కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న తెలివి- ట్రాప్‌లో వైరా- కాశీని చెంప‌దెబ్బ కొట్టిన కార్తీక్‌- కాల‌ర్ ప‌ట్టుకుని!

కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 29 ఎపిసోడ్ లో జ్యోత్స్న రూమ్ లో రికార్డింగ్ కోసం దీప ఫోన్ పెడుతుంది. మొబైైల్ చూసి జ్యోత్స్న తెలివిగా మాట్లాడుతుంది. కాశీ దగ్గరకు కార్తీక్ వెళ్లి చెంపదెబ్బ కొడతాడు. నిజం రాబడతాడు. మరోవైపు దశరథ బాధ పడుతుంటాడు. 

Published on: Dec 29, 2025, 06:47:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 29 ఎపిసోడ్ లో మొబైల్ రికార్డింగ్ ఆన్ చేసి జ్యోత్స్న రూమ్ లో పెడుతుంది దీప. జ్యో తన గదివైపు పరుగెత్తుకుంటూ వస్తుంది. జ్యోకు కనిపించకుండా దీప వెళ్లిపోతుంది. దీప నా రూమ్ లోకి వెళ్లిందని గ్రానీ చెప్పింది. మరి బావకు వైరా గురించి తెలిసిపోయిందా? కాశీ నిజం చెప్పాడా? నన్ను వైరా మోసం చేస్తున్నాడా? అని జ్యో అనుకుంటుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

జ్యో తెలివి

వైరాకు జ్యోత్స్న కాల్ చేస్తుంది. అప్పుడే రికార్డింగ్ ఆన్ చేసి పెట్టిన కార్తీక్ ఫోన్ ను చూసి కాల్ కట్ చేస్తుంది జ్యో. వైరా కాల్ చేస్తే బావకు అనుమానం రాకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటానని జ్యో అనుకుంటుంది. వైరా ఎవరో తెలియనట్లు ఆమె మాట్లాడుతుంది. వైరా నువ్వు ఎంత ట్రై చేసినా మా కంపెనీలో అడుగుపెట్టలేవు? మా మామయ్య తప్పు చేసినంత మాత్రాన రెస్టారెంట్ మూసేస్తా అనుకుంటున్నావా? అది నాదే. డబ్బుతో కొనాలని చూస్తే కంపెనీని అమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరని జ్యో అంటుంది.

పోలీస్ కంప్లెయింట్

మళ్లీ కాల్ చేస్తే పోలీస్ కంప్లెయింట్ ఇస్తానని చెప్పి కాల్ కట్ చేస్తుంది జ్యోత్స్న. మనం పార్ట్ నర్స్ అని చేయి కలిపింది. ఇప్పుడు ఏం సంబంధం లేదని అంటుందని వైరా అనుకుంటాడు. జ్యోత్స్న చెబితేనే ఫుడ్ కల్తీ చేయించా. ఇప్పుడు ఆమె ఏంటో అర్థమైంది కదా. మనమేంటో జ్యోత్స్నకు చూపిద్దామని వైరా అంటాడు. కల్తీ ఫుడ్ కేసులో నా హస్తం లేదని నమ్మడానికి ఈ సాక్ష్యం చాలని జ్యో బయటకు వెళ్తుంది. దీప వచ్చి ఫోన్ తీసుకుంటుంది. జ్యో ఎదురుగా వస్తుంది.

వలలో చేపలా

ఏంటి వక్కలక్క గారు నా రూమ్ లో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏదో వెతుకుతున్నట్లున్నారు? అని వెటకారంగా అడుగుతుంది జ్యో. నిజాన్ని వెతుకుతున్నా. వలలో చిక్కుకున్న చేపలా తప్పించుకోలేరు. మీ జన్మ చేపలాంటిది అమ్మాయి గారు అని దీప చెప్తుంది. నీ వల్ల ఎవరికైనా నష్టం కలగొచ్చు. పాపం శ్రీధర్ మామయ్య, నువ్విచ్చిన సలహాతో అన్ని పోగొట్టుకుని స్టేషన్లో ఉన్నారు. ఈ సారి బావ లేకపోతే నువ్వు ఏమైనా పోగొట్టుకోవచ్చని జ్యో అంటుంది.

వైరా ఎందుకు చేశాడు?

