కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్నకు కార్తీక్ వార్నింగ్- బయటకొచ్చిన శ్రీధర్- కటకటాల్లోకి కాశీ, వైరా- పారు ఆరాటం
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 31 ఎపిసోడ్ లో జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. అత్త ముఖం చూసి వదిలేస్తున్నానని చెప్తాడు. శ్రీధర్ ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపిస్తారు. వైరా, కాశీ కటకటాల వెనక్కి వెళ్తారు. కాశీని జన్మలో క్షమించనని శ్రీధర్ అంటాడు. మనవడి కోసం పారు తెగ ఆరాటపడిపోతుంది.
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 31 ఎపిసోడ్ లో కార్తీక్ రోడ్డులో కారు ఆపి జ్యోత్స్ను దిగమంటాడు. స్కూల్ లో ఉన్నప్పుడు తెలుగు వాచకం అనే పుస్తకం మన ఇంట్లో దొరికింది. అందులో చెట్టు ఎక్కిన వ్యక్తి కూర్చున్న కొమ్మను నరుక్కునే ఫొటో చూశా. ఆ తర్వాత తెలిసింది. వాడిని వాడే నాశనం చేయాలనుకునేవాణ్ని మూర్ఖుడు అంటారు. వైరా నిన్నే ఎందుకు వేలు ఎత్తి చూపించాలని కార్తీక్ అడుగుతాడు.

జ్యో ఛాలెంజ్
కాశీకి జాబ్ రావడానికి హెల్ప్ చేయలేదా? వైరాతో ఫోన్లో మాట్లాడలేదా? వైరాతో మా నాన్నను సీఈఓ పోస్టులో నుంచి దించాలని అడగలేదా? ఫుడ్ కల్తీ చేయమని చెప్పలేదా? అని కార్తీక్ అడిగితే, లేదు లేదు అని జ్యోత్స్న సమాధానం చెబుతుంది. తప్పు చేశానని ఒక్క సాక్ష్యం చూపించమని చిటికెలు వేసి ఛాలెంజ్ చేస్తుంది జ్యో. ఇందులో నీ హ్యాండ్ ఉందని నిరూపిస్తే ఏం చేస్తావని కార్తీక్ అడుగుతాడు.
అత్త ముఖం చూసి
శివ నారాయణకు నువ్వు కూతురు కొడుకువి. నేనే కొడుకు కూతురిని. ఆయన కొడుకుకు రాసిన ఆస్తికి ఏకైక వారసురాలిని. ఈ సామ్రాజ్యానికి అధినేత్రిని. దీనిపై నీకంటే ఎక్కువ ప్రేమ, బాధ్యత నాకే ఉంటాయని జ్యోత్స్న చెప్తుంది. ఇవి ఇంటి వారసురాలికి తప్పకుండా ఉండాలి. మరి నీకెందుకు ఉన్నాయని కార్తీక్ షాకిస్తాడు. ఏం జరిగిందో కాశీ నాకు చెప్పాడు. కాల్ డీటైల్స్ తీస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు? అత్త ముఖం చూసి ఇక్కడితో వదిలేస్తున్నానని కార్తీక్ చెప్తాడు.
క్షమించనని శ్రీధర్
కార్తీక్, జ్యోత్స్న వెళ్లి శ్రీధర్ ను విడిపిస్తారు. నమ్మక ద్రోహం చేశావని వైరా, ఇరుక్కుపోయానని కాశీ అనుకుంటారు. తండ్రికి కొడుకు మీద ప్రేమ ఉంటుంది. కానీ చూపించడానికి సమయం, సందర్భం రావాలి. అల్లుడు కూడా కొడుకే అనుకున్నా. నీకు నేను తప్పా ఎవరున్నారని అనుకున్నా. అందుకే యాక్సిడెంట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంటే డబ్బు కట్టి విడిపించా. నాతోనే పెట్టుకుని బిజినెస్ నేర్పించి, నీతో సొంతంగా రెస్టారెంట్ పెట్టించాలనుకున్నా. కానీ నువ్వు అధికారం, పెత్తనం అనుకున్నావని కాశీతో శ్రీధర్ అంటాడు.
ఇంత నమ్మకద్రోహం చేస్తావనుకోలేదు. నా శత్రువును నువ్వు నమ్మావంటే నాకు శత్రువు అయినట్లే కదా. తప్పు నువ్వు చేసి నా కూతురిని ఏడిపిస్తున్నావు కదరా. నిన్ను మాత్రం జీవితంలో క్షమించను అని కాశీతో అంటాడు శ్రీధర్.
