కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: నీకు మూడోసారి పెళ్లి అవసరమా- జ్యోత్స్నతో కార్తీక్- కార్తీక్ మాటలకు పారిజాతం ఎలివేషన్

కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 11 ఎపిసోడ్‌లో దీపను అన్నందుకు జ్యోత్స్నకు గట్టిగా బుద్ధి చెబుతాడు కార్తీక్. రెండు పెళ్లిళ్లు చెడిపోయిన నీకు మూడోసారి పెళ్లికి ఒప్పుకోవడం అవసరమా అని చాలా అంటాడు కార్తీక్. ఆ కార్తీక్ మాటలకు ఫిదా అయిన పారిజాతం ఎలివేషన్ ఇస్తుంది. దీప భర్త అవడం అదృష్టమంటుంది.

Published on: Dec 11, 2025 7:55 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీపకు కార్తీక్ రెండో భర్త అని నీచంగా మాట్లాడితే సమిత్ర కొట్టబోతుంది. కానీ, కార్తీక్ ఆపుతాడు. మాటకు మాటతో సమాధానం చెప్పాలంటాడు కార్తీక్. భర్త చనిపోయి, పిల్లలుంటే రెండో పెళ్లి గురించి ఎందుకు మాట్లాడరు. అలాంటి పరిస్థితే మన చెల్లికో, తల్లికో వస్తుంది. ఊహ తెలియనప్పుడే ఎవడో పెళ్లి చేసుకుని తల్లి చేసి పారిపోయాడను కార్తీక్ చెబుతాడు.

కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 11వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 11వ తేది ఎపిసోడ్

కార్తీక దీపంలా వెలిగింది

దీప కష్టాల గురించి చెబుతాడు. మన విలువ ఏంటో తెలిసిన వాళ్లు మన జీవితంలోకి వచ్చాకే మనం ఎందుకు బతుకుతున్నామో తెలుస్తుంది. నేను దీప కష్టాల్లోకి వెళ్లాను. అప్పుడు దీప కార్తీక దీపంలా వెలిగింది అని చిన్నప్పటి నుంచి జరిగింది గుర్తు చేసుకుంది. దీప నా భార్య. నా ఇంటి దీపం అని కార్తీక్ అంటాడు. దీప తన మరదలన్న విషయం బావకు తెలుసా అని జ్యోత్స్న అనుకుంటుంది.

దీప నన్ను రెండో పెళ్లి చేసుకుంది. దానివల్ల నీకు వచ్చే నష్టం ఏంటీ. దీపను నేను పెళ్లి చేసుకోకున్న నిన్ను పెళ్లి చేసుకునేవాన్ని కాదు. కుటుంబాల కోసం తలవంచాను తప్ప ఇష్టంతో కాదు. ఆ అయిష్టం పెళ్లి వరకు రాదని నాకు తెలుసు. దీప వల్ల నీకు ఎలాంటి నష్టం జరగలేదు. నీకు నాతో ఎంగేజ్‌మెంట్ జరిగి ఆగిపోయింది. గౌతమ్‌తో కూడా అగిపోయిందని కార్తీక్ చురకలు వేస్తాడు.

ఇప్పుడు రెండు పెళ్లిల్లు ఆగిపోయిన నీకు మూడో పెళ్లి అవసరమా.. అని నేను అనను. జనం కూడా నీ విషయంలో ఇలాగే అనుకుంటారుగా. అలా అనుకుంటారని ఇక్కడే ఆగిపోతావా. పెళ్లి చేసుకోకుండా ఇదే ఇంట్లో ఉండిపోతావా. రెండు పెళ్లిళ్లు చెడిపోయిన నువ్వు మూడో పెళ్లికి ఒప్పుకున్నప్పుడు, రెండు పెళ్లిళ్లు చేసుకున్న నీ గ్రానీ తప్పు కనిపించనప్పుడు నా భార్య చేసుకుంటే తప్పేముందని ఇచ్చి పడేస్తాడు కార్తీక్.

అందరితో ఛీ అనిపించుకోవడం

ఎవరి జీవితం వారికి నచ్చినట్లు బతుకుతున్నారు. వారిని వేలెత్తి చూపే అధికారం లేదు. నీకు కూడా అని కార్తీక్ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఇంకోసారి దీపను ఏదైనా అంటే కార్తీక్ క్షమించిన నేను క్షమించను అని శివ నారాయణ అంటాడు. మాట జారడం అందరితో ఛీ అనిపించుకోవడం దీనికి బాగా అలవాటు అయిందని పారిజాతం అనుకుంటుంది.

