కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:శ్రీధర్ అరెస్టుకు దీప కారణం-జ్యో ప్లాన్ బి-కాశీ సాక్ష్యం-తండ్రికి బెయిలు రాక కార్తీక్ షాక్
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 22వ ఎపిసోడ్ లో శ్రీధర్ అరెస్టుకు దీపే కారణమంటూ కాంచనను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది పారిజాతం. పారుకు దీప వార్నింగ్ ఇస్తుంది. పోలీస్ స్టేషన్ లో ఉన్న శ్రీధర్ కు బెయిల్ రాదని ఎస్సై చెప్తాడు. కాశీ సాక్ష్యం చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు.
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 22 ఎపిసోడ్ లో శ్రీధర్ అరెస్ట్ వీడియోను కాంచనకు పారిజాతం పంపిస్తుంది. ఈ వీడియో చూసి కాంచన కంగారు పడుతుంది. అప్పుడే పారు ఫోన్ చేసి నా భర్త పరువును రోడ్డుకు ఈడ్చారు కదా. అబద్దాలు చెప్పడం, మనుషులను మోసం చేయడం మీ ఇంట్లో వాళ్లందరికీ అలవాటే కదమ్మా. నువ్వు ఎదురుగా నిలబడ్డా ఇలాగే మాట్లాడతానని పారు అంటుంది.

భర్త మోసం చేశాడు
నీ లాంటి ఒక కూతురిని కని నీ తండ్రి తప్పు చేశాడు. నువ్వేమో నీ అన్నకు మాటిచ్చి మోసం చేశావు. నీ కోడలేమో నా మనవరాలికి మాటిచ్చి మోసం చేసింది. నీ కొడుకేమో మేన కోడలిని పెళ్లి చేసుకోకుండా ఊర్లో ఎవరి ముందు తల ఎత్తుకోకుండా చేశాడు. ఇప్పుడేమో నీ భర్త మోసం చేశాడు. ఇప్పుడు చెప్పు శివ నారాయణకు కూతురు ఉండటం వల్ల కలిగిన ఆనందం ఏంటో చెప్పు? డబ్బు కోసం మరీ ఇంత దిగజారిపోతారని అనుకోలేదని కాంచనతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది పారిజాతం.
దీప కారణం
ఇంకా నిజాలు తేలలేదని కాంచన అంటే, ఏంటే తేలే నిజాలు. నీ భర్త, అతని అల్లుడు ఆఫీస్ లో పెత్తనం చేస్తుంటే, నీ కొడుకు, కోడలు నా ఇంట్లో పెత్తనం చేస్తున్నారు. ఏం ప్లాన్ చేశావ్ కాంచన. నా నోరు చెడ్డదే. అలాగే నీ భర్త బుద్ధి కూడా చెడ్డదే. ఆ మనిషే కల్తీ. నీ భర్తను పోలీసులు అరెస్ట్ చేయడానికి కారణమే దీప.
ఈ ఫుడ్ ట్రక్ సలహా దీపది. కార్తీక్ చెప్పగానే శ్రీధరేమో సరేనన్నాడు. మర్చిపోకుండా దీప ఇంటికి రాగానే స్వీట్ పెట్టి ఆశీర్వదించు. కోడలి ఐడియా అదుర్స్, మామగారి బతుకు మటాష్ అనే టైటిల్ అదిరిపోయింది కదా అని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది పారు.
జ్యోత్స్న మాటలు
దీప కూరగాయలు కట్ చేస్తూ ఆలోచిస్తుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి ఏం వంట చేస్తున్నావ్ దీప అని అడుగుతుంది. నీకు ఆకలి కూడా వేస్తుందా? అని దీప అంటుంది. జరిగిన దానికి తినడం మానేస్తే ఇలాంటివి మీరు రోజు చేస్తూనే ఉంటారు. అప్పుడు ఆకలితో చావాలి. ఓ గ్లాస్ వాటర్ ఇవ్వు అని జ్యోత్స్న అడుగుతుంది. గ్లాస్ తీసుకోకుండా దీపను నానా మాటలు అంటుంది జ్యో.
