కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దొంగ ఎవరో కనుక్కోమన్న శివ నారాయణ- నిజాలు బయటపెడతానన్న కార్తీక్- జ్యోత్స్నపై పారు, దీప డౌట్

కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 24 ఎపిసోడ్‌లో తాను ఎవరి నమ్మట్లేదు, అనుమానించట్లేదని, దొంగ ఎవరో కనుక్కోమని, వారు ఎవరైన శిక్ష పడుతుందని శివ నారాయణ అంటాడు. మరోవైపు కాశీని ఇంట్లోంచి వెళ్లమంటుంది కావేరి. సుమిత్రకు టెస్ట్ చేసిన డాక్టర్ మేజర్ ప్రాబ్లమ్ ఉందని చెబుతాడు. దశరథ్ భయపడిపోతాడు.

Published on: Dec 24, 2025 8:05 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రీధర్ తప్పు చేయలేదని, చేశాడని రెండు నమ్మట్లేదు అని శివ నారాయణ అంటాడు. నేను ఎవరిని నమ్మట్లేదు. కాశీ గాడే వాంగ్మూలం ఇచ్చాకా నేను ఎవరిని నమ్మాలి అని శివ నారాయణ అంటాడు. కాశీ సాక్ష్యం చెప్పడం ఏంటని దీప, జ్యోత్స్న ఏమైనా చేసిందా అని పారిజాతం షాక్ అవుతారు.

కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 24వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 24వ తేది ఎపిసోడ్

ఇంటి దొంగ-బయట దొంగ

నేను ఎవరిని పూర్తిగా నమ్మలేను. పూర్తిగా అనుమానించలేను. ఇప్పుడు రైడ్ జరిగింది. దీనంతటికి కారణం ఎవరో తెలుసుకో కార్తీక్. తప్పు చేసింది ఇంట్లోవారైన బయటి వారైనా శిక్ష పడాల్సిందే. మోసానికి పాల్పడింది ఇంటి దొంగ బయటి దొంగో త్వరలోనే తెలుసుకుంటాను అని శివ నారాయణ అంటాడు. కాశీ ఇంటికి వెళ్తాడు.

ఇంట్లోంచి బయటకు వెళ్లు అని కావేరి అంటంది. అవకాశం ఇచ్చిన మామ మీద సాక్ష్యం చెప్పడంపై తల్లికూతుళ్లు ఫైర్ అవుతారు. నిన్ను నమ్మి నీకు విలువ ఇస్తే ఇలా చేస్తావా అని స్వప్న అంటుంది. అర్హత లేని మావయ్యను సీఈఓ చేశారు. అన్ని ఉన్న నాకు పీఏ పోస్ట్ ఇచ్చి కింద పెట్టుకున్నారు. నేను ఇప్పుడు రిజైన్ చేశాను. నాకు జ్యోత్స్న రెస్టారెంట్‌కు సంబంధం లేదని కాశీ అంటాడు.

అత్తయ్య గారు వెళ్లమంటున్నారు. నేను నిన్న అడుగుతున్నా. ఉండనా వెళ్లనా అని కాశీ అంటాడు. ఉండాలి. తప్పు చేయలేదని మా నాన్న బయటకు వచ్చినప్పుడు సారీ చెప్పడానికైనా నువ్వు ఉండాలని స్వప్న అంటుంది. కావేరి వెళ్లిపోతుంది. బాగా ఎగిరిపడుతున్నావ్ ఏంటీ. నువ్వు సాక్ష్యం చెప్పావంటేనే నీ ద్వేషం, క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. నేను చేసిన తప్పు నా కళ్లముందు బాగా కనిపిస్తోందనేసి స్వప్న ఏడుస్తూ వెళ్లిపోతుంది.

సుమిత్ర అత్త కూతురు

దశరథ్‌కు దీప కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు. నాన్నకు ఏమైనా కాల్ చేశారా అని జ్యోత్స్నను అడుగుతుంది. నీకెందుకు చెప్పాలి. వాళ్లకేమైతే నీకేంటీ. చెప్పు. నువ్వెవరు అని జ్యో అంటే.. దీప సుమిత్ర అత్త కూతురు అని కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. దాంతో ఇద్దరు షాక్ అవుతారు. సారే పెట్టడానికి వచ్చినప్పుడు తన కూతురు అని ఇద్దరు చెప్పారుగా అని కార్తీక్ అంటాడు.

