కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: తండ్రిని ఇరికించిన వాళ్లను కనిపెట్టిన కాార్తీక్-వణికిపోతున్న కాశీ, జ్యో-పోలీసులకు సమాచారం
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 27 ఎపిసోడ్ లో కాశీకి తప్పులో భాగం ఉందని కార్తీక్ డౌట్ పడతాడు. ఫుడ్ కల్తీ చేయించింది జ్యోత్స్న అని, మధ్యలో మూడో వ్యక్తి ఉన్నారని అనుమానపడతారు. మరోవైపు ఇదంతా తానే చేయించానని పారుకు చెప్తుంది జ్యో. దోషి ఎవరో తెలిసిందని కార్తీక్ చెప్పడంతో జ్యోకు ముచ్చెమటలు పడతాయి.
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 27 ఎపిసోడ్ లో కాశీ అకౌంట్లోకి రూ.5 లక్షలు వచ్చిన విషయాన్ని కార్తీక్, దీపకు చెప్తుంది స్వప్న. నాన్న అరెస్టుకు కాశీకి ఏదో సంబంధం ఉంది. ఇది జరగడానికి కారణం ఎవరో కాశీకి తెలుసని నా నమ్మకం. అతనిలోని మార్పునకు, ఈ కేసుకు ఏదో సంబంధం ఉంది అన్నయ్య అని స్వప్న అంటుంది.

ఏదో లింక్
ముందు ఇంటికి వెళ్దాం పదా అని స్వప్నను తీసుకుని వెళ్తాడు కార్తీక్. స్వప్న చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ రోజు జ్యోత్స్నను కాశీ కలవడం, ఈ ఉద్యోగం, డబ్బుకు ఏదో లింక్ ఉందని దీప అనుకుంటుంది. స్వప్నను తీసుకుని ఇంటికి వస్తాడు కార్తీక్. అప్పుడే కాశీ వచ్చి ఎక్కడికి వెళ్లావ్ స్వప్న అని అడుగుతుంది. నీ గురించి చెప్పడానికే వచ్చింది. నీకు జాబ్ వచ్చిందంట కదా అని కార్తీక్ అంటాడు.
నాన్న వస్తాడు
జాబ్ ఏ కంపెనీలో వచ్చిందో తెలుసుకోవచ్చా అని కార్తీక్ అడిగితే, జాయిన్ అయిన తర్వాత చెప్తానని కాశీ అంటాడు. ఈ జాబ్ విషయం మీ మామయ్యకు తెలుసా? అని కార్తీక్ అడుగుతాడు. నువ్వు జాబ్ కు వెళ్లేటప్పుడు నీకు సెండాఫ్ ఇవ్వడానికి నాన్న వస్తాడు. ఫుడ్ కల్తీ కేసులో నాన్నను ఎవరు ఇరికించారో నాకు తెలిసిందని కార్తీక్ అంటాడు. అప్పుడే కావేరి వచ్చి ఎవరు? అని అడుగుతుంది.
తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడుతుంది చిన్నమ్మ. నాన్నకు కాదు. అసలైన నేరస్థులు ఎవరో దొరికారు. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. కాశీ నువ్వు జాగ్రత్త అని కార్తీక్ చెప్తాడు. తప్పు చేసింది ఎవరైనా వదిలిపెట్టొద్దు అన్నయ్య అని స్వప్న అంటుంది. ఎలా వదిలిపెడతా, మన నాన్నకు అవమానం జరిగిందని కార్తీక్ అంటాడు. తప్పులో కాశీకి భాగం ఉందని కార్తీక్ అనుకుని, ఇంటికి వెళ్లిపోతాడు.
జ్యోత్స్నపై డౌట్
మామయ్యను బయటకు తీసుకురావడానికి ఏదో ఒకటి దారి దొరకాలన్నావు. స్వప్న మాటలు విన్న తర్వాత దారి దొరికిందనిపించిందని దీప అంటుంది. కాశీ కూడా జాబ్ వచ్చిందని చెప్పాడు. మాటల్లో పొగరు ఉంది. మా నాన్న చేసిన దానికి కాశీ హర్ట్ అయ్యాడు. అందుకే మాటలు రికార్డు చేసి వినిపించాడు. ఫుడ్ కల్తీ ఎవరు చేశారు? నాన్నను సీఈఓ పోస్టు నుంచి దించాల్సిన అవసరం ఎవరికి ఉంది? అని కార్తీక్ డౌట్ పడతాడు. జ్యోత్స్న అని దీప వెంటనే చెప్తుంది.
