాడు.

Published on: Dec 4, 2025, 07:49:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దశరథ్, జ్యోత్స్న కారులో దీప ఇంటికి వెళ్తుంటారు. జ్యోత్స్న కోపంగా ఉంటుంది. దీప అంటే నచ్చదంటుంది. కారు ఆపమంటాడు దశరథ్. వెళ్లి రెండు ఐస్‌క్రీమ్స్ తీసుకొచ్చి జ్యోత్స్నకు ఇస్తాడు దశరథ్. ఇద్దరు ఐస్‌క్రీమ్ తింటారు. మనం కాసేపు తండ్రికూతుళ్లలా మాట్లాడుకుందామా అని దశరథ్ అంటే మనం తండ్రి కూతుళ్లమే అని జ్యో అంటుంది.

కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 4వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 4వ తేది ఎపిసోడ్

నా కూతురు వేరే ఉంది

నువ్వు నా కూతురువి కాదు. నా కూతురు వేరే ఉంది. ఇప్పుడు లేదు అని పెద్ద షాక్ ఇస్తాడు దశరథ్. నా కూతురు అది ఇది కొనివ్వమని అడిగేది.. నాతో సరదాగా మాట్లాడేది అని జ్యో చిన్నప్పటి విషయాలు చెబుతాడు దశరథ్. నా కూతురు ఒకేసారి పెద్దదైపోయింది. వయసులో కాదు ప్రవర్తనలో. కోపం పెంచుకుంది, ఎవరు విషం నింపారో తెలియదు. ఒక్కోసారి ఇది నా కూతురునే అనిపిస్తుందని దశరథ్ అంటాడు.

మీ ఆశలు నేను నిలబెడతాను అని జ్యో అంటే.. అలా అయితే నేను చెప్పినట్లుగా పెళ్లికి ఒప్పుకో అని దశరథ్ అంటాడు. మీరు కోరుకునే భవిష్యత్తు నాకు పెళ్లితోనే దొరుకుతుందనుకుంటే మీరు అనుకుందే చేయండి. నేను పెళ్లికి రెడీ అని జ్యో అంటుంది. ఇప్పుడే ఈ గుడ్ న్యూస్ అమ్మకు చెబుతానను దశరథ్ అంటే ఇంటికి వెళ్లాక చెప్పండి అని ఆపుతుంది జ్యోత్స్న.

శ్రీధర్ గురించి

మరోవైపు శౌర్యను బస్ ఎక్కించినట్లు పారిజాతం చెబుతుంది. సుమిత్ర ఇబ్బంది పడుతుంది. తనకు లెమన్ జ్యూస్ ఇవ్వమంటుంది సుమిత్ర. వంట గదిలో ఏం జరుగుతుందో అని వెళ్లిపోతుంది పారిజాతం. శ్రీధర్ కూడా ఇక్కడ ఉంటే చాలా బాగుంటుంది అని శివ నారాయణ అంటాడు. ఇన్‌డైరెక్ట్‌గా కాంచన దగ్గర శ్రీధర్ గురించి మాట్లాడుకుంటారు శివ నారాయణ, కార్తీక్.

కాంచన మాత్రం శ్రీధర్ రెండో పెళ్లి గురించి మాట్లాడుతుంది. ఈ దూరం ఎన్నాళ్లు అని శివ నారాయణ అంటే.. నేను ప్రాణాలతో ఉన్నన్నినాళ్లు అని కాంచన బదులిస్తుంది. ఇద్దరు షాక్ అవుతారు. తండ్రిగా నిన్ను శాసించే హక్కు నాకుంది. నువ్వు శ్రీధర్‌ను అంగీకరించాలని శివ నారాయణ అంటాడు. కాంచన మౌనంగా ఉంటే ఒప్పుకుందని శ్రీధర్‌కు కాల్ చేయమని కార్తీక్‌తో చెబుతాడు శివ నారాయణ.

గుక్కపెట్టి ఏడ్చిన శివ నారాయణ

తండ్రిగా నువ్వు అడిగింది నేను చేస్తాను అన్నాను. కూతురిగా నేను అడిగింది చేయలేవా అని కాంచన అంటే శివ నారాయణ ఇస్తాను అని అంటాడు శివ నారాయణ. నాన్న నన్ను లేపి నా కాళ్ల మీద నిలబెట్టు. ఈ కాళ్లు నా మాట అస్సలు వినట్లేదు. నీ మాట వింటాయి అని పెద్ద స్ట్రోక్ ఇస్తుంది కాంచన. నీ కూతురు క్షమించింది రా అని మీ అల్లుడిని పిలుస్తావ్. ఈ కాళ్లతో నడిచి వెళ్లి నీ అల్లుడుని స్వాగతించాలి నాన్న అని కాంచన అంటుంది.

దాంతో శివ నారాయణ ఏడుస్తూ కుమిలిపోతాడు. కార్తీక్ ఓదారుస్తాడు. జీవితంలో రాని కాళ్లకు.. జీవితం నుంచి పంపించేసిన భర్తకు ముడిపెడతావా అని ఏడుస్తూ అంటాడు శివ నారాయణ. అంతేగా నాన్న. కాళ్ల మీద, భర్త మీద ఆశలు వదిలేసుకున్నాను. నా దృష్టిలో రెండు ఒక్కటే అని కాంచన చెబుతుంది. కాంచన మాటలకు శివ నారాయణ గుక్కపెట్టి ఏడుస్తుంటాడు.

దీపకు పుట్టింటి సారే

ఇంతలో దశరథ్, జ్యోత్స్న వస్తారు. స్వీట్స్, పళ్లు, తాంబూలం తీసుకొస్తారు దశరథ్, జ్యోత్స్న. మా ఇంటి ఆడ బిడ్డకు పుట్టింటి నుంచి ఇదంతా ఆనవాయితి. పసుపు కుంకుమ సారే తీసుకు వచ్చామని దశరథ్ అంటాడు. దీపకు తల్లి సుమిత్ర బొట్టు, పూలు పెట్టి, గాజులు వేస్తుంది. పుట్టింటి సారే పెడుతుంది.

మావయ్య గారు ఓ మాట చెప్పారు. అది చెప్పడానికే వచ్చామని సుమిత్ర అంటే.. రేపటి నుంచి దీప మా ఇంటికి రానవసరం లేదని దశరథ్ అంటాడు. దాంతో జ్యో షాక్ అవుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More