కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీప బిజినెస్ ప్లాన్-కార్తీక్ భార్యోత్సాహం-దీప రెండో భర్త బావ అని జ్యో నీచమైన మాటలు
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 10 ఎపిసోడ్ లో శ్రీధర్ పీఏగా కాశీని చూసి పారు, జ్యోత్స్న షాక్ అవుతారు. ఫుడ్ ట్రక్ బిజినెస్ సక్సెస్ కోసం దీప చెప్పిన ప్లాన్ అందరికీ నచ్చుతుంది. కార్తీక్ భార్యోత్సాహం అంటూ పొంగిపోతాడు. కానీ దీప మొదటి భర్త గురించి చెప్తూ జ్యో నీచమైన మాటలు అంటుంది.
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 10వ తేదీ ఎపిసోడ్ లో శ్రీధర్ కు పారిజాతం కాఫీ ఇస్తుంది. మీరు కాఫీ తీసుకురావడం ఏంటీ అత్తయ్య అని అడుగుతాడు శ్రీధర్. ఒక్క రోజు సీఎంలాగా ఒక్క రోజు పని మనిషి పోస్ట్. దీప పోస్ట్ పారుకు అని కార్తీక్ చెప్తాడు. ప్రజెంటేషన్ కోసం అందరినీ పిలుస్తాడు శివ నారాయణ. కాశీకి ఫోన్ చేసి ల్యాప్ టాప్ తీసుకు రమ్మని చెప్తాడు శ్రీధర్.

కాశీ ఇప్పుడు పీఏ
కాశీ ల్యాప్ టాప్ తీసుకుని వస్తాడు. సర్ ఈ ల్యాప్ టాప్ అక్కడ పెట్టమంటారా? అని కాశీ అడగ్గానే.. సర్ ఏంట్రా మామయ్య కాదా అని పారిజాతం అడుగుతుంది. ఇప్పుడు నేను మామయ్య కాదు కాశీ అల్లుడు కాదు. కాశీ నాకు ఇప్పుడు పీఏ అని శ్రీధర్ షాక్ ఇస్తాడు. ఎప్పుడు అపాయింట్ చేశారు? ఎవరిని అడిగారు? అని జ్యోత్స్న అడుగుతుంది. కంపెనీ రూల్స్ ప్రకారం సీఈఓ ఎవరైనా పీఏను అపాయింట్ చేసుకోవచ్చని కార్తీక్ చెప్తాడు. కానీ ముందు చెప్పాలి కదా అని జ్యో అంటే, నాకు నిన్ననే ఫోన్లో శ్రీధర్ చెప్పాడని శివ నారాయణ కౌంటర్ ఇస్తాడు.
పెద్ద ప్లానే
ఒక్క కాశీనేనా మిగతా వాళ్లను కూడా వేరే వేరే పోస్ట్ ల్లో పెట్టారా? అని జ్యోత్స్న వెటకారంగా అడుగుతుంది. కాశీని పీఏ పోస్ట్ లో పెడితే బిజినెస్ నేర్చుకుంటాడని మామయ్యే చెప్పాడని శ్రీధర్ వెల్లడిస్తాడు. పెద్ద ప్లానే వేశారు గ్రానీ. తాత పేరు చెప్తున్నారు కానీ దీని అంతటికి కారణమైనా మనిషి వేరే ఉంటారని జ్యో అంటుంది. ఈ మాయలోడే మహాభారతాన్ని నడిపించేదని కార్తీక్ గురించి డైరెక్ట్ గా అంటుంది పారు. దీనిపై దీప ఒకటంటే జ్యో మరొకటి అంటుంది. సుమిత్ర మాట్లాడితే అందరినీ సైలెంట్ గా ఉండమంటాడు దశరథ.
వర్కౌట్ కాదు
ఫుడ్ ట్రక్ బిజినెస్ గురించి ప్రజంటేషన్ ఇస్తాడు శ్రీధర్. ఫస్ట్ 10 ట్రక్కుల్లో స్టార్ట్ చేసి బిజినెస్ చూసి పెంచుకుంటూ వెళ్తామని శ్రీధర్ చెప్పగానే అందరూ క్లాప్స్ కొడతారు. వర్కౌట్ అవుతుంది బావ అని దశరథ అంటే, అస్సలు వర్కౌట్ కాదు డాడీ అని జ్యో అంటుంది. మీరు చెప్పిన ప్లేస్ ల్లో చాలా ఫుడ్ ట్రక్కులు ఉన్నాయి. అవి దాటి మన దగ్గర కొంటారా? ఫుడ్ వేస్ట్ అవుతే? అని జ్యో అడుగుతుంది.