సినిమా చూపిస్తా
ఫుడ్ ను కల్తీ చేసింది ఎవరై ఉంటుందని కార్తీక్ అంటే, జ్యోత్స్న అని దీప చెప్తుంది. మరి కాశీకి జాబ్ ఇచ్చింది ఎవరై ఉంటారు. మధ్యలో ఒకరు ఉన్నారు. కాశీని అడిగితే వాళ్లు జాగ్రత్త పడతారు. మా అమ్మకు మాటిచ్చా దీప. బలమైన సాక్ష్యం లేదు. స్టేషన్లో నాన్న ఏడుస్తూ కనిపించాడు. మా నాన్నను ఈ పరిస్థితుల్లో ఉంచినవాణ్ని జుట్టు పట్టుకుని లాక్కొచ్చి నాన్న కాళ్ల మీద పడేయాలనిపించింది. కానీ నేను కోపం వదిలేశా. ఆలోచించడం మొదలెట్టా. మనకో క్లూ దొరికింది. దాన్ని పట్టుకుని అందరిని బయటకు లాగాలి. వాళ్లకు సినిమా రేపు చూపిస్తానని కార్తీక్ చెప్తాడు.
నేనే చేయించా
శ్రీధర్ అరెస్టుకు నీకు సంబంధం ఉందా? అని జ్యోత్స్నను పారిజాతం అడుగుతుంది. కంపెనీలో నేను చేసిన తప్పులన్నీ బయటపెట్టి, నా ఇంట్లోనే దోషిలా నిలబెట్టాలనుకున్నా మామయ్యను అంత ఈజీగా ఎలా వదిలిపెడతాననుకున్నావు? ఫుడ్ కల్తీ నేనే చేయించా. కాశీతో సాక్ష్యం నేనే చెప్పించా. బెయిల్ రాకపోవడానికి కారణం నేనే. ఇవన్నీ నేనే చేయించానని చెప్పాను కానీ చేశానని చెప్పానా? అని జ్యో షాక్ ఇస్తుంది. ఈ పాపాలన్నీ కాశీతో చేయించావా? నిజాలు బయటపడితే జైలుకు వెళ్లేది కాశీగాడా? ఇప్పుడే వెళ్లి నీ సంగతి అందరికి చెప్తానని పారు అంటుంది.
కాశీ హ్యాపీ
వెళ్లు, అందరిని పోగేసి చెప్పు. నేను కాశీతో ఏం చేయించలేదు. నిజాలు బయటపడినా ఏ కేసు మన మీదకు రాకుండా జాగ్రత్తపడ్డా. కాశీ నా తమ్ముడు. వాడికి ఎంత మంచి లైఫ్ ఇచ్చానో నువ్వే విను అని కాశీకి కాల్ చేస్తుంది జ్యోత్స్న. మంచి జాబ్, మంచి శాలరీ. నువ్వు నా లైఫ్ కు ఓ లిఫ్ట్ ఇచ్చావ్ అని హ్యాపీగా చెప్తాడు కాశీ. లెక్కలు మన కంపెనీలో లేకుండా చేశాను. అకౌంట్స్ అన్నీ వేరే చోట సేఫ్ గా ఉన్నాయని పారుతో జ్యో చెప్తుంది.
కార్తీక్ కౌంటర్
ఉదయం పారు, జ్యోత్స్న మాట్లాడుతుంటే స్టేషన్ దగ్గర పడిగాపులు కాసేందుకు మా నాన్న దొంగతనం, మర్డర్లో చేయలేదు పారు. ఎవరో చేసిన తప్పున నెత్తిమీద వేసుకుని వెళ్లాడని కార్తీక్ అంటాడు. కార్తీక్ ను చూసి పారు, జ్యో షాక్ అవుతారు. ఏ తప్పు చేయని నాన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఏ తప్పు చేయని కొందరు దర్జాగా బయట తిరుగుతున్నారు. తప్పు చేసింది పెద్ద మేడం..అని గ్యాప్ ఇస్తాడు కార్తీక్. పెద్ద మేడం తప్పు చేసి ఉంటారని నీకు అనుమానంగా ఉందా? అని పారును అడుగుతాడు కార్తీక్.
నీ ప్లేస్ లో నేను ఉంటే నా ముఖం ఎవరికీ చూపించకపోయేదాన్ని అని జ్యో అంటుంది. మోసం చేయడం నా రక్తంలో ఉందా? త్వరలోనే ఏ రక్తంలో ఉందో నిరూపిస్తా. పారు రాసిపెట్టుకో మా నాన్నను కోర్టుకు కూడా వెళ్లనివ్వను. ఫుడ్ కల్తీ ఎవరు చేశారో తెలిసింది. కావాలనే చేశారు పారు. అన్నీ తెలిశాయి. పోలీసులకు చెప్పా. చాలా తొందర్లోనే మా నాన్నను కేసులో ఇరికించినవాళ్లకు బుద్ధి చెప్తా. మళ్లీ తప్పు చేయాలంటే భయపడేలా బుద్ధి చెప్తానని కార్తీక్ అంటాడు.
ఊడుస్తూ జ్యోత్స్న గదిలోకి దీప వెళ్తుంది. అది తెలుసుకుని జ్యో పరుగులు పెడుతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


