కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: చావుదెబ్బ కొట్టిన శౌర్య-దీప పోస్టులో పారు-శివనారాయణ పనిష్మెంట్-కార్తీక్ మార్కులు
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 9 ఎపిసోడ్ మొత్తం పారిజాతం, కార్తీక్ కామెడీ చుట్టూ సాగుతుంది. పారు చెప్పిన మాటలను శివనారాయణకు చెప్పి చావుదెబ్బ కొడుతుంది శౌర్య. దీంతో దీప పోస్ట్ ను పారుకు ఇచ్చి పనులు చేయమంటాడు శివనారాయణ.
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 9 ఎపిసోడ్ లో పెళ్లికి ఒప్పుకున్నావ్ కదా షాపింగ్ కు ఎప్పుడు వెళ్దామని జ్యోత్స్నను పారిజాతం అడుగుతుంది. డాడీ అడిగారని ఒప్పుకున్నా, ఏదీ జరిగే వరకూ నిజం కాదు గ్రానీ అని జ్యో షాక్ ఇస్తుంది. నేను చాలా ఆశలు పెట్టుకున్నానని జ్యో అంటే, నీ ఆశలను నిజం చేసే దారి నేను వేశానని కాంచన, శౌర్య మనసుల్లో విషం నింపిన సంగతి చెప్తుంది పారు.

పారు సంబరం
ఇప్పుడు కార్తీక్ గాడికి కొత్త తలనొప్పులు స్టార్ట్ అవుతాయి చూడు అని పారు అనగానే శౌర్యను తీసుకుని కార్తీక్, దీప వస్తారు. శౌర్య రాగానే నాకు నువ్వు వద్దు అని శివనారాయణను పట్టించుకోకుండా హాయ్ జోగు రాణి అని పారిజాతాన్ని కౌగిలించుకుంటుంది. దీంతో శివనారాయణ, జ్యో ఆశ్చర్యంతో చూస్తారు. శౌర్య ప్లాన్ స్టార్ట్ చేసిందని కార్తీక్ చూస్తాడు. చిన్నపిల్లలు వాళ్ల మనసుకు నచ్చినవాళ్ల దగ్గరకే వస్తారని పారు అంటుంది. నీకోసమే వచ్చానని శౌర్య చెప్తుంది.
శౌర్య నిజం
నువ్వు చాలా మంచిదానివి అని శౌర్య అనగానే బాల వాక్కు బ్రహ్మ వాక్కు అని మురిసిపోతుంది పారు. పారు ఏం చేసిందని శివనారాయణ అడిగితే శౌర్య అంతా చెప్పేస్తుంది. మధ్యలో జ్యోత్స్న ఆపాలని చూసినా పారు ఆపనివ్వదు. ఇక పారు ప్లాన్ ఫెయిల్ అయ్యేలా శివనారాయణకు శౌర్య అంతా చెప్పేస్తుంది. అమ్మ కడుపులో బేబీపై ప్రేమతో నాన్న నన్ను సరిగ్గా చూడడంటా. పక్కన పడుకోనివ్వడంటా. మా అమ్మకు నాపైన ప్రేమ తగ్గిపోతుందంటా అని పారు చెప్పిన విషయాలన్నీ శివనారాయణకు చెప్పడంతో పారు షాక్ అవుతుంది.
పారుకు పనిష్మెంట్
శౌర్యను గదిలోకి పంపించి శివనారాయణ ఫైర్ అవుతాడు. కార్తీక్ చిన్నపిల్లలు తెల్లని కాగితం లాంటి వాళ్లు. మనం చెప్పిన మంచి మాటలే వాళ్ల తెల్లని మనసు మీద అందమైన అక్షరాలు అవుతాయి. అలాంటి మంచి మాటలు చెప్పాల్సింది పోయి చెడగొట్టాల్సిన మాటలు చెప్పేవాళ్లను ఏం చేయాలి? పోని నువ్వు చెప్పు దీప. నువ్వు ఏ శిక్ష వేయమంటే పారిజాతానికి ఆ శిక్ష వేస్తా. పారిజాతం నీ కూతురు జోలికి రాకుండా ఉండాలంటే ఏం చేయమంటావని దీపను అడుగుతాడు శివనారాయణ.
