కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: వైరాకు జీఎంగా కాశీ- శ్రీధర్ అరెస్ట్, మామపై కాశీ రివేంజ్- సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్-దీప షాక్

కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 19 ఎపిసోడ్‌లో వైరా దగ్గరికి కాశీ వెళ్తాడు. బాగా బ్రెయిన్ వాష్ చేసి జీఎంగా జాయిన్ చేసుకుంటాడు. తర్వాత శ్రీధర్ దగ్గరికి పోలీసులతో కాశీ వెళ్తాడు. శ్రీధర్, కాశీని ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. సుమిత్ర రక్తపు వాంతులు చేసుకుంటుంది. అది చూసి దశరథ్, దీప షాక్ అవుతారు.

Published on: Dec 19, 2025, 09:19:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీకి సర్ అంటా బాగా మర్యాదలు చేస్తాడు వైరా. దానికి కాశీ ఆశ్చర్యపోతాడు. నీ గురించి జ్యోత్స్న చెప్పింది. మీ రెజ్యూమ్ చూశాను. చాలా మెరిట్ ఉంది. వాళ్లు పీఏగా పెట్టుకున్నారు. నా దగ్గర ఉంటే జీఎమ్‌గా పెట్టుకునేవాన్ని అని వైరా అంటాడు.

కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 19వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ డిసెంబర్ 19వ తేది ఎపిసోడ్

వైరా దగ్గర కాశీ

కాశీకి బ్రెయిన్ వాష్ చేస్తాడు వైరా. అందరూ నీచంగా చూస్తారంటాడు. స్వప్న, కార్తీక్, శ్రీధర్ అన్న మాటలు తలుచుకుంటాడు కాశీ. నిన్ను వెంటనే జీఎమ్‌గా తీసుకుంటున్నాను అని వైరా అంటాడు. అక్కడ పర్మిషన్ తీసుకోవాలని కాశీ అంటాడు. నేను ఇచ్చిన రెస్పెక్ట్ మీ బాస్ నీకు ఇచ్చాడా. ఆలోచించుకో. నిన్ను తన కాలు కింద చెప్పులా పెట్టుకున్నాడు. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని రెచ్చగొడతాడు వైరా.

బుద్ది చెప్పాలంటే ఇక్కడ ఉంటావ్. లేకపోతే చేతకాని దద్దమ్మలా అయిపోతావ్ అని వైరా అంటాడు. బుద్ధి చెబుతాను అంటాడు కాశీ. వెరీ గుడ్. ముందు అక్కడ రిజైన్ చేయి. మీ బాస్‌కు ఎలా బుద్ధి చెప్పాలో, ఎక్కడ చెప్పాలో నేను చెబుతాను అని వైరా అంటాడు. మరోవైపు స్కూటీపై కార్తీక్, దీప వెళ్తారు. ఇప్పుడు చేస్తుంది వనవాసం. తర్వాత అంతా బాగుంటామని కార్తీక్ అంటాడు.

దారిలో ఫుడ్ ట్రక్ దీపకు చూపిస్తాడు కార్తీక్. నీ కల నెరవేరిందని కార్తీక్ అంటాడు. ఫుడ్ దానం ఇస్తారు. అది తీసుకున్నవాళ్లు ఆశీర్వదిస్తారు. కార్తీక్, దీప సంతోషంగా వెళ్లిపోతారు. నా మీద ఇంకా నమ్మకం లేదా అని జ్యోత్స్నకు కాల్ చేసి కాశీతో మాట్లాడిస్తాడు వైరా. నీకు జీఎమ్‌ పోస్ట్ ఇప్పించాను. మంచి జీతం. ఎవరి దగ్గర నిల్చుని పని చేయాల్సిన అవసరం లేదు. నాకు మన ఫ్యామిలీ మీద ప్రేమ ఉంది. మనం యూనిటీగా ఉండాలి అని జ్యోత్స్న అంటుంది.

బోనస్ కింద పది లక్షలు

నీకు జాయినింగ్ బోనస్ కింద పది లక్షలు ఇస్తాను. నీ పనులు చూసుకో. నువ్వు చేయాల్సినవి రెండే పనులు. నీ బాసుకు బుద్ధి చెప్పడం. అక్కడ రిజైన్ చేయడం అని వైరా అంటాడు. సరే సర్. మీ మేలు ఎన్నటికీ మర్చిపోను అని కాశీ అంటాడు. నేనే నీకు రివేంజ్ తీర్చుకునే ఛాన్స్ ఇస్తాను. నేను చెప్పింది చేస్తే చాలు అని వైరా అంటాడు. దాంతో కాశీ వెళ్లిపోతాడు.

మరోవైపు మీడియాతో శ్రీధర్ మాట్లాడుతాడు. కంపెనీ గురించి, ఫుడ్ దానం గురించి చెబుతాడు. ఇంతలో పోలీసులు వస్తారు. వారితో కాశీ వస్తాడు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీ కల్తీ ఫుడ్ తినడం వల్ల చాలా మంది హాస్పిటల్‌లో చేరారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. మీ పీఏ మీదే బాధ్యత ఉందని చెప్పాడు. మీరు కాదంటే మీ ఛైర్మన్ దగ్గరికి వెళ్తాం అని ఎస్సై అంటాడు.

పూర్తి బాధ్యత నాదే అని శ్రీధర్ అంటాడు. సర్వీస్ అని చెప్పి ఇంత ఫ్రాడ్ చేస్తారా అని నానా మాటలు అంటుంది మీడియా. శ్రీధర్, కాశీని ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. మరోవైపు దీప ఊడిస్తుంటే సుమిత్ర తీసుకుని ఊడుస్తుంది. పుట్టింట్లో కూతురు గర్భవతిగా ఉండటం గురించి గొప్పగా చెబుతుంది సుమిత్ర. మనం కట్టని గుడి అమ్మ ఒడి. పూజించని దైవం అమ్మ రూపం అని సుమిత్ర అంటే దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది.

సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్

నీ తల్లి చెప్పాల్సిన జాగ్రత్తలు నేను చెబుతున్నాను. పోనీ మీ అమ్మ నాలో వచ్చి చెప్పింది అనుకో అని సుమిత్ర అంటుంది. దాంతో దీప పుట్టింట్లో సేవలు చేసుకున్నట్లుగా చేసుకుంటుంది. సుమిత్ర ఊడుస్తూ ఒకేసారి తెగ దగ్గుతుంది. సుమిత్ర రక్తం వాంతి చేసుకుంటుంది. అది చూసి దీప, దశరథ్ ఇద్దరు షాక్ అవుతారు. సుమిత్ర చూడకుండా నీళ్లు పోస్తాడు దశరథ్.

సుమిత్రను పక్కకు కూర్చోబెట్టి దీప దగ్గరికి వస్తాడు దశరథ్. ఈ విషయం సుమిత్రకు, ఇంట్లో ఎవరికి తెలియకూడదు అని దీపకు కంగారుగా చెబుతాడు దశరథ్. దాంతో అమ్మకు ఏదో అయింది అని దీప కంగారుపడుతుంది. చూస్తుంటే సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అని తెలుస్తోంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More