దీప ప్లాన్
రాత్రికి రాత్రి మన ఫుడ్ ట్రక్కుల దగ్గర ఎగబడి తినరు. ముందు మన అదే జ్యోత్స్న రెస్టారెంట్స్ కంపెనీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మన కోసం మంచి ఆరోగ్యకరమైన టిఫిన్లు అందజేస్తున్నారని వాళ్లకు తెలిసేలా చేయాలి. సోషల్ మీడియాలో వీడియోలు పెట్టాలి. పేదవాళ్లకు టిఫిన్లు ఫ్రీగా పంచిపెట్టి వీడియోలు సోషల్ మీడియాలో పెడదాం. పుణ్యం, పేరు రెండూ వస్తాయి. ఆర్డర్లు వస్తాయి. ఆ తర్వాత కూడా ఫ్రీ సర్వీస్ ఆపకుండా కొన్ని టిఫిన్లు పేదవాళ్లకు ఉంచుదాం. అప్పటివరకూ ప్రచారం కోసం అనుకున్నవాళ్లు కూడా పేదవాళ్ల కోసం జ్యోత్స్న రెస్టారెంట్ నిలబడుతుందని నమ్ముతారని దీప చెప్పగానే అందరూ క్లాప్స్ కొడతారు.
కన్నవాళ్లు ఎవరో?
ఎప్పుడూ అనాథలు, ఆకలి గురించి ఆలోచిస్తావు దీప. నీ కన్నవాళ్లు ఎవరో కానీ చాలా గొప్పవాళ్లు అని శివనారాయణ అంటాడు. ఇంకెవరూ నీ కొడుకు, కోడలే అని జ్యో అనుకుంటుంది. మన ఇంట్లో, మన ఆఫీస్ లో దీపకు బలం పెరుగుతుంది గ్రానీ. ఫుడ్ ట్రక్ బిజినెస్ ను ఆపాలని జ్యో అంటుంది. ఆ బిజినెస్ ఈ రోజే స్టార్ట్ అవుతుంది. ఇక పాతాళానికి జారిపోతావు. ఇప్పటికైనా మేలుకో అని పారు హితబోధ చేస్తుంది పారు. ఊరుకుంటే కావేరి, స్వప్న కూడా ఇంట్లోకి, బిజినెస్ లోకి ఎంటర్ అవుతే మన పని అయిపోయినట్లేనని జ్యో చెప్తుంది.
కార్తీక్ భార్యోత్సాహం
దీప కన్నవాళ్లు నీకు తెలుసా? అని జ్యోను అడుగుతుంది పారు. నాకేం తెలుసు. దీపను తాత పొగుడుతుంటే నా కళ్లలో బాధ చూడలేదా గ్రానీ. ఈ సారి మనం కొడితే అది అందరికీ చాలా కాలం పాటు గుర్తుండిపోవాలని దీప అంటుంది. దీప, కార్తీక్ అందరికీ గులాబ్ జామ్ లు రెడీ చేస్తారు. ఏంటీ విశేషం అని అడిగితే పుత్రోత్సాహం పద్యం తెలుసా అని కార్తీక్ అడిగితే, పారు ఆ పద్యం వినిపిస్తుంది. పుత్రోత్సాహం ఉన్నట్లే భార్యోత్సాహం కూడా ఉంది. ఇది కార్తీక శతకంలో ఉంది. భార్యోత్సాహం గురించి పద్యం చెప్తాడు కార్తీక్.
పారిజాతం, జ్యోత్స్నకు ఈ ఆలోచన వచ్చిందా? కానీ అయిదో తరగతి మధ్యలోనే ఆపేసిన దీపకు వచ్చింది. ఈ రోజు అది నిజమవుతోంది. మార్కెట్లోకి ఫుడ్ ట్రక్కులు వెళ్లాయి. కొద్ది రోజుల్లోనే సక్సెస్ వస్తుంది. దీనికి కారణమైన నా శ్రీమతి దీపకు దిష్టి తగులుతుంది. భర్తగా నాకూ దిష్టి తగులుతుందనుకో అని కార్తీక్ అంటాడు.
దీప మొదటి భర్త
అదే జనం దీప మొదటి భర్తను కూడా గుర్తు చేసుకుంటారు. పాపం ఎందుకో దీప మొదటి భర్తను జైలుపాలు చేసింది. నచ్చినవాడు కంటికి కనిపించినప్పుడు మరొకడిని వదిలేస్తారని దీప అంటుంది. శివనారాయణ, దశరథ, సుమిత్ర కలిసి జ్యోత్స్నపై మండిపడతారు.
నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? బావ దీపకు రెండో భర్త కాదా? సంసారం చేతగాక మొదటి భర్తను వదిలేసింది. ఈవిడ విడాకులు తీసుకుంది భర్త నచ్చకో తెలియదు, బావ నచ్చో తెలియదు. గాలికి ఎగిరిపోయే ఎంగిలి ఆకు లాంటి ఈమె జీవితానికి బావ అవసరమా? అని జ్యో తప్పుడుగానే మాట్లాడుతుంది. సుమిత్ర కొట్టేందుకు వెళ్తే కార్తీక్ ఆపుతాడు. నేనే మాట్లాడతానని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.














