కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సుమిత్రకు టెస్టులు-శ్రీధర్ అరెస్ట్‌పై జ్యోత్స్న మాటల తూటాలు-పోలీస్ స్టేషన్‌కు కార్తీక్, తాత

కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 20 ఎపిసోడ్‌లో సుమిత్ర రక్తపు వాంతులు చేసుకోవడం కార్తీక్‌కు చెబుతుంది. తనకు అని చెప్పి సుమిత్రను టెస్టులకు తీసుకెళ్తాడు దశరథ్. శ్రీధర్ అరెస్ట్ గురించి ఇంట్లో అందరికి చెబుతుంది జ్యోత్స్న. మాటల తూటాలు పేలుస్తూ రచ్చ రచ్చ చేస్తుంది జ్యోత్స్న.

Published on: Dec 20, 2025, 08:34:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కార్తీక్‌కు సుమిత్ర నోటి నుంచి రక్తం పడిన విషయం గురించి చెబుతుంది దీప. అమ్మకు ఏదైనా వ్యాధి ఉందా అని భయపడుతుంది. దాంతో గురూజీ చెప్పిన గండం అత్తకేనా అని కార్తీక్ అనుమానిస్తాడు. కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువ భయాలు, టెన్షన్ పడకూడదని కార్తీక్ నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తాడు కార్తీక్.

కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 20వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 20వ తేది ఎపిసోడ్

నా వల్లే చనిపోయిందనేది

ఒక తల్లిని తెలియకుండానే పోగొట్టుకున్నాను. మరో తల్లిని పోగోట్టుకోలేను. మా అమ్మ అనారోగ్యంతో పోయింది. కానీ మా అత్త మాత్రం నావల్ల చనిపోయిందనేది. ఇప్పుడు నీకు అర్థం అవుతుందా నా భయం అని దీప అంటుంది. అర్థమవుతోంది. ఒకసారి మావయ్యతో మాట్లాడుదాం అని కార్తీక్ అంటాడు. దశరథ్‌తో మాట్లాడుతారు.

దీప ప్రెగ్నెంట్ కాకముందునుంచే మీ అత్తకు ఆరోగ్యం బాలేదురా. కానీ పట్టించుకోలేదని దశరథ్ అంటాడు. ఇంతలో సుమిత్ర వస్తుంది. హాస్పిటల్‌కు ఎందుకు అని అడుగుతుంది. నీకు టెస్ట్‌లు చేయించాలని కార్తీక్ అంటాడు. వయసు వచ్చాక ఆరు నెలలకు ఓసారి టెస్ట్‌లు చేయించుకోవాలని దశరథ్ అంటాడు. నీ విషయంలో ఏ చిన్నది జరిగిన ఆయన తట్టుకోలేరు అని కార్తీక్ అంటాడు.

టెస్టులు నాకు సుమిత్ర

టెస్టులు నాకు సుమిత్ర. కొద్దిరోజులుగా అన్ఈజీగా ఉంటుంది అని దశరథ్ అంటాడు. వెంటనే హాస్పిటల్‌కు వెళ్దామని సుమిత్ర అంటుంది. ఇద్దరు టెస్టులు చేయించుకోండని కార్తీక్ అంటే సరే అంటుంది. శివ నారాయణకు మాత్రం తనకు బాగా లేదని అబద్ధం చెప్పమని సుమిత్ర అంటుంది. దాంతో కార్తీక్, దీప, దశరథ్ ఎమోషనల్ అవుతారు.

ఇద్దరు వెళ్తారు. దీప ఏడుస్తూ భయపడుతుంది. కార్తీక్ ఓదారుస్తాడు. ముత్యాలమ్మ తల్లి మా అమ్మకు ఏం కాకూడదు అని మొక్కుకుంటుంది. మరోవైపు సుమిత్రకు టెస్ట్‌లు చేయిస్తారు. సుమిత్రకు ఏం చెప్పనని డాక్టర్ అంటాడు. మరోవైపు శివ నారాయణ సీరియస్ అవుతాడు. ల్యాప్‌ట్యాప్‌లో అందరికి శ్రీధర్ అరెస్ట్ చూపిస్తుంది జ్యోత్స్న.

అందుకే నీ తల్లి వదిలేసింది

జ్యోత్స్న రచ్చ చేస్తుంది. నా తండ్రి ఎలాంటి వాడో నాకు తెలుసు అని కార్తీక్ అంటే.. అందుకే నీ తల్లి వదిలేసిందని జ్యోత్స్న అంటుంది. వన్ ఇయర్‌లో నేను తీసుకురాని పబ్లిసిటీని ఒక్కరోజులో తీసుకొచ్చాడని జ్యోత్స్న అంటుంది. కల్తీ ఆహారం సప్లై చేసి నిండా ముంచారు అని జ్యోత్స్న అంటుంది. శివ నారాయణ మీద పగ తీర్చుకునేందుకే ఇలా కావాలని చేశాడని పారిజాతం అంటుంది.

అంతా వాదించుకుంటారు. తాత ముందు పోలీస్ స్టేషన్‌కు వెళ్దామని కార్తీక్ అంటే.. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాలి. మనకు దానికి సంబంధం లేదని చెప్పాలంటుంది జ్యోత్స్న. కార్తీక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్దామంటే సరే అని శివ నారాయణ వెళ్తాడు. తండ్రి తప్పులో బావకు కూడా భాగమున్నట్లుంది అని జ్యోత్స అంటుంది.

అన్నీ గుర్తు పెట్టుకుంటాను

ఈ మాటలన్నీ నేను గుర్తు పెట్టుకుంటాను అని దీప వెళ్లిపోతుంది. మనకు అవకాశం దొరికిందే బాగా వాడుకోవాలి అని పారిజాతం అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More