కార్తీక్ మార్కులు
గుర్తుండిపోయేలా ఏదైనా చేయమని దీప చెప్తుంది. అయితే ఈ రోజు దీప దీప కాదు. నువ్వు మా గెస్ట్. నువ్వు ఈ రోజు ఏ పనులూ చేయొద్దు. అవన్నీ చేయడానికి ఎక్స్ పీరియన్స్ పర్సన్ ఇంట్లోనే ఉన్నారు. అది పారిజాతం. ఈ రోజు దీప పనులన్నీ నువ్వే చేయాలని పారిజాతానికి శిక్ష వేస్తాడు శివనారాయణ. సరే ఈ ఒక్క రోజు దీప పనులు చేస్తానని పారు ఒప్పుకొంటుంది. కార్తీక్ నీకు సూపర్ వైజర్, వాడు 10కి 10 మార్కులు ఇస్తేనే ఈ రోజు నీ పనిష్మెంట్ పూర్తి అవుతుంది. లేదంటే రేపు కూడా కంటిన్యూ అవుతుందని శివనారాయణ షాక్ ఇస్తాడు.
సాంబారుతో చంపేయొచ్చు
మరోవైపు శ్రీధర్, కాశీ కలిసి కార్లో వెళ్తారు. అప్పుడే స్వప్న ఫోన్ చేసి గుడికి వెళ్దామని సాయంత్రం ఒక గంట ముందు రావాలని అడుగుతుంది. కాశీ అడిగితే శ్రీధర్ ఒప్పుకోడు. ఒక గంట కూడా ముందు పంపించనని అంటాడు. ఇక కిచెన్ లో వంట చేస్తూ నానా కష్టాలు పడుతుంది పారిజాతం. సాంబారు రుచి చూడమంటుంది. మన శత్రువును చంపాలంటే విషం పెట్టాల్సిన అవసరం లేదు ఈ సాంబారు పెడితే చాలు అని కార్తీక్ చెప్పి రెండు మార్కులు తీసేస్తానంటాడు. పారును ఆడుకుంటాడు కార్తీక్.
దీపకు సేవలు
డ్యూటీ టైమ్ అయితేనే పంపిస్తారంటా. ముందు పర్మిషన్ ఇవ్వరంటా అని కావేరిపై అరుస్తుంది స్వప్న. మీరు మీరు గొడవ పడండి నాకు సంబంధం లేదని కావేరి వంట చేయడానికి వెళ్లిపోతుంది. ఇన్నాళ్లు ఎందుకు తేడా ఉన్నానో అనుకున్నా కానీ తేడా నాలో లేదు జీన్స్ లో ఉందని స్వప్న అసహనం వ్యక్తం చేస్తుంది. మరోవైపు దీపకు ఆపిల్ తినిపిస్తే 5 మార్కులు వేస్తానని కార్తీక్ అంటే.. పారు ప్రేమ నటిస్తూ దీపకు తినిపిస్తుంది. పాట పాడుతూ తినిపించమని కార్తీక్ చెప్తాడు. దీపమ్మా అంటూ సాంగ్ అందుకుంటుంది పారు.
ఇంతలో శ్రీధర్ వస్తాడు. బావ మన ప్లాన్ రెడీ. ఛైర్మన్ చూడాలని శ్రీధర్ అంటాడు. పారిజాతాన్ని కాఫీ తీసుకెళ్లి ఇవ్వమంటాడు కార్తీక్. రెండు మార్కులు అనేసరికి నేనే కాఫీ పెడతానని గంతులు వేస్తుంది పారు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.














