కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న మెడకు ఉచ్చు-దొంగ లెక్కలు బయటకు-శివ నారాయణ మనవరాలు కాదన్న శ్రీధర్
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 16 ఎపిసోడ్ అంతా జ్యోత్స్న దొంగ లెక్కల విషయం చుట్టూ తిరుగుతుంది. జ్యోత్స్న శివ నారాయణ మనవరాలు కాదేమోనని కార్తీక్ తో శ్రీధర్ అంటాడు. మామయ్య జ్యోత్స్న దొంగ లెక్కలు తీస్తున్నాడని కాశీ చెప్తాడు. జ్యోకు చెమటలు పడతాయి.
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 16 ఎపిసోడ్ లో కార్తీక్, శ్రీధర్ కలిసి రోడ్డు పక్కన టీ తాగుతూ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తారు. ఈ విషయం త్వరగా అమ్మకు చెప్పాలని కార్తీక్ అంటే, ఇప్పుడే వద్దంటాడు శ్రీధర్. ఇంకా కొన్ని చోట్లా పికప్ కావాల్సి ఉందంటాడు. సక్సెస్ కు, మనకు 30 కిలోమీటర్ల దూరంలో ఉందంటూ ఓ స్టోరీ చెప్తాడు కార్తీక్.

శివనారాయణ మనవరాలు కాదు
కంపెనీకి నష్టాలు సరిగ్గా బిజినెస్ చేయకపోవడం వల్ల రాలేదు, వచ్చిన లాభాలు లెక్కల్లో చూపించకపోవడం వల్ల వచ్చాయి. జ్యోత్స్న చేసిన అరాచకాలు. లెక్క బయటకు చెప్తే శివ నారాయణ గుండె పట్టుకుని పడిపోయేంత. జ్యోత్స్న శివ నారాయణ మనవరాలు కాదు అని శ్రీధర్ చెప్పగానే కార్తీక్ షాక్ అవుతాడు.
కాశీని రెచ్చగొట్టాలని
కారు దగ్గర వెయిట్ చేస్తున్న కాశీని చూస్తూ నీ మనవడి తలరాత నువ్వు తప్పించొచ్చు కదా అని పారిజాతాన్ని రెచ్చగొడుతుంది జ్యోత్స్న. చీర కొంగు ముడి విప్పి డబ్బులు తీస్తుంది పారు. ఒరేయ్ డ్రైవరూ, ఈ రూ.50 తీసుకుని బయటకు వెళ్లి టీ తాగి రా అని పారు అంటుంది. నేను డ్రైవర్ ను కాదు జ్యోత్స్న రెస్టారెంట్స్ సీఈఓకు పీఏను అని కాశీ చెప్తాడు. దీపక్క, కార్తీక్ బావను అత్తయ్య ఇంటికి టిఫిన్ కు పిలిచారు. దీపక్కను డ్రాప్ చేయమన్నారు అని చెప్తాడు కాశీ.
దరిద్రం కాకపోతే
నువ్వు పీఏ అయితే ఆఫీస్ పని చేయాలి. డ్రైవర్ పని కాదు. నువ్వు కారు దగ్గర ఇలా వెయిట్ చేస్తున్నావు. పారిజాతం మనవడికి పర్సనల్ అసిస్టెంట్ గా చేయాల్సిన పని ఏంట్రా? జాబ్ లేకపోతే ఖాళీగా ఉండు. డబ్బు లేకపోతే నన్ను అడుగు. మామగారి దగ్గర పీఏగా పని చేయడం ఏంట్రా? దరిద్రం కాకపోతే. దీన్ని ఊడిగం అంటారు. అల్లుడు అంటే మామగారి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చునేలా ఉండాలని పారు అంటుంది. నా బతుకేదో నేను బతుకుతున్నా వదిలేయ్ అని కాశీ అంటాడు.
కాశీని రెచ్చగొట్టేలా తిడుతుంది పారిజాతం. మీ మామగారికి బుద్ధి లేదు. ఉండి ఉంటే కొడుకును డ్రైవర్ గా వదిలేసేవాడు కాదు. ఇప్పుడు అల్లుడిని డ్రైవర్ చేశాడని పారు అంటుంది. నాకు నచ్చే జాబ్ చేస్తున్నానని కాశీ అంటే, వేరే దారి లేక చేస్తున్నానని అనాలని జ్యోత్స్న మధ్యలోకి వస్తుంది. జాబ్ లేకున్నా ఉన్నట్లు స్వప్నకు అబద్ధం చెప్పావని జ్యో అంటుంది.
