కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపకు తాతల శివనారాయణ- పారు చెప్పింది కార్తీక్‌కు చెప్పేసిన శౌర్య-జ్యోకి కార్తీక్ లాంటి భర్త
కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 6 ఎపిసోడ్‌లో జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందని శివ నారాయణ అందరికి స్వీట్స్ తెమ్మంటాడు. కానీ, తనను పెళ్లి చేసి వదిలించుకోవాలని చూస్తున్నారని గొడవ చేస్తుంది జ్యోత్స్న. పారిజాతం అనడంతో దీపకు తాతల ఉంటానని శివ నారాయణ అంటాడు. తనకు పారు ఎక్కించింది కార్తీక్‌తో చెబుతుంది శౌర్య.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శివ నారాయణ ఇంటికి వెళ్తాననడంతో దీప, కార్తీక్‌పై తెగ ఫైర్ అవుతుంది కాంచన. మీకు నచ్చింది చేసుకోండి. నాకు మీ మీద కోపం లేదు. ఇదంతా నా బాధరా అని వెళ్లిపోతుంది కాంచన. ఒకసారి ఆలోచించమని దీపకు చెబుతుంది అనసూయ. మరోవైపు జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుందని దశరథ చెప్పడంతో శివ నారాయణ తెగ సంతోషిస్తాడు.

జ్యోత్స్న గొడవ
అందరికి స్వీట్స్ ఇవ్వమంటాడు. కానీ, జ్యోత్స్న వద్దంటుంది. ఈ తీపి వెనుక ఓ చేదు నిజం ఉంది. ఇప్పటికీ రెండు సార్లు పెళ్లికి ఒప్పుకున్నా. అయినా మనవాళ్లు సంతోషంగా ఉన్నారంటే పెళ్లి పేరుతో పద్ధతిగా గెంటేస్తారని జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు నీ బాధ ఏంటని దశరథ్ అడుగుతాడు. దీపకు ట్రీట్‌మెంట్ ఇప్పించడం, బాగా చూసుకోవడం నచ్చట్లేదని జ్యోత్స్న గొడవ చేస్తుంది.
మాకంటే నీకు దీపే ఎక్కువ. కానీ, మీ మాటకు దీప విలువ ఇచ్చిందా. నేను చేసేది మాత్రం కనిపించదు. కార్తీక్ ఏం చేసిన మంచే అనే భ్రమలో ఉన్నారని జ్యోత్స్న అంటుంది. నాన్న విద్య లేనివాడు వింత పశువు అని చిన్నప్పుడు నువ్వు నాకు నేర్పించింది నేర్పించాల్సిన టైమ్ వచ్చింది. విద్య లేని వాడు కాదు నాన్న వివేకం లేని వాడు వింత పశువు, విజ్ఞత లేనివాడు అని జ్యోత్స్నను అంటాడు దశరథ్.
దానికి జ్యోత్స్స కంగుతింటుంది. సావాసం సరిగా లేకుంటే ఇలాగే అంటారు అని శివ నారాయణ కూడా అంటాడు. దాంతో పారు అరుస్తుంది. దీపకే అన్ని చేయండి. తాతలా అనుకోమ్మనండి అని పారిజాతం అంటుంది. నువ్వన్నది బాగుంది. దీపకు తాతలా ఉంటాను. జ్యోత్స్న కడుపుతో ఉంటే ఏమేం చేస్తానో దీపకు కూడా అలాగే చేస్తానని శివ నారాయణ అంటాడు.
దీపకు తాతల శివ నారాయణ
నా కూతురు కోడలి కోసం ఏం చేయాలో అన్ని చేస్తాను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అని శివ నారాయణ గట్టిగా చెబుతాడు. బావ ఇప్పుడు కూడా నువ్వే గెలిచావ్ అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. తర్వాత జ్యోత్స్న విషయంలో మనం తల్లిదండ్రులుగా ఫెయిల్ అవుతున్నాం అని దశరథ్, సుమిత్ర మాట్లాడుకుంటారు.
