కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపకు సుమిత్ర బ్లడ్ టెస్ట్ నిజం-పోలీస్ స్టేషన్‌కు కాంచన-ఆ మాటతో శ్రీధర్ మనసు ముక్కలు
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 25 ఎపిసోడ్ లో కాంచనకు ఫోన్ చేసి కావేరి మాట్లాడుతుంది. బాధలో ఆయనకు నాకంటే నువ్వే ఎక్కువ ఇష్టమని అంటుంది. మళ్లీ సారీ చెప్తుంది. సుమిత్ర టెస్టుల విషయం దీపకు తెలుస్తుంది. శ్రీధర్ కోసం కాంచన పోలీస్ స్టేషన్ కు వెళ్తుంది. కానీ ఒక్క మాటతో కన్నీళ్లు తెప్పిస్తుంది.
కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 25 ఎపిసోడ్ లో మనం చేసిన తప్పు మనకు ముందు అర్థం కాదమ్మా. నాన్న ముఖం నేను చూడగలనా? పాపం మనలాగే పెద్దమ్మ కూడా బాధ పడుతూ ఉంటుంది అని తల్లికి ఏడుస్తూ చెప్తుంది స్వప్న. కాంచనకు కాల్ చేసి ఇస్తుంది స్వప్న.

మీ పుట్టింటివాళ్లు
అక్క, జరిగిందంతా నీకు తెలిసే ఉంటుంది కదా. నాకు భయంగా ఉంది అక్క అని కావేరి అంటుంది. స్వప్న వాళ్ల నాన్న తప్పు చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా? అని కాంచన అడుగుతుంది. దీనికి సమాధానం ఒక్క మాటలో చెప్పలేనక్క. ఆయనకు సీఈఓ పోస్టు వచ్చినప్పటి నుంచి మీ పుట్టింటి వాళ్లు అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒకటి అంటున్నారు. ఆయన తప్పు చేయడని నమ్ముతా. ఆయన ఎదుగుదలను ఓర్చుకోనివాళ్లు ఇది చేసి ఉంటారని కావేరి అంటుంది.
కావేరి సారీ
అక్క, నువ్వు పోలీస్ స్టేషన్ కు వెళ్లావా? ఆయనకు నాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అక్క. నీ గురించే ఆలోచిస్తారు. నువ్వు కూడా ఆయన గురించి ఆలోచిస్తావా అక్క? నువ్వు ఏం తప్పుగా అనుకోకు. సారీ అక్క అని కావేరి అంటుంది. స్వప్న వాళ్ల నాన్న కార్తీక్ వాళ్ల అమ్మ గురించి ఆలోచించొచ్చు. పిల్లలున్నారు కాబట్టి భార్యాభర్తల బంధం తెంపేసుకున్నా అమ్మానాన్నల బంధం తెంపలేకపోయా. తెగేవరకూ తీసుకురాకు. నువ్వు ధైర్యంగా ఉండమని కాల్ కట్ చేస్తుంది కాంచన.
దీపకు నిజం
మీరేం టెన్షన్ పడకండి. సుమిత్ర ఆరోగ్యంగా ఉందని కార్తీక్, దీపకు చెప్తాడు దశరథ. నువ్వు ప్రెగ్నెంట్ కదా అన్నీ మనసులో పెట్టుకోకు. సుమిత్రకు ఏం కావాలో చూడు. జ్యోత్స్న అన్న మాటలు మనసులో పెట్టుకోవద్దు. కార్తీక్ మీ నాన్న గురించి ఏం బాధపడకని దశరథ అంటాడు. నిజం చెప్పడానికి భయపడుతున్నావ్. డాక్టర్ ఏం చెప్పాడని దశరథను అడుగుతాడు కార్తీక్.
దీప ముందు నిజం చెప్పలేకపోయా. బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ రెండు రోజుల్లో వస్తాయని డాక్టర్ చెప్పిన విషయం కార్తీక్ కు చెప్తాడు దశరథ. ఒకేసారి రెండు కష్టాలు వచ్చాయి. అత్తకు ఏం కాదు నాన్నకు ఏం కాదని కార్తీక్ అంటాడు. అత్త ఆరోగ్య పరిస్థితి గురించి దీపకు చెప్పకూడదని అనుకుంటాడు. అప్పుడే వచ్చిన దీప అంతా విన్నా బావ అని ఏడుస్తుంది. అత్తకు ఏం కాదు డాక్టర్లు అలాగే చెప్తారని కార్తీక్ అంటాడు.