జ్యోత్స్న దొంగ లెక్కలు
నువ్వు ఎంతసేపు ఎదుటి వాళ్ల తప్పుల గురించి మాట్లాడతావు. కానీ దొంగ లెక్కలు రాసి డబ్బు మాయం చేసింది. రూ.2 కోట్ల 34 లక్షల స్కామ్ జస్ట్ శాంపిల్. అంతకంటే భారీ స్కామే చేసింది. ఆ లెక్కలన్నీ మా మామయ్య లెక్కకడుతున్నారు. రెండు రోజుల్లో లెక్క పూర్తవుతుంది. మా మామయ్య నిన్ను బోర్డు మెంబర్స్ ముందు లేదా ఫ్యామిలీ మెంబర్స్ ముందు నిలబెడతారు. అకౌంట్లో దొంగ లెక్కలు చూపించిన నిన్ను ఏమనాలి? అని కాశీ అనగానే జ్యోత్స్నకు చెమటలు పడతాయి.
తప్పులు ఎందుకు?
జ్యోత్స్న ఆ ఇంటి బిడ్డ కాదు. శివ నారాయణ ఫ్యామిలీ అంటే జ్యోత్స్న ఫ్యామిలీ కదా. మరి ఆస్తి మొత్తం తనదే అయినప్పుడు కంపెనీని ఎందుకు మోసం చేయాలి. డబ్బు వేరే కంపెనీకి ట్రాన్స్ ఫర్ చేసి నష్టాల్లో ఎందుకు రాయాలి? ఇవన్నీ నా ల్యాప్ టాప్ లో పెట్టా. తను అలాంటి పనులు చేస్తుందంటే జ్యోత్స్న ఆ ఇంటి వారసురాలు కాదని అనుమానం మొదలైంది. నీ ముఖంలో కంగారు చూస్తుంటే అదే నిజమని అనిపిస్తుందని కార్తీక్ తో శ్రీధర్ అంటాడు.
శిక్ష పడాల్సిందే
సొంత లాభం కోసం డబ్బులు వాడుకున్న జ్యోత్స్నకు శిక్ష పడాల్సిందే. సాక్ష్యాధారాలతో సహా జ్యోత్స్న తప్పులను ఫ్యామిలీ ముందు బయటపెట్టు. నిజాలు బయటపెడితే అంతా తాత, అత్త, మామ చూసుకుంటారని కార్తీక్ చెప్తాడు. నిజం చెప్పేస్తానని శ్రీధర్ అంటాడు. నన్ను మాస్టారూ అని పిలవడం మానేయ్ శ్రీధర్ అంటే, మా అమ్మ నిన్ను భర్తలా చూసినప్పుడు అలా పిలవడం మానేస్తానని కార్తీక్ చెప్తాడు. ఏదో ఒక రోజు అమ్మ కూడా మనతో ఉంటుందని కార్తీక్ అంటాడు.
దీపను చూసి షాక్
సర్వనాశనం అయిపోయింది. లెక్కలన్నీ తాత ముందు పెడితే పరిస్థితి ఏంటీ? నువ్వు ఇక్కడ ఉండొద్దు. కార్తీక్ ముందే హింట్ ఇచ్చాడు. నిన్ను పోలీసులు పట్టుకుపోతారు. ముందు నువ్వు ఎన్ని కోట్లు కొట్టేశావో చెప్పు అని జ్యోపై సీరియస్ అవుతుంది పారు. మామయ్య పాత అకౌంట్స్ జోలికి వెళ్లడనుకున్నా అని జ్యో కంగారు పడుతుంది. అప్పుడే కాఫీతో వచ్చిన దీపను చూసి షాక్ అవుతారు పారు, జ్యో.
ఎందుకు కంగారు? దేనికి భయం? మీ ఇద్దరి ముఖాల్లో భయం కనపడుతుంది. దేని గురించో తెలుసుకోవచ్చా? అని దీప అడుగుతుంది. నీ కడుపులో బిడ్డ గురించి అని పారు కవర్ చేయాలని చూస్తుంది. పాపం చేస్తేనే తగులుతుందా? పాపం చేశారా? చేయబోతున్నారా? అని దీప అడుగుతుంది. నా బిడ్డ జోలికి వస్తే ఏం చేస్తానో తెలుసుకదా అని దీన అనడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.














