కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:బిడ్డ జోలికి వస్తే పిడుగులా పడతానని జ్యోత్స్నకు దీప వార్నింగ్-జ్యో ట్రాప్‌లో కాశీ-మాటలతో మాయ

కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 17 ఎపిసోడ్ లో జ్యోకు దీప వార్నింగ్ ఇస్తుంది. తన తప్పులు బయటకు రాకుండా ఉండటానికి కాశీని ట్రాప్ లో పడేస్తుంది జ్యోత్స్న. జాబ్ ఇస్తానని ఆశపెడుతుంది. మరోవైపు జ్యోకు మంచి సంబంధం కోసం సుమిత్ర దిగులు పెట్టుకుంటుంది.

Published on: Dec 17, 2025, 06:56:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 17 ఎపిసోడ్ లో తన కడుపులో బిడ్డకు ఏమన్నా జరిగితే బాగుండదు అంటూ జ్యోత్స్నకు దీప వార్నింగ్ ఇస్తుంది. ఈ బిడ్డ క్షేమం నా బాధ్యత అని అత్తయ్యకు మాట ఇచ్చా. ఈ బిడ్డ ప్రపంచాన్ని చూస్తుందని నా భర్తకు చెప్పా. ఈ మాటలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎవరైనా అడ్డుపడితే పిడుగులా పడతానని దీప చెప్తుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

కాశీతో మంతనాలు

ఇప్పుడు ప్రమాదం నాకు వచ్చింది. కాశీ దాసు సొంత కొడుకేనా? అని పారిజాతాన్ని జ్యోత్స్న అడుగుతుంది. కాశీని మన దారిలోకి తెచ్చుకుంటే ప్రాబ్లెం సాల్వ్ చేసుకోవచ్చని జ్యో ప్లాన్ వేస్తుంది. కాశీ రాగానే ప్రేమగా మాట్లాడుతూ ఫ్రూట్స్ తినమంటుంది జ్యోత్స్న. నువ్వు ఎందుకు పిలిచావో? ఎందుకు తినమంటున్నావో నాకు తెలియదా? అకౌంట్స్ అన్నీ మామయ్య దగ్గరే ఉన్నాయి. నేను ఏ హెల్ప్ చేయలేను అని కాశీ అంటాడు.

మాటలతో ట్రాప్

నేను ఏ తప్పు చేయలేదు. సీఈఓగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నా. కంపెనీ కోసం ఫండ్స్ వేరే వాళ్ల దగ్గరకు పంపించా. నేను పిలిచింది నీ గురించి మాట్లాడటానికే తమ్ముడు. నీ జాబ్ ఎందుకు పోయింది? రెజ్యూమ్ నాకు పంపించమని జ్యో అడుగుతుంది. అది చూసి, ఇంత మెరిట్ పెట్టుకుని నీకు జాబ్ రాకపోవడం ఏంటీ? శ్రీధర్ మామయ్య నిన్ను వదిలేసి ఉంటే నంబర్ వన్ జాబ్ వచ్చేది. కానీ పీఏగా పెట్టుకున్నాడు. నేనైతే జీఎం పోస్ట్ ఇచ్చేదాన్ని. మామయ్య సీఈఓ అయి ఉండి కూడా మంచి పోస్ట్ ఇవ్వలేకపోయాడని రెచ్చగొడుతుంది జ్యో.

ఉద్యోగం ఇప్పిస్తానని

వేరే చోట అయినా నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తా. స్వప్న గురించి మా బావ ఆలోచించినట్లుగా నీ గురించి ఆలోచించడు. ఆలోచించేవాడైతే అర్హత లేని వాళ్లకు సీఈఓ పోస్టు, నీకు పీఏ పోస్టు ఇప్పించడం ఏంటీ. మీ బావ చెప్పకుండా శ్రీధర్ మామయ్య ఏం చేయడు తమ్ముడు. నిన్ను మామయ్య ఇలా ట్రీట్ చేయడం నాకు నచ్చట్లేదు. నిన్ను తన కారుకు పర్మినెంట్ డ్రైవర్ చేసేలా ఉన్నాడు. స్వప్న కూడా తండ్రికే సపోర్ట్ చేస్తుంది. వేరే జాబ్ ఇప్పిస్తానని జ్యోత్స్న చెప్తుంది. ఛాన్స్ వస్తే వెళ్తానని కాశీ అంటాడు.