పోలీస్ స్టేషన్ కు కాంచన
శౌర్య వచ్చి అడిగితే తాత పోలీస్ స్టేషన్లో ఉన్నారని కాంచన చెప్తుంది. అయితే తాత దగ్గరకు నేను తీసుకెళ్తానని శౌర్య అంటుంది. మీ నాన్న వచ్చాక అడిగి తీసుకెళ్లమని అంటుంది కాంచన. కార్తీక్, దీప రాగానే నాన్న తాత పోలీస్ స్టేషన్లో ఉన్నారంటా కదా. నానమ్మ తాత దగ్గరకు వెళ్తుందంటా, నీ కోసం ఎదురు చూస్తుందని శౌర్య అంటుంది. నేను తాత దగ్గరకు వస్తానని శౌర్య అంటే, వద్దని చెప్తారు. అమ్మ నువ్వెందుకు పోలీస్ స్టేషన్ కు? భర్తగా అంగీకరించని మనిషి కోసం ఎందుకు ఇవన్నీ చేయడం? అని కార్తీక్ ప్రశ్నిస్తాడు.
శ్రీధర్ ఎమోషనల్
వంట చేస్తావా? లేదా దీప. నువ్వెళ్లి ప్రెషప్ అయి రారా. నేను వెళ్తానంటే ఎందుకు అన్ని ప్రశ్నలు అడుగుతున్నావ్? అని కోప్పడుతుంది కాంచన. పోలీస్ స్టేషన్ సెల్ లో ఉన్న శ్రీధర్ కనీసం నీళ్లు కూడా తాగడానికి ఇష్టపడడు. అప్పుడే తల్లితో కలిసి కార్తీక్ వస్తాడు. ఆయన పోలీస్ స్టేషన్లో ఉండగా ఎప్పుడూ చూడలేదు. ఏదో ఒక బాధను మోసుకెళ్లాల్సిందేనని కాంచన అంటుంది. కాంచనను చూసి శ్రీధర్ ఫీల్ అవుతాడు. కాంచన నన్ను క్షమించింది, భర్తగా అంగీకరించిందని శ్రీధర్ అనుకుంటాడు.
అమ్మానాన్న మనసు విప్పి మాట్లాడుకోవాలని లాయర్ కు కాల్ చేయాలని కార్తీక్ బయటకు వెళ్లిపోతాడు. శ్రీధర్ కు వండిస్తుంది కాంచన. నువ్వు వస్తావని అనుకోలేదని శ్రీధర్ అంటే, కావేరి వస్తుందనుకున్నారా? అని కాంచన అడుగుతుంది. నన్నెందుకు అరెస్టు చేశారో నీకు తెలుసా? నేను తప్పు చేశానని నమ్ముతున్నావా? అని అడుగుతాడు శ్రీధర్.
ఒక్క మాటతో
నా గురించి ఆలోచించావు. నన్ను భర్తగా అంగీకరించాలంటే నాకు ఈ పరిస్థితి రావాలని తెలీదు కాంచన. తెలిసి ఉంటే తప్పు చేసైనా అరెస్ట్ అయ్యేవాణ్ని. సెల్ లో నిల్చుని నీ గురించే ఆలోచిస్తున్నా. నిన్ను చూశాక బాధ పోయింది. ఈ బంధం మన ఇద్దరి ప్రాణాలు ఉన్నంతవరకూ ఉంటుంది కాంచన. నువ్వు నన్ను భర్తగా అంగీకరించావంటే సంబరంలా ఉందని శ్రీధర్ అంటాడు. అంగీకరించానని ఎవరు చెప్పారు? కార్తీక్ తల్లిగా మాత్రమే వచ్చానని కాంచన చెప్తుంది. ఒక్క మాటతో అన్నాన్ని కూడా విషంలా మార్చేశావు కాంచన అని శ్రీధర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.
కార్తీక్ వచ్చి తినిపిస్తాడు. అన్నం మెతుకులు కూడా ముళ్లులా గుచ్చుకుంటున్నాయని శ్రీధర్ అంటాడు. మీ ఇద్దరు మామూలుగా మాట్లాడుకుంటే చూడాలని ఉందని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