రికార్డింగ్ ను కార్తీక్, దీప వింటారు. మనం అనుకున్నదానికి దీనికి సంబంధం లేదు. అంటే కల్తీ ఫుడ్ కు జ్యోకు సంబంధం లేదా అని దీప అంటుంది. నాన్న అరెస్ట్ అవడానికి, కాశీ సాక్ష్యం చెప్పడానికి, జ్యోకు వైరా కాల్ చేయడానికి ఏదో సంబంధం ఉంది. వైరా కల్తీ చేసి ఉంటే కాల్ దశరథ మామయ్యకు లేదా ఛైర్మన్ చేయాలి. జ్యోకు కాల్ వచ్చిందంటే ఏంటి అర్థం. ఆమెకు రికార్డింగ్ చేసే మొబైల్ గదిలో ఉందని ముందే తెలుసు. అందుకే తెలివిగా మాట్లాడింది. కాశీకి డబ్బులు జ్యోత్స్నే ఇవ్వొచ్చని కార్తీక్ అనుమానపడతాడు.

కాశీతో కార్తీక్

నా అంచనా ప్రకారం కాల్ కాశీకి వెళ్లాలి. కానీ కాశీ ప్రస్తావన లేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు క్లారిటీ ఉంది దీప. నాన్నను తీసుకొస్తానని మాటిచ్చా. నేను వెళ్తున్నా. నువ్వు జాగ్రత్త అని కార్తీక్ బయటకు వెళ్తాడు. కాశీని కలుస్తాడు. నీలాంటి పెద్దవాళ్లను బయటే కలుసుకోవాలి కాశీ. నేను డ్రైవర్ ను, నువ్వు జనరల్ మేనేజర్. నా లాంటి డ్రైవర్ రూ.5 లక్షలు సంపాదించాలంటే సంవత్సరం పడుతుంది. నీకైతే అయిదు నిమిషాలు చాలు. నీ వెనక ఎవరు ఉన్నారో చెప్పమని అడుగుతాడు కార్తీక్.

చెంపదెబ్బ

ఎవరు లేరని కాశీ అంటాడు. అయితే వైరాను కలవడానికి వెళ్దామని కార్తీక్ అంటాడు. వైరా ఎవరు? అని అడుగుతాడు కాశీ. వెంటనే కాశీని చెంపదెబ్బ కొడతాడు కార్తీక్. మా నాన్నను మోసం చేయాలని ఎలా అనిపించింది? వైరా గాడితో చేతులు కలిపి నువ్వు సాధించిందేంటీ? వాడికి మా తాతకు శత్రుత్వం ఉంది. పగ తీర్చుకోవడానికే బతుకుతున్నాడు. ఇవేం తెలియకుండా బిస్కెట్లకు తోక ఊపుకుంటూ వెళ్లిపోయావు. నిన్ను వైరా దగ్గరకు పంపించింది జ్యోత్స్ననే కదా అని కార్తీక్ అడుగుతాడు.

కాలర్ పట్టుకుని

ఏం చెప్పాలి బావ? నన్ను నీచంగా చూశారు. నాకు జ్యోత్స్న అక్క సాయం చేసిందని కాశీ చెప్తాడు. ఆ పెద్ద మనిషిని కలుద్దామని కాశీ కాలర్ పట్టుకుని లాక్కెళ్తాడు కార్తీక్. మరోవైపు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న దశరథ దగ్గరకు దీప వెళ్తుంది. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయండి? అని దీప అడుగుతుంది. నేనే మర్చిపోయిన విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నావ్? కడుపుతో ఉన్నప్పుడు ఇష్టం ఉన్నది తినాలి. నీకు ఏం కావాలో చెప్పు ఆర్డర్ చేస్తానని దశరథ అంటాడు.

దశరథ బాధ

అమ్మకు ఏం కాదు నాన్న అని దీప అంటే, దీపలో జ్యోత్స్నను చూసుకుంటాడు దశరథ. తల్లిదండ్రులకు వయసైన తర్వాత పిల్లల నుంచి ప్రేమను ఆశిస్తాం. నువ్వు నా చేయి మీద చేయి వేసి ధైర్యం చెబుతుంటే కొన్ని నిమిషాలు నీలో నా కూతురు కనిపించింది. తను కూడా ఇలా వచ్చి మాట్లాడితే బాగుండనిపిస్తుంది. నువ్వే నా కూతురు అయితే బాగుండనిపించింది అని ఎమోషనల్ అవుతాడు దశరథ.

వచ్చే జన్మలో అయినా కూతురుగా పుడతావేమో అని దశరథ అంటాడు. నేనే మీ కూతురిని అని చెప్పలేను నాన్న అని దీప అనుకోవడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More