కాశీ బయటకు వచ్చేటప్పుడు దీప చూసి ఏదో జరుగుతుందని అనుకుంటుంది. వాడు నా సొంత తమ్ముడు, వాడిని కలుపుకోవాలనుకుంటున్నానని పారుతో జ్యోత్స్న అంటుంది. పారు ఈ మాటలకు పొంగిపోతుంది. అందరినీ నా అవసరాలకు వాడుకుంటానని జ్యో అనుకుంటుంది.

సుమిత్రపై కోపం

సుమిత్ర జ్యూస్ తాగడం లేదని గ్లాస్ పట్టుకున్న దశరథ కోప్పడతాడు. ఆఖరి సారిగా అడుగుతున్నా తాగుతావా లేదా అని దశరథ అంటాడు. సగం తాగి ఇవ్వమంటుంది సుమిత్ర. ఇందులో ప్రోటీన్ పౌడర్ కలిపానని దశరథ అంటాడు. తాగుతావా లేదా డాక్టర్ ను పిలవమంటావా? అని దశరథ అంటే, నేను ఉపవాసాలు ఉండి నీరసంగా ఉన్నానంతే అని సుమిత్ర చెప్తుంది. కాఫీ తీసుకొచ్చిన దీపను పిలుస్తారు. సుమిత్రకు నో కాఫీ, టీ అని దశరథ అంటాడు. మార్నింగ్ ఎంత లేపినా లేవలేదని దశరథ అంటే దీప కంగారు పడుతుంది.

మంచి సంబంధం కోసం

ఎందుకో జ్యోత్స్న మీద దిగులుగా ఉంది. పెళ్లి చేసి వదిలేసుకుందామా? బిడ్డను ఊయలలో వేసినప్పుడే ఓ తల్లికి ఇన్ని ఆశలు ఉంటే, పల్లకీలో ఊరేగించేటప్పుడు ఇంకా ఎన్ని ఆశలుంటాయి? ఏవండీ, ఆలస్యమైనా పర్వాలేదు మంచి సంబంధం చూడండని జ్యూస్ తాగుతుంది సుమిత్ర. మీరు ఇద్దరు ఇలా నవ్వుతూ ఉండండి చాలు అని సుమిత్ర, దశరథను చూసి దీప అనుకుంటుంది.

ఈగో టచ్ చేయాలని

తమ్ముడిని ప్రేమగా చూసుకుని ఉంటే వాలి, సుగ్రీవులు కలిసే ఉండేవారని పారుకు కథ చెప్తుంది జ్యోత్స్న. ధర్మాన్ని దాటి యుద్ధాన్ని చేసేది ఈగో ఒక్కటే. కాశీ మన దారిలోకి రావాలంటే వాడి ఈగోను టచ్ చేయాలని జ్యో చెప్తుంది. అప్పుడే కార్తీక్, శ్రీధర్ వస్తారు. పారు, జ్యోకు హాయ్ చెప్తాడు శ్రీధర్. జ్యోకు నిజం తెలియకూడదని శ్రీధర్ తో కార్తీక్ అంటాడు. కాశీనే కారు డ్రైవ్ చేయమంటాడు శ్రీధర్. జ్యోత్స్న అక్క చెప్పింది నిజమే, చివరకు కారు డ్రైవర్ ను చేశాడని కాశీ అనుకుంటాడు.

ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ఇంతకంటే వేరే దారి లేదు. శత్రువును నేరుగా గెలవనప్పుడు యుద్ధం మనవరకు రాకముందే నాశనం చేయాలి. ఇప్పుడు నేను చేయబోయేది అదే గ్రానీ అని జ్యో చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More