కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: భయంతో కాశీ-జ్యోత్స్నకు రిటర్న్ గిఫ్ట్-శ్రీధర్ తప్పు ఉందన్న శివనారాయణ-రెస్టారెంట్‌పై రైడ్
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 23 ఎపిసోడ్ లో శ్రీధర్ కు బెయిల్ రాకపోవడంతో కాశీ భయపడతాడు. వైరాకు కాల్ చేసి మాట్లాడతాడు. పీఏ పోస్టుకు రిజైన్ చేస్తాడు. జ్యోత్స్న చేసిన తప్పుల ప్రూఫ్స్ ను అక్కకు ఇవ్వాలనుకుంటాడు. మరోవైపు శ్రీధర్ తప్పు చేశాడని శివ నారాయణ నమ్ముతాడు.
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 23 ఎపిసోడ్ లో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన కాశీ.. వైరాకు కాల్ చేసి కార్తీక్ మా బావ, శ్రీధర్ మా మామయ్య అని చెప్తాడు. షాక్ అయిన వైరా మంచి పనే చేశావ్. నీ లాంటి టాలెంటెడ్ పర్సన్ ను పీఏగా పెట్టుకుని మీ మామయ్య తప్పు చేశాడని కాశీని మాయ చేయాలనే చూస్తాడు.

కాశీకి భయం
ఏదో చిన్న వార్నింగ్ లాంటిది అంటే సరే అన్నాను కానీ ఇప్పుడు భయంగా ఉందని కాశీ అంటాడు. కల్తీ ఫుడ్ తిన్నవాళ్లు ఎవరైనా చచ్చారా? నీ పేరు ఎవరైనా చెప్పారా? మరి ఎందుకు భయపడుతున్నావ్. మీ మామను సరైన దెబ్బ కొట్టావు. దీంతో సీఈఓ పోస్ట్ పోతుంది. బెయిల్ అంటావేంటీ? ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. అనవసరంగా కంగారు పడి నా పేరు చెప్పకు. నష్టం నీకే. నిన్ను ఇంట్లో నుంచి తరిమేస్తారని వైరా భయపెడతాడు.
కాశీ రిజిగ్నేషన్
వైరాతో కాశీ ఫోన్లో మాట్లాడుతుండగా కార్తీక్ వచ్చి భుజం మీద చేయి వేస్తాడు. కాశీ కాల్ కట్ చేస్తాడు. ఏమైంది కాశీ? ఎందుకు మా నాన్న మాటలను రికార్డు చేసి, కొన్ని మాత్రమే కట్ చేశావ్? ఇప్పుడు మాటలు వినిపించమని కార్తీక్ అడుగుతాడు. యాప్ డిలీట్ చేశానని కాశీ అంటే, మా నాన్న మాటలను రికార్డు చేసేందుకు మాత్రమే డౌన్ లోడ్ చేశావా? నీ వాంగ్మూలం వల్లే నాన్నకు బెయిల్ రాలేదని కార్తీక్ అంటాడు.
కొడుకు దూరంగా ఉన్నా అల్లుడిని పక్కనే పెట్టుకున్నాడు. అల్లుడిలో కొడుకును చూసుకున్నాడు. నువ్వు ఏం తప్పు చేయలేదా? అని కార్తీక్ అడుగుతాడు. ఏ తప్పు చేయలేదని కాశీ అంటాడు. మీ మామగారు నీ భవిష్యత్ గురించే ఆలోచించేవారు. ఆయన ఇచ్చే భవిష్యత్ లో ఉండే అర్హత నీకు లేదని శివ నారాయణ అంటాడు. అందుకే నేను జాబ్ కు రిజైన్ చేశానని రిజిగ్నేషన్ లెటర్ తీసి ఇస్తాడు కాశీ. సారీ బావ ఇది నా నిర్ణయమని కాశీ అంటే, వెళ్లి ఆఫీస్ లో ఇవ్వమని శివ నారాయణ చెప్తాడు.
తప్పు చేయలేదు
కార్తీక్ మా పిన్ని ఫోన్ చేసి మీ నాన్నను పోలీసులు అరెస్టు చేశారని చెప్పిందని కాల్ చేసి కాంచన అడుగుతుంది. నేను స్టేషన్ దగ్గరే ఉన్నా నాన్న తప్పు చేశారని అరెస్ట్ చేశారు. బెయిల్ కూడా ఇవ్వమన్నారు. నాన్న తప్పు చేశాడని నువ్వు నమ్ముతావా అమ్మ. నాన్న నిర్దోషిగా బయటకు వస్తాడని ఫోన్ పెట్టేస్తాడు కార్తీక్. మాస్టారు తప్పు చేయలేదని ఎలా నిరూపించాలని కార్తీక్ అనుకుంటాడు.
