కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దొరికిపొయిన వైరా-కుట్ర వెనుకాల జ్యోత్స్న ఉందని బిగ్ బాంబ్-అరెస్ట్ చేసిన పోలీసులు-ట్విస్ట్
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 30 ఎపిసోడ్ లో తన ఆరోగ్యంపై సుమిత్రకు అనుమానం వస్తుంది. వైరా దగ్గరకు వెళ్లి లాక్కొని వస్తాడు కార్తీక్. శివ నారాయణ ఇంటి దగ్గర మీడియా ముందు తప్పు ఒప్పుకొంటాడు వైరా. కానీ చేయించింది జ్యోత్స్న అని బాంబ్ పేలుస్తాడు.
నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 30 ఎపిసోడ్ లో వచ్చే జన్మలోనైనా నువ్వు కూతురుగా పుడతావేమో అని దీపతో చెప్తూ దశరథ బాధపడ్డాడు. నేను మీ కూతురునని చెప్పి మీ బాధంతా పోగొట్టాలని ఉంది, కానీ చెప్పలేనని దీప అనుకుంటుంది. మీరేం బాధపడకండి. సుమిత్రమ్మ గారికి ఏం కాదని దీప చెప్తుండగా సుమిత్ర వస్తుంది.

సుమిత్ర అనుమానం
సుమిత్రమ్మకు ఏం కాదని చెప్పావేంటీ? ఇప్పుడు నాకు ఏమైందని అడుగుతుంది సుమిత్ర. ఏం లేదు సుమిత్ర. రిపోర్ట్స్ వస్తాయి కదా అదే దీప చెప్తుందని దశరథ కవర్ చేస్తాడు. డాక్టర్ ఫోన్ చేసి సుమిత్రను హాస్పిటల్లో అడ్మిట్ కావాలని చెప్పారా? నాకు ఏం లేదని డాక్టర్ చెప్పాలా? నాకు తెలియదా? మీ ఆయన ఎక్కడ? అని అడుగుతుంది సుమిత్ర. చిన్న పని మీద బయటకు వెళ్లాడమ్మా అని దీప చెప్తుంది.
వైరా ఆఫర్
జ్యోత్స్న మాటల గురించి వైరా ఆలోచిస్తుంటాడు. అప్పుడే కాశీ ఎంట్రీ ఇస్తాడు. జాయినింగ్ ఎప్పుడు? అని వైరా అడగ్గానే ఇప్పుడే అని కార్తీక్ వస్తాడు. పీఏకే జీఎం పోస్టు ఇచ్చావంటే మరి నాకు ఏ పోస్టు ఇవ్వాలంటావ్ అని వైరా అసిస్టెంట్ ను అడుగుతాడు కార్తీక్. మీ తాతను వదిలేసి వచ్చావంటే వైరా సంస్థకే నిన్ను అధిపతిని చేస్తా. నాతో ఉంటే యజమానిగా ఉంటావని వైర్ అడుగుతాడు. తాత దగ్గరే ఉంటానని కార్తీక్ చెప్తాడు.
కాలర్ పట్టుకుని
చీకట్లో చేసిన పాపాలను వెలుగులోకి కడుక్కోవడానికి వెళ్దాం. నువ్వు డబ్బుతో కొనేసిన జ్యోత్స్న రెస్టారెంట్ ఎంప్లాయిస్, నువ్వు ఉత్తములా? కాశీ చెంపపై దెబ్బ ఇంకా గమనించినట్లు లేదనుకుంటా. నేనే కొట్టానని కార్తీక్ చెప్తాడు. బెదిరిస్తే భయపడతా అనుకున్నావా? బయల్దేరమంటాడు వైరా. నా కంపెనీ జోలికి వచ్చావు వార్నింగ్ ఇచ్చి వదిలేశా. ఇప్పుడు ఫ్యామిలీ జోలికి వచ్చావ్ ఈ సారి వార్నింగ్ లు ఉండవు, వాయించడాలే. కట్ట మైసమ్మ మీద ఒట్టు ఈ సారి నీ సంగతి తేల్చాల్సిందే. నువ్వు చేసిన తప్పు సాక్ష్యాధారాలతో సహా తెలిసింది. తేల్చుకుందాం పదా అని వైరా కాలర్ పట్టుకుని లాక్కెల్తాడు కార్తీక్.