తర్వాత అందరి మూడ్ మార్చి స్వీట్ ఇస్తాడు కార్తీక్. జ్యోత్స్న తినకుండా ఉంటే పారు నేను చెప్పింది ఏమైనా తప్పా అని కార్తీక్ అడుగుతాడు.లేదురా. తప్పేదైనా ఉందంటే అది జ్యోత్స్నదే. నువ్ తల్లి మనసు, భార్య మనసు కాదురా ఆడదాని మనసు అర్థం చేసుకున్నావ్. ఆ మాటకు వస్తే మనిషి మనసును అర్థం చేసుకున్నావ్. నువ్వు చెప్పినవన్నీ జీవిత సత్యాలే. దీపను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు అదృష్టవంతుడివేరా అని ఎలివేషన్ ఇస్తుంది పారిజాతం.

పారిజాతం ఈ గులాబ్ జామూన్ కంటే నీ మాటలు చాలా తీయగా ఉన్నాయి. అప్పుడప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడతావ్ అని శివ నారాయణ అంటే.. మీరు నన్ను మెచ్చుకున్నారా. అలా అయితే మీ చేత్తో స్వీట్ తినిపించండి అని పారిజాతం అంటుంది. దాంతో పారుకు శివ నారాయణ స్వీట్ తినిపిస్తాడు. అది కార్తీక్ ఫొటో తీస్తాడు. సుమిత్ర పక్కకు వెళ్లిపోతుంది.

కాశీపై శ్రీధర్ కోపం

నేను కూడా నా భార్యకు తినిపిస్తాను అని దశరథ్ వెళ్లిపోతాడు. నేను భర్తోత్సాహంలో ఉన్నానురా. నిజంగా ఇది సెలబ్రేషన్‌రా అని పారిజాతం అంటుంది. ఈ సంతోషాలు ఉండవంటూ జ్యో వెళ్లిపోతుంది. మరోవైపు ఫోన్‌లో కాశీ గురించి గొప్పగా చెబుతాడు శ్రీధర్. ఇంతలో కాశీ వస్తాడు. కాశీకి పని చెబుతుంటే ఫోన్ చూస్తుంటాడు. దాంతో శ్రీధర్ కోప్పడుతాడు.

మన ఫుడ్ ట్రక్స్ వెళ్లి సూపర్‌వైజ్ చేయాలని శ్రీధర్ చెబుతాడు. నేను వెళ్లడమేంటీ అని ముందు ఒప్పుకోనని తర్వాత ఒప్పుకుంటాడు కాశీ. ఏదైనా సరే నా పర్మిషన్‌తో ఓకే చేయు. ఫుడ్ నేను చూశాను. సప్లై బాగా చూసుకో అని శ్రీధర్ చెబుతాడు. దాంతో కాశి వెళ్లిపోతాడు. మరోవైపు జ్యోత్స్న అన్నమాటలకు దీప ఏడుస్తుంటుంది. కార్తీక్ వచ్చి ఓదారుస్తాడు.

దీప హగ్ చేసుకుంటుంది. మరోసారి దీని గురించి ఎవరు మాట్లాడరు. ముందు ఫుడ్ ట్రక్ సక్సెస్ కానీ తర్వాత ఏం చేస్తానో చూడు అని కార్తీక్ అంటాడు. దీపకు గులాబ్ జామూన్ తినిపిస్తాడు కార్తీక్. మరోవైపు రోడ్డు మీద నిలబెట్టారని కాశీ ఫ్రస్టేట్ అవుతాడు. శ్రీధర్ కాల్ చేసి మిగిలిన ఫుడ్‌ను అనాథ శరణాలయాల్లో, గుడిలో పంచమని చెబుతాడు.

మామపై కాశీ కోపం

కాశి వినడు. ఇంటికి వెళ్లాలంటాడు. దానికి నేను పర్మిషన్ ఇవ్వాలి. ముందు పని పూర్తి చేసుకుని రా. ఏం చేయాలో నేను చెబుతాను అని శ్రీధర్ అంటుండగానే కాశీ కల్ కట్ చేస్తాడు. వీడికి చేసే పని మీద శ్రద్ధ లేదు. దారిలో పెట్టకపోతే కష్టమే అని శ్రీధర్ అనుకుంటాడు. ఇతని దగ్గర పనిచేయడం కష్టమే అని మామపై కోప్పడతాడు కాశీ. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.