బిడ్డ పడటంతో
ఇప్పటివరకూ ఈ ఇంట్లో మంచి దానిలా నటిస్తూ అందరి మనసుల్లో స్థానం సంపాదించావు. నువ్వు చేసిన ఒకే ఒక తప్పు ఫుడ్ ట్రక్ ఐడియా ఇవ్వడం. ఇది అందరి జీవితాలను మార్చబోతుంది. ముందుగా మీ మామయ్యది అని జ్యో అంటుంది. అప్పుడే పారు వచ్చి శ్రీధర్ ను ఇద్దరు భార్యలకు దూరం చేసింది దీప. దీప మెడలో తాళి పడింది కార్తీక్ రోడ్డు మీద పడ్డాడు. దీప కడుపులో బిడ్డ పడింది మామ స్టేషన్ లో పడ్డాడు. ఆ బిడ్డ భూమ్మీద పడితే ఎంత మంది పోతారో అని పారు రెచ్చిపోతుంది.
దీప సీరియస్
నా బిడ్డ జోలికి రావొద్దు. ఇంతకుముందు చెప్పా ఇప్పుడు మళ్లీ చెప్తున్నా. కడుపులో ఉన్న బిడ్డ గురించి మాట్లాడొద్దని సీరియస్ గా చెప్తుంది దీప. బావ వెళ్లాడు మామయ్యను తీసుకొస్తాడని కాన్ఫిడెంట్ గా ఉన్నట్లున్నావని దీపను అడుగుతుంది జ్యో. బావ మీద నాకు నమ్మకం ఉంది. తప్పు చేయని మనిషి వైపు ఓడిపోనివ్వకుండా నిలబడతాడు. నిజం నిప్పు లాంటిది. ఆటలాడాలని చూస్తే అంతు చూస్తుందని దీప అంటుంది.
ప్లాన్ బి
వైరాకు కాల్ చేసి ఏంటి సార్ అంతా ఓకేనా? బయటకు రావొద్దు. ప్లాన్ ఏ అయిపోయింది. ప్లాన్ బి స్టార్ట్ చేయండని జ్యోత్స్న అంటుంది. ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ కూడా అయిపోయింది. దాని రిజల్ట్ మీ వరకూ వస్తుందని వైరా చెప్తాడు. నేను సీఈఓ అవగానే నా కంపెనీలో సగం షేర్స్ మీవేనని చెప్పి కాల్ కట్ చేస్తుంది జ్యో. సీఈఓ అయ్యేంతవరకే నీతో, కాశీతో పని ఆ తర్వాత మిమ్మల్ని ఏం చేయాలో నాకు తెలుసని అనుకుంటుంది జ్యోత్స్న.
బెయిల్ కుదరదు
పోలీస్ స్టేషన్ లో ఉన్న శ్రీధర్ కోసం కార్తీక్, శివ నారాయణ వస్తారు. బెయిల్ ఇవ్వడానికి వచ్చానని శివ నారాయణ అంటాడు. రెస్టారెంట్ ఓనర్ మీరే కాబట్టి మీ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ఫుడ్ ట్రక్ బాధ్యత అంతా నాదేనని చెప్పాడు. బెయిల్ ఇవ్వడం కుదరదు. ఆ కల్తీ ఫుడ్ తిన్నవాళ్లు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్లకు ఏం కాలేదని డాక్టర్ రిపోర్ట్ ఇవ్వలేదు. కల్తీ ఫుడ్ ఇచ్చారనే బలమైన సాక్ష్యం ఉంద అని రికార్డింగ్ వినిపిస్తాడు పోలీస్.
కాశీ సాక్ష్యం
అప్పుడే కాశీ వస్తాడు. అతనే సాక్ష్యం చెప్పాడని, బెయిల్ ఇవ్వడం కుదరని అంటాడు ఎస్సై. కావాలనే కొన్ని మాటలు ఎలా రికార్డు చేస్తారు? చిన్న మిస్టేక్ జరిగిందని కార్తీక్ అంటాడు. కానీ ఫుడ్ ఎక్కువగా మిగిలిపోయిందని మామయ్య కాల్ చేశారు. ఫుడ్ బాలేదు పడేస్తానని అంటే పంచమన్నారని కాశీ చెప్తాడు. కోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకోమంటాడు ఎస్సై.
అల్లుడు మీతో కలిసి ఉంటాడనే స్వార్థంతో పీఏగా పెట్టుకున్నా. అల్లుడి మీద అధికారం చూపించా. కానీ వాడికి బాధ ఉంది. కోపంతో మాటలంటే సిన్సియర్ గా ఉంటాడని అనుకున్నా. నన్ను వదిలించుకునే రోజు కోసం వాడు ఎదురు చూస్తున్నాడని కార్తీక్ తో శ్రీధర్ అంటాడు. నా తండ్రి ఏ తప్పు చేయడు, కాశీతో మాట్లాడతానని కార్తీక్ వెళ్లిపోవడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