జ్యోత్స్నకు రిటర్న్ గిఫ్ట్
మరోవైపు ఆఫీస్ లో ఫైల్స్ వెతుకుతాడు కాశీ. అప్పుడు జ్యోత్స్న కాల్ చేస్తుంది. నిజాలు బయటపడితే ఎలా? అని కాశీ అడుగుతాడు. అదంతా వైరా చూసుకుంటాడు. మీ బావ నా మీద కుట్ర చేశాడు. నాన్నను సీఈఓ చేశాడు. నన్ను తప్పుకోమంటే సరిపోయేది కదా. ఆస్తి నాదే అయినప్పుడు చిన్న పదవి కోసం ఎందుకు తాపత్రాయపడతా? నిన్ను నేను అర్థం చేసుకున్నా. నువ్వు బాగుండాలి తమ్ముడు. హ్యాపీగా జీఎం పని చేసుకో. నీ ఫ్యూచర్ కు నాది గ్యారెంటీ అని జ్యో చెప్తుంది.
ఈ తమ్ముడు నీ గురించి కూడా ఆలోచిస్తాడు అక్క. నువ్వు తప్పు చేశావని ప్రూవ్ చేసే అకౌంట్స్ ఫైల్స్ సాఫ్ట్ కాపీస్ నా దగ్గరున్నాయి. నేను జాబ్ లో జాయిన్ కాగానే పార్టీ ఇచ్చి ఈ గిఫ్ట్ ఇస్తానని కాశీ చెప్పడంతో జ్యో గంతులు వేస్తుంది. ఈ మైండ్ గేమ్ లో బావ ఎలా నిలబడతావో చూస్తానని అనుకుంటుంది.
దీప కన్నీళ్లు
మామయ్యకు ఏమైందని దీప అడుగుతుంది. మీ అమ్మ హాస్పిటల్లో ఉంది, మా నాన్నేమో స్టేషన్ లో ఉన్నారు. బెయిల్ కూడా ఇవ్వమన్నారు. నాన్న ఏ తప్పు చేయలేదని మనం నమ్మితే సరిపోదు చట్టం నమ్మాలి. ఫుడ్ కల్తీ జరిగింది. ఎవరో చెప్పినట్లు పోలీసులు నాన్న దగ్గరకు వెళ్లారు. కల్తీ ఫుడ్ తిన్నవాళ్లలో ఒకరి కండీషన్ సీరియస్ గా ఉందని కార్తీక్ చెప్పగానే దీప ఏడుస్తూ కూలబడుతుంది.
ఏంటి బావ ఒకేసారి ఇలా జరుగుతుంది. కాశీ పక్కనే ఉండి నిజం చెప్పలేడా? ఫుడ్ ట్రక్ గురించి చెప్పింది నేనే కదా. నేనే కారణమని దీప అంటుంది. మామయ్యను అరెస్ట్ చేశారని కాశీ స్టేషన్ దగ్గరే కూర్చుని బాధపడుతుంటాడని దీప అంటుంది. కాశీ సాక్ష్యం చెప్పాడని చెప్తే బాధపడతావని కార్తీక్ అనుకుంటాడు.
రెస్టారెంట్ పై రైడ్
ప్రభాకర్ వచ్చి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మన రెస్టారెంట్ మీద దాడి చేశారంటాడు. ఫుడ్ కల్తీ జరిగిందని భారీ ఫైన్ వేశారని చెప్తాడు. ఇంటి అల్లుడు బాగానే దెబ్బ వేశాడని పారు అంటుంది. తప్పు చేయకపోయినా పెద్దయ్య గురించి ఆలోచించి మామయ్య అరెస్ట్ అయ్యారని దీప అంటుంది. ఇంకా నయం మా ఆయన తప్పు చేసి మీ మామను ఇరికించారని అనలేదని పారు అంటుంది. వీళ్లకు తప్పులు చేయడం కాదు, తప్పించుకోవడం కూడా తెలుసు అని జ్యో మాట్లాడుతుంది.
శ్రీధర్ తప్పు
ఏ తప్పు చేశారని బెయిల్ ఇవ్వలేదు? అని అడుగుతుంది జ్యో. బెయిల్ ఇవ్వలేదని నీకు ఎలా తెలుసు? మా నాన్న ఏ తప్పు చేయలేదని కార్తీక్ అంటాడు. కల్తీ ఫుడ్ తిన్నవాళ్లలో ఎవరైనా చనిపోతే మీ నాన్నకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. రెస్టారెంట్ మూత పడుతుందని పారు అంటుంది. నాకు జ్ణానం ఉంది. అందుకే నీలా మాట్లాడటం లేదని కార్తీక్ అంటాడు. ఏం తాత మామయ్య తప్పు లేదని నువ్వు నమ్ముతున్నావా? అని జ్యో అడిగితే, లేదని శివ నారాయణ అంటాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


