కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: శ్రీధర్‌కు దీప షాక్-కాశీ, స్వప్నలను కలిపిన కార్తీక్-వీఐపీలా దీపను చూసి జ్యో కంగారు
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 15 ఎపిసోడ్ లో కాంచనకు టిఫిన్ పంపిస్తాడు శ్రీధర్. మరోవైపు కాంచన పక్కన తనను భర్తగా నిలబెడతానని మాట ఇవ్వమని దీపను అడుగుతాడు శ్రీధర్. కానీ దీప మాట ఇవ్వదు. ఇక కాశీ, స్వప్నను కలుపుతాడు కార్తీక్. దీప వీఐపీలా శివ నారాయణ ఇంటికి వెళ్తుంది. జ్యోకు కౌంటర్ ఇస్తుంది.
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 15 ఎపిసోడ్ లో కాంచనతో ఫోన్లో మాట్లాడుతూ నా సగం నీతో పంచుకోవాల్సిందే అంటూ టిఫిన్ క్యారేజీ పంపిస్తాడు శ్రీధర్. నువ్వు రావని తెలిసే, టిఫిన్లు పంపించా. మనం అనుకోవాలే కానీ మనసులో ఉన్న మనిషి మనతో ఉన్నట్లే. నువ్వు అక్కడ తిను. నేను ఇక్కడ తింటానని కాల్ కట్ చేస్తాడు శ్రీధర్. కాంచన ప్లేట్లో పెట్టుకుని తింటూ ఫీల్ అవుతుంది.

కాంచన ఎమోషనల్
మీ బాధ మీరు చెప్పుకుంటున్నారు నా బాధ నేను చెప్పుకోలేకపోతున్నా. కొన్నిటిని వద్దని వదిలేసుకున్నాక మనతో ఉంటే మనసుకు చేసే గాయాలవుతాయి. మనకు రాసి ఉంటే అది మనకు దక్కుతుందంటారు. నా అయిదోతనం మీద భగవంతుడు మరొకరి పేరు రాశాడనుకుంటూ ఏడుస్తూ కాంచన టిఫిన్ చేస్తుంది.
మూడు రోజులకు
మీరు వస్తే ఇంత సంతోషంగా ఉంటుందనుకుంటే వారానికి మూడు రోజులు ఇక్కడే టిఫిన్ చేసేలా కండీషన్ పెట్టేవాడిని అని కార్తీక్, దీపతో శ్రీధర్ అంటాడు. మీ కోడలు మీ ఇష్టం. మీరు మీరు ఎన్ని కండీషన్లయినా పెట్టుకోండి. రావడానికి నాకు ఇబ్బంది లేదని కార్తీక్ అంటాడు. స్వప్న కాశీ ఎక్కడున్నాడు అని కార్తీక్ అడుగుతాడు. గదిలో ఉన్నాడని చెప్పగానే కార్తీక్ వెళ్తాడు. దీప ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతాడు శ్రీధర్.
గుండెలో కత్తి
మీ అత్త కోడళ్లు ఇద్దరూ కలిసిమెలిసే ఉంటారు కదా అని దీపను అడుగుతాడు శ్రీధర్. మా మధ్య గొడవలు లేవు. ఎప్పుడైనా మాట పట్టింపు వచ్చినా మళ్లీ కలిసిపోతామని దీప చెప్తుంది. గుండెలో కత్తి దిగిన మనిషికి జరిగిన గాయమే కాంచన అత్తయ్యకు జరిగింది. కాంచన అత్త కళ్లు కూడా చీకటి తెలియని ఆకాశంలా ఉంటాయి. కళ్లు మూస్తే గతం కనిపిస్తుంది. ఇప్పుడు జాలి చూపిస్తే ప్రయోజనం లేదని దీప అంటుంది.
మాట ఇవ్వు దీప
కాంచనకు యాక్సిడెంట్ అయినప్పుడు బాగా ఏడ్చా. మీ కాళ్లు ఉన్నప్పుడు నేను ఎందుకు అవిటిదాన్ని అవుతానని చెప్పింది. కానీ ఇప్పుడు అవిటిదాన్ని చేశా. కాంచన ఎప్పుడూ ఒకేలా ఉంది. నేనే రకరకాలుగా మారుతున్నా. దీప నాకో సాయం చేస్తావా? మీ అత్తయ్యతో నా గురించి మాట్లాడతావా? నువ్వు మాట్లాడి తన పక్కన భర్తగా నన్ను నిలబెట్టగలవా? నిలబెడతానని మాటివ్వు దీప అని అడుగుతాడు శ్రీధర్.