ఇంట్లోవాళ్లకు ఏమైనా మేమున్నాం. అది అర్హత లేనివాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదని కార్తీక్ దీపను తీసుకెళ్తాడు. అసలు మమ్మీకి ఏమైంది అని జ్యోత్స్న డౌట్ పడుతుంది. మరోవైపు దశరథ్‌ను డాక్టర్ పిలిస్తే సుమిత్ర కూడా వెళ్తుంది. రిపోర్ట్స్ రావడానికి టైమ్ పడుతుంది. మీరు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాలని డాక్టర్ చెబుతాడు. నాకు ఏమైంది. బాగానే ఉంది. నేను అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదని బయటకు వెళ్తుంది సుమిత్ర.

డాక్టర్‌తో దశరథ్ మాట్లాడుతాడు. మేడమ్ గారి బ్లడ్ శాంపిల్స్ చూస్తే డౌట్ వస్తుంది. అది ఒక స్పెషలిస్ట్‌కు పంపించాం. రెండు రోజుల తర్వాతే రిపోర్ట్స్ వస్తాయి. మేజర్ ప్రాబ్లమే కనిపిస్తుంది. మరోసారి నోట్లో నుంచి బ్లడ్ పడటం, కళ్లు తిరిగడం జరగొచ్చు. మీరే జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ అంటాడు. రిపోర్ట్స్ వచ్చేవరకు ఏం చెప్పలేను. ఏదైనా సరే ఫేస్ చేసేందుకు మీరు ధైర్యంగా ఉండండి అని డాక్టర్ చెబుతాడు.

అమ్మకు ఎలా ఉంది

దాంతో దశరథ్ భయంతో వెళ్లిపోతాడు. ఇంటికి వస్తారు. మనం కాస్తా ప్రేమ చూపించాల్సిన సమయం వచ్చింది అని జ్యోత్స్న రాగానే తనకంటే ముందే దీప అమ్మకు ఎలా ఉంది. టెస్ట్‌లు చేయించారా అని అడుగుతుంది. టెస్ట్‌లు చేయించాం. అంతా బాగుందని అని సుమిత్ర చెబుతుంది. తర్వాత శ్రీధర్ విషయం, పుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రైడ్ గురించి చెబుతారు.

అన్నయ్య ఏం తప్పు చేయడని సుమిత్ర, బావ తప్పు చేయడని దశరథ్ అంటారు. దాంతో జ్యోత్స్న చప్పట్లు కొడుతుంది. వాళ్ల నమ్మకంపై సెటైర్లు వేస్తుంది. కంపెనీ పాతాళానికి వెళ్లింది. దీనంతటికి కారణం శ్రీధర్ మావయ్య. అర్హత లేనివాళ్లను కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది అని జ్యోత్స్న అంటుంది. దానికి కార్తీక్ చప్పట్లు కొడతాడు.

అర్హత లేని మనిషే ఇన్నాళ్లు కూర్చొంది. ఆ మనిషి వల్లే దేవాలయం లాంటి రెస్టారెంట్ పడిపోయింది. కానీ, ఇప్పుడు కూర్చొంది సమర్ధుడే. అది నా తండ్రే. ఇదంతా ఎవరో కావాలని ప్లాన్ చేశారు. అందుకే నా తండ్రి పోలీస్ స్టేషన్‌లో కూర్చొన్నాడు. అది ఎవరు చేశారో కనిపెట్టి బయటపెడతాను. అప్పుడు ఈ గొంతులు ఎలా లేస్తాయో చూస్తాను అని కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు.

జ్యోత్స్నపై డౌట్

కార్తీక్ గాడి మాటలు వింటే జ్యోత్స్నే ఏదో తప్పు చేసినట్లుందని పారిజాతం, నాకు జ్యోత్స్న మీదే డౌట్‌గా ఉంది బావ. ఈ మనిషి వల్ల అందరు బాధపడాల్సి వస్తుందని దీప డౌట్ పడతారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.