పెళ్లి చేసి దూరంగా పంపిద్దాం. అది ఉంటే ఇక్కడ సంతోషంగా ఉండదు. కార్తీక్ గాడిని సంతోషంగా ఉంచదు అని సుమిత్ర అంటుంది. కార్తీక్ గాడిని అడిగితే నా కూతురు కోసం అంటాడు. వాడు ఏదో మన దగ్గర దాస్తున్నాడనిపిస్తుందని సుమిత్ర అంటుంది. హనుమంతుడి కథ చెప్పి కావాలనే ఒక సంతకంతో బందీ అయ్యాడు అని కార్తీక్ గురించి గొప్పగా చెబుతాడు సుమిత్ర.
దాసును జ్యోత్స్న చంపేందుకు ట్రై చేయడం మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నట్లున్నాడు. టాపిక్ డైవర్ట్ చేయాలని దశరథ్ అనుకుంటాడు. సుమిత్ర లేస్తూ కళ్లు తిరిగినట్లు చేస్తుంది సుమిత్ర. డాక్టర్ దగ్గరికి వెళ్దామని దశరథ్ అంటాడు. జ్యోత్స్న గురించి పూజలు చేస్తున్నాగా అందుకే. కార్తీక్ గాడి లాంటి భర్త జ్యోత్స్నకు రావాలని పారిజాతం అంటుంది. నాది కూడా అదే కోరిక అని దశరథ్ అంటాడు.
ఏడ్చేసిన శౌర్య
మరోవైపు కార్తీక్ దగ్గరికి వచ్చిన శౌర్య పడుకుందామని అంటుంది. నానమ్మ గదిలో పడుకోమ్మని కార్తీక్ చెబుతాడు. దాంతో పారిజాతం చెప్పింది శౌర్య గుర్తు చేసుకుంటుంది. దాంతో ఒక్కసారిగా ఏడుస్తుంది శౌర్య. నువ్వు మారిపోయావ్, అచ్చం జోగిరాణి చెప్పినట్లే చేస్తున్నావంటుంది శౌర్య. దాంతో ఏం చెప్పిందని కార్తీక్ అడుగుతాడు. అప్పుడు పారిజాతం చెప్పిందంతా కార్తీక్‌కు చెబుతుంది శౌర్య.
శౌర్య మనుసులో విషం నింపింది అని లోలోపల కోప్పడతాడు కార్తీక్. నేను దూరంగా వెళ్లిపోతానని వెళ్లిన శౌర్య కింద పడి ఏడుస్తుంది. కార్తీక్ తీసుకుని ఓదారుస్తాడు. శౌర్యకు వచ్చిన నొప్పి గురించి చెబుతూ దీపను రాత్రి తన్నింది చెబుతాడు. అమ్మకు, బేబీకి నీకంటే పదింతలు నొప్పి వచ్చింటుంది కదా. నిన్ను ఏమైనా అన్నామా. తిట్టామా. నీకు చెప్పామా. ఎందుకు చెప్పలేదు అని కార్తీక్ అంటాడు.
ఎందుకు అని శౌర్య అడిగితే.. నీ మీద ప్రేమ. జోగిరాణి చెప్పిన మాటలు నమ్మకూడదు. ఎందుకంటే మనవళ్ల పిల్లలతో అమ్మమ్మలు ఆడుకుంటారు. నీతో కూడా అలాగే ఆడుకుంది. నువ్వు నమ్మేశావ్. నాతో కూడా మా అమ్మమ్మలు, నానమ్మలు ఆడుకునేవారు. నేను మాత్రం మా అమ్మ నాన్న మాటే వినేవాన్ని అని కార్తీక్ అంటాడు.
పారిజాతంను ఏడిపించేలా
నేను కూడా అమ్మ నాన్న మాటే వింటాను అని శౌర్య చెబుతుంది. మరి జోగిరాణి నిన్ను ఏడిపించిందిగా తనను కూడా ఏడిపిద్దాం. అది రేపు చెబుతా. నీ మీద నాకు ప్రేమ తగ్గిపోవడం ఏంట్రా నాన్న ప్రేమ ఆకాశమంతా అని శౌర్యకు ముద్దు పెడతాడు కార్తీక్. శౌర్య మనసులో నుంచి పారిజాతం విషాన్ని తీసేస్తాడు కార్తీక్. అదంతా చాలా ఎమోషనల్‌గా హృద్యంగా ఉంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