నేను ఇప్పుడు మాట ఇవ్వలేను మామయ్య. మీరు ఇద్దరు కలవాలంటే ఒక పని చేయాలి. అత్తయ్యతో మాట్లాడటం మానేయండి. ఇలా కొన్ని రోజులు దూరంగా ఆవిడ మనసులోని అభిప్రాయం తెలుస్తుందని దీప చెప్తుంది. నువ్వు చెప్పింది ఒకసారి ఆలోచిస్తా. నువ్వు కూడా నాపై తనకు ఉన్న అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేయమని శ్రీధర్ రిక్వెస్ట్ చేస్తాడు.
అర్థం చేసుకోండి
కాశీతో కార్తీక్ మాట్లాడతాడు. కాలర్ ఎగరేసుకునేంత గొబ్బ జాబ్ ఏం చేయడం లేదు బావ అని కాశీ అంటాడు. నేను లండన్ లో చదువుకున్నా. వైజాగ్ లో చదువుకున్న నువ్వే పీఏ జాబ్ కోసం ఇలా అంటున్నావు. మరి డ్రైవర్ గా నేను ఏం అనుకోవాలి. జాబ్ భవిష్యత్ కోసం. ఏదేదో ఊహించుకుని నాలుగు గొడల మధ్య ఆగిపోకు కాశీ. ప్రాక్టికల్ గా బతుకు. చేసే పనిలో ఆలోచన వెతుక్కోమని కార్తీక్ చెప్తుండగా స్వప్న వస్తుంది. ఎందుకో ఇప్పుడు ఊరికే కోపాలు వస్తున్నాయని స్వప్న అంటుంది. అర్థం చేసుకునే భార్య ఉంటే అన్నీ బాగుంటాయి, అర్థం చేసుకుని బతకండని కార్తీక్ చెప్తాడు.
వీఐపీలా దీప
మీ అమ్మ నిజంగానే చనిపోయిందనుకున్నావు కదా అని జ్యోత్స్నను పారిజాతం అడుగుతుంది. మనం అనుకోవడం వంద అనుకుంటాం కానీ చావు అంత తేలిగ్గా రాదు గ్రానీ. రాసిపెట్టుంటే కాలు పోయినా చేయి పోయినా బతుకుతాం. రాత పూర్తయిపోతే నవ్వుతూనే పోతామని జ్యో అంటుంది. దీప ఎవరో తెలిసేలోపు వాళ్ల అమ్మానాన్నకు ఏం కాదని అనుకుంటుంది జ్యో. అప్పుడే కాశీ కార్లో దీపను తీసుకుని వస్తాడు. ఎవరా వీఐపీ అని జ్యో, పారు చూస్తుండగా దీప దిగడంతో షాక్ తింటారు.
జ్యోకు కౌంటర్
పని మనుషులకు కూడా డ్రైవర్లు ఉంటారని ఇప్పుడే అర్థమైంది. ఫుడ్ ట్రక్ బిజినెస్ ఐడియా ఇచ్చావు. దీంతో అల్లుడు కారు ఇచ్చి నా మనవడినే డ్రైవర్ ను చేశాడు. నా ఇంటి పని మనిషి డ్రైవర్ అని పారు అంటుంది. పని మనిషి అంటావేంటీ పేరు పెట్టి పిలవలేవా అని కాశీ అడుగుతాడు. మాకు పని మనిషే. అయినా నిన్ను దింపడానికి వీడు రావడం ఏంటీ? అని పారు అడుగుతుంది. మేం అత్తయ్య ఇంటికి వెళ్లామని దీప అంటే.. ఏ అత్తయ్య చిన్నత్త, పెద్దత్త అని జ్యో వెటకారంగా అడుగుతుంది.
అడ్డమైన వాళ్లు అడ్డదిడ్డంగా ఏదో వాగుతుంటారు మనం చెవిటి వాళ్లలా వెళ్లిపోవాలి అంతే కానీ గొడవ పెట్టుకోవద్దని బావ చెప్పాడు. అరిచేవాళ్ల మీద అరిస్తా మొరిగేవాళ్ల మీద కాదు అని దీప అనగానే కాశీ విజిల్ కొడతాడు. కార్తీక్ స్కూటీ నడుపుతుంటే వెనకాల కూర్చుని శ్రీధర్ హ్యాపీగా ఫీలవుతాడు. జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్ దగ్గర జనాలు ఉన్న వీడియోను కార్తీక్ కు చూపిస్తాడు శ్రీధర్. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


