కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:భ‌ర్త అరెస్టుకు దీప కార‌ణ‌మ‌న్న కాంచ‌న‌-కాశీకి వైరా రూ.5 ల‌క్ష‌లు-కార్తీక్‌, స్వ‌ప్న‌కు డౌట్

కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 26 ఎపిసోడ్ లో శ్రీధర్ ను తన భర్తగా ఒప్పుకోదు కాంచన. రేపటి లోగా ఆయన్ని బయటకు తీసుకురావాలని కార్తీక్ కు చెప్తుంది. శ్రీధర్ అరెస్ట్ కు దీప కారణమంటున్నారని కాంచన చెప్తుంది. కాశీకి బోనస్ గా రూ.5 లక్షలు పంపిస్తాడు వైరా. అది చూసి స్వప్న షాక్ అవుతుంది. కాశీపై డౌట్ వస్తుంది.

Published on: Dec 26, 2025, 06:57:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 26 ఎపిసోడ్ లో మీ ఇద్దరు మామూలుగా మాట్లాడుకుంటే చూడాలని ఉంది. ఆయన అసలే చేయని తప్పును మోస్తున్నాడు. నాన్న ఇంతకంటే భారం మోయలేడు. ఆడది కడుపున మోయని తొలి బిడ్డ భర్త అని చెబుతుంటుంది. అలా అనుకుని క్షమించొచ్చు కదా అమ్మ అని కాంచన, శ్రీధర్ తో అంటాడు కార్తీక్.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

కార్తీక్ మాట ఇవ్వు

నా భార్యగా వచ్చానని ఒక్క మాట చెప్పు కాంచన అని శ్రీధర్ రిక్వెస్ట్ చేస్తాడు. మీరు అన్నది నిజమేనండి. నేను మీ భార్య కావేరి తరపు నుంచే వచ్చాను. తను ఫోన్ చేసి బాధపడింది. ధైర్యం చెప్పా. అదే ధైర్యం మీకు చెప్పడానికి వచ్చా. ఒరేయ్ కార్తీక్ నువ్వు నాకో మాట ఇవ్వు. రేపు ఈ పాటికి మీ నాన్న వాళ్ల ఇంట్లో ఉండాలి. మీ నాన్నను ఈ పరిస్థితిలో ఉంచిన వాళ్లను వదిలిపెట్టొద్దని కాంచన అంటుంది.

స్వప్న ఫైర్

భర్తతో భార్య ఎలా ఉండాలో మా దీపక్కను చూసి నేర్చుకోమని కాశీ అంటే, మా అన్నయ్యను చూసి నేర్చుకో అని స్వప్న అంటుంది. ఎంత కోపం ఉంటే మా నాన్న తప్పు చేశాడని సాక్ష్యం చెప్తావ్. మా అమ్మ, పెద్దమ్మ ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు. నువ్వు చేసిన తప్పు వల్ల ఫ్యామిలీ సఫర్ అవుతుంది. ఫ్యామిలీ ఉన్నవాళ్లకే తెలుస్తుంది ఫ్యామిలీ విలువ. నీ తండ్రి కూడా నీతో ఉండడు. ఒంటరిగా పెరిగావు, అలాగే బతకాలని అనుకుంటున్నావని స్వప్న అంటుంది.

రూ.5 లక్షలు

జ్యోత్స్న దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు, రోడ్ల మీద తిరిగినప్పుడు ఏమైంది సెల్ఫ్ రెస్పెక్ట్. మనల్ని మా నాన్న వదిలేసి ఉంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ తో మన ఇంటి రెంట్ కూడా కట్టలేవు. చేతగాని వాళ్లకే కోపాలు వస్తాయని స్వప్న అంటుంది. మరీ చేతగాని వాడిలాగా చూస్తోంది. నేనేంటో చూపిస్తానని వైరాకు కాల్ చేసి జీఎం పోస్ట్ ఇస్తా అన్నారు కానీ అడుగుతాడు కాశీ. బోనస్ గా ఇప్పుడు రూ.5 లక్షలు, జాయినింగ్ డే రోజు రూ.5 లక్షలు ఇస్తానని వైరా చెప్తాడు. కాశీని మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు వైరా.

కార్తీక్ అబద్ధం

అమ్మ తాత తప్పు చేశాడా? అని శౌర్య అడిగితే లేదని చెప్తుంది దీప. నిన్ను కూడా ఓ సారి పోలీసులు తీసుకుపోయారు కదా అమ్మా. ఇప్పుడు తాతను కూడా అలాగే తీసుకుపోయారు. ఏమైందమ్మా ఏడుస్తున్నావ్? తప్పు చేయకపోతే పోలీసులు ఎందుకు తీసుకుపోయారని శౌర్య అడుగుతుంది. కొన్నిసార్లు అంతే మంచివాళ్లు తప్పు చేయకపోయినా నిందలు మోయాలని దీప అంటుంది. నానమ్మ తాత ఎక్కడ అని శౌర్య అడుగుతుంది. వాళ్ల ఇంటికి వెళ్లాడని కార్తీక్ అబద్ధం చెప్తాడు.