సీఈఓగా రిజైన్
నన్ను క్షమించండి మామయ్య అని శివ నారాయణ కాళ్ల మీద పడతాడు శ్రీధర్. నేను తప్పు చేశానా? లేదా? అనే దానికంటే ముందు జ్యోత్స్న రెస్టారెంట్ వాల్యూను పబ్లిక్ లో పోగొట్టినట్లే కదా. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రైడ్ కు కారణం కూడా నేనే. నాకు ఇంకా ఈ సీఈఓ పోస్టులో ఉండే అర్హత లేదు. వెంటనే రిజైన్ చేస్తానని శ్రీధర్ అంటాడు. నువ్వు తప్పు చేశావా? వైరా మీడియా ముందుకు వచ్చేవరకూ మనం ఎంత పతనం కావాలో అంత పతనం అయ్యామని శివ నారాయణ అంటాడు.
అల్లుడి మోసం
మన వాళ్లు పడిపోకుండా అండగా వీడు ఉంటాడు. చేయి ఇచ్చి నిలబెడతాడు. నా నమ్మకం కరెక్ట్ అని నిరూపించాడని కార్తీక్ గురించి చెప్తాడు శివ నారాయణ. వాడెప్పుడు ఈ కుటుంబం కోసం ఓ ధ్వజ స్తంభంలా నిలబడతాడని శ్రీధర్ చెప్తాడు. తప్పుల వల్ల ఎక్కువ పాఠాలు నేర్చుకుంటాం. దీని వల్ల మనకు ఎంతమంది శత్రువులు ఉన్నారో తెలిసింది. కానీ నీ అల్లుడు ఇంత మోసం చేస్తాడని అనుకోలేదని శివ నారాయణ అంటాడు.
కాశీ కోసం పారు
వాడు మోసపోయే రకమే కానీ మోసం చేసే రకం కాదు. ముందు నా మనవడిని లోపలకు రమ్మనండని పారిజాతం అంటుంది. లోపలే ఉన్నాడు, పోలీస్ స్టేషన్లో. కాశీ సాక్షి కాదు నేరస్థుడు. ఏం చేశాడో మీడియా ముందు చెప్పాడు కదా అని కార్తీక్ అంటాడు. డబ్బుపై ఆశ అయినవాళ్లను కూడా మోసం చేయిస్తుందని శ్రీధర్ అంటాడు. ముందు మీ అల్లుడిని అనాలని పారిజాతం ఫైర్ అవుతుంది.
నా మనవడిని పర్సనల్ అసిస్టెంట్ ను చేశాడు. వాడిని ఆఖరికి మన ఇంటి పనిమనిషికి డ్రైవర్ ను చేశాడు. ఎంతకాలమని భరిస్తాడని పారు అంటుంది. ఎవరిని నువ్వు సమర్థించేది? ఫుడ్ ట్రక్స్ కు సూపర్ వైజర్ ఎవరు కాశీ కాదా? కాశీకి తెలియకుండానే కల్తీ జరిగిందా? ఎవరికైనా ఏమైనా జరిగితే పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం కదా. అదేందుకు నువ్వు ఆలోచించవని దశరథ సీరియస్ అవుతాడు.
దీప మంచి మాటలు
నువ్వెందుకు మాట్లాడవు జ్యోత్స్న అని అడుగుతుంది పారు. వాడు నా అల్లుడు. నా కూతురి మొగుడు. మరి నాకెంత బాధ ఉండాలని శ్రీధర్ అంటాడు. అనాథలా మిగిలి పోయింది నా మనవడేనని పారు అంటుంది. అల్లుడు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే బాధ తట్టుకోలేని మామయ్య మోసపోయానని ఏడ్చారు అంతే కానీ ఏమనలేదు. అర్ధరాత్రి నా ఆడపడుచు ఇంటికి వస్తే నా భర్త కూడా కాశీ చెడ్డవాడని అనలేదు. ఎవరి బాధలు వాళ్లకున్నాయి. మామయ్య కాశీని మంచి దారిలో పెట్టాలనుకున్నాడని దీప చెప్తుంది.
చేసిన పనికి శిక్ష పడితే అన్ని పైత్యాలు వదిలిపోతాయి. వాడు ఎంత చెండాలం చేశాడో అంత చేశాడు. వాడిని ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వను. శ్రీధర్ ఇంటికి వెళ్లు. నువ్వే సీఈఓ అని శివ నారాయణ అంటాడు. నా మనవడు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం జ్యోత్స్ననే అని పారు అనుకోవడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