శ్రీధర్ తప్పు చేయలేదు
శివనారాయణ ఇంటికి మీడియా వాళ్లు వస్తారు. నేనే రమ్మన్నానని కాశీ, వైరాను తీసుకుని వస్తాడు కార్తీక్. అది చూసి జ్యోత్స్న మైండ్ బ్లాంక్ అవుతుంది. జ్యోత్స్న రెస్టారెంట్లో జరిగింది కల్తీ కాదు కుట్ర. తనకంటే ఉన్నతంగా ఎదుగుతున్న జ్యోత్స్న రెస్టారెంట్ ను చూడలేక వైరా అనే వ్యక్తి కాశీ, మరో ఇద్దరు ఉద్యోగుల సాయంతో కావాలనే ఫుడ్ కల్తీ చేశారు. తన వెనుక కుట్ర జరుగుతుందని తెలియని సీఈఓ కేసు ఛైర్మన్ వరకు వెళ్తుందని ఆలోచించి పోలీసుల దగ్గర లొంగిపోయారు. నిజానికి శ్రీధర్ నిరపరాధి అని కార్తీక్ చెప్తాడు.
జ్యోత్స్న చేయించిందని
నేను సీఈఓ శ్రీధర్ దగ్గర పీఏగా వర్క్ చేస్తున్నా. వైరా జీఎంగా జాబ్ ఇస్తా అన్నారు. ఫేవర్ చేయమన్నారు. నా వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకునే సరికి అంతా అయిపోయిందని కాశీ చెప్తాడు. దీనంతటికి కారణం నేను కాదు. వేరే ఉన్నారని వైరా అంటాడు. అప్పుడే పోలీసులు వస్తారు. నేను తప్పు చేశా. నాతో ఒకరు చేయించారు. జ్యోత్స్న రెస్టారెంట్ ఛైర్మన్ శివ నారాయణ మనవరాలు. ఆ జ్యోత్స్న నాతో ఈ పని చేయించిందని బాంబ్ పేలుస్తాడు వైరా.
నా తండ్రి మీద పగ తీర్చుకోవడానికి వైరాతో చేతులు కలిపింది జ్యోత్స్న అని కార్తీక్ అంటాడు. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదని శివనారాయణ అంటాడు. జ్యోత్స్నను పోలీసులు తీసుకెళ్తారు. నా మనవరాలు ఏ తప్పూ చేయలేదు, అరెస్ట్ చేయకండని పారిజాతం ఇదంతా ఊహించుకుని అరుస్తూనే ఉంటుంది. ఎవరు నీతో తప్పు చేయించిందని కార్తీక్ అడిగితే, జ్యోత్స్న అని వైరా చెప్తాడు.
జ్యో తెెలివి
తన రెస్టారెంట్లో ఫుడ్ కల్తీ చేయమని చెప్పిందని వైరా అనగానే, నోర్మూయ్ రా అని వైరాను కొడతాడు శివ నారాయణ. దొరికిపోయింది చాలన్నట్లు తప్పించుకోవడానికి దారులు వెతుకుతున్నావా? అని ఫైర్ అవుతాడు. నేను చెప్పేది నిజం. నా దగ్గరకు వచ్చి సాయం అడిగింది మీ మనవరాలే అని వైరా స్పష్టం చేస్తాడు. నీలాగే నేను మాట్లాడితే నీకు నాకు తేడా ఏముందని జ్యోత్స్న ప్లేటు ఫిరాయిస్తుంది. నమ్మాలంటే సాక్ష్యాలు, ఆధారాలు కావాలని జ్యో అంటుంది.
కాల్ రికార్డింగ్
నోటి మాట చెల్లదు వైరా. నువ్వు మా శత్రువని అందరికీ తెలుసు. ఆ పగతోనే ఇదంతా చేశాడు. సాక్ష్యం కూడా చూపిస్తా అని కాల్ రికార్డింగ్ వినిపిస్తుంది జ్యో. నువ్వే కరెక్ట్ జ్యోత్స్న. నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిందానివే. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు. అది నిజమేనని వైరా అంటాడు. చెప్పు కాశీ, మనం పూర్తిగా మునిగిపోయామని వైరా అడుగుతాడు.
జ్యోత్స్నకు దీనికి ఏ సంబంధం లేదు. వైరా చెప్పాడని చేశా. తప్పంతా నాదేనని కాశీ అంటాడు. వైరా, కాశీని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. కాశీని జ్యోత్స్ననే ఇరికించిందని పారు అనుకుంటుంది. స్టేషన్ కు వెళ్లి శ్రీధర్ ను తీసుకొద్దామని జ్యోతో వెళ్తాడు కార్తీక్. జ్యోత్స్న చాలా తెలివిగా తప్పించుకుని, కాశీకి అన్యాయం చేసిందని దీప అనుకోవడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