దీప కారణం

దీప, నాన్న స్టేషన్ లోనే ఉన్నారని కార్తీక్ అంటాడు. నాకూ బాధగా ఉందని దీప అంటుంది. ఆయన స్టేషన్ లో ఉండటానికి కారణం నువ్వే కదా ఎందుకు బాధపడుతున్నావ్? ఫుడ్ ట్రక్ ఐడియా దీపదే కదా. అందరి మాటలే నేనూ మాట్లాడుతున్నా. ఇవి పారిజాతం పిన్ని నాతో అన్న మాటలు. సమాజం ఇలాగే ఉంటుంది. ఎవరెన్ని చెప్పినా నేనెప్పుడూ నిన్ను తప్పుగా అనుకోను దీప అని కాంచన చెప్తుంది.

స్వప్న షాక్

వైరా ఇచ్చిన రూ.5 లక్షల అడ్వాన్స్ ను కాశీ చూపించగానే స్వప్న షాక్ అవుతుంది. నంబర్ వన్ కంపెనీలో ఊహించని జాబ్ నాకు వచ్చింది. నా అర్హత చూసి జాబ్ ఇచ్చారు. ఇది నా స్థాయి. పీఏ పోస్ట్ ఇస్తే పనోడిలా ఉంటాననుకున్నారు. చెప్పులా చూశారు. కానీ నాకూ ఓ రోజు వచ్చింది. రెండు రోజుల్లో జాబ్ లో జాయిన్ అవుతా. వారంలో ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్తున్నాం. నా టాలెంట్ తో ఒక్క రోజులోనే రూ.5 లక్షలు సంపాదించా. రెండ్రోజుల్లో జాయినింగ్ లెటర్ నీ చేతుల్లో పెడతానని కాశీ చెప్తాడు.

పగ తీర్చుకునేవాడిలా రెచ్చిపోయి మాట్లాడుతున్నావ్ ఏంటీ? మా నాన్న నీ వల్ల పోలీస్ స్టేషన్లో ఉన్నాడని స్వప్న అంటుంది. నా వల్ల కాదు తప్పు చేశాడు కాబట్టి స్టేషన్లో ఉన్నాడు. బెయిల్ కూడా రాలేదు. ఆయన చేసిన తప్పునకు నాకు చెడ్డపేరు వచ్చింది. నేను ఎవరినీ పట్టించుకోను అని కాశీ అంటే స్వప్న ఏడుస్తుంది.

కార్తీక్ టెన్షన్

బెయిల్ కూడా ఇవ్వలేనంత బలమైన కేసు మా నాన్న మీద ఉంది. రేపు ఈ పాటికి మా నాన్న వాళ్ల ఇంట్లో ఉండాలని అమ్మ చెప్పింది. నాన్న కోర్టుకు వెళ్లకుండా ఇంటికి తీసుకురావాలంటే తప్పు చేసిందో ఎవరో తెలియాలి. డోర్ కొట్టి ఎవరైనా చెప్తారా అని కార్తీక్ అంటాడు. తెలుస్తుంది బావ, సంకల్పం బలమైంది అయితే నోటి మాట కూడా నిజమవుతుంది బావ అని దీప చెప్తుంది.

కాశీపై డౌట్

అప్పుడే స్వప్న వచ్చి డోర్ కొడుతుంది. అన్నయ్య అంటూ కార్తీక్ ను పట్టుకుని ఏడ్చేస్తుంది. ఇంత రాత్రి ఒంటరిగా రావాల్సిన అవసరం ఏముందని కార్తీక్ మండిపడతాడు. కొత్త సమస్య వచ్చిందన్నయ్య అని కాశీ పేరు చెప్తుంది స్వప్న. రూ.5 లక్షల స్క్రీన్ షాట్ ను కార్తీక్ కు చూపిస్తుంది స్వప్న. ఇంకొక కంపెనీలో జీఎంగా జాబ్ వచ్చిందంటా. జాయినింగ్ బోనస్ కింద రూ.10 లక్షలు ఇస్తారంటా. ఫస్ట్ రూ.5 లక్షలు ఇచ్చారు. మిగతా రూ.5 లక్షలు జాయినింగ్ రోజు ఇస్తారంటా అని స్వప్న చెప్తుంది.

ఆ పోస్టుకు చాలా అనుభవం కావాలి దీప. కాశీ ఫుడ్ ట్రక్ దగ్గర మేనేజ్ చేయడానికే కష్టపడతాడు. ఇక జీఎం ఏంటీ అని కార్తీక్ డౌట్ పడతాడు. కాశీ నాన్న గురించి నీచంగా మాట్లాడాడు. నాన్న అరెస్టుకు, కాశీకి ఏదో సంబంధం ఉందని స్వప్న చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More