బిగ్ బాస్ బ్యూటీకి 150 మందికిపైగా బాడీగార్డ్స్- హౌజ్‌లో కామెంట్స్- అసలు కథ బయటపెట్టిన తాన్య మిట్టల్

బిగ్ బాస్ బ్యూటి తాన్య మిట్టల్‌కు 150 మందికి పైగా బాడీగార్డ్స్ అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై స్పందించిన బిగ్ బాస్ 19 ఫైనలిస్ట్ తాన్య మిట్టల్ ట్రోల్స్‌కు చెక్ పెట్టింది. ఆమె బిగ్ బాస్ హౌజ్‌లో మాట్లాడిన మాటల వెనుక ఉన్న అసలు కథను బయటపెట్టారు.

Published on: Jan 2, 2026, 13:32:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ సీజన్ 19లో తనదైన ముద్ర వేసి 3వ రన్నరప్‌గా నిలిచిన బ్యూటి తాన్య మిట్టల్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు తాన్య మిట్టల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

బిగ్ బాస్ బ్యూటీకి 150 మందికిపైగా బాడీగార్డ్స్- హౌజ్‌లో కామెంట్స్- అసలు కథ బయటపెట్టిన తాన్య మిట్టల్
బిగ్ బాస్ బ్యూటీకి 150 మందికిపైగా బాడీగార్డ్స్- హౌజ్‌లో కామెంట్స్- అసలు కథ బయటపెట్టిన తాన్య మిట్టల్

నాకు 150 మంది బాడీగార్డ్స్ ఉన్నారు

ముఖ్యంగా ‘నాకు 150 మంది బాడీగార్డ్స్ ఉన్నారు’, ‘బక్లావా తినడానికే దుబాయ్ వెళ్తాను’ వంటి తాన్యా మిట్టల్ మాటలు నెటిజన్లకు ఆశ్చర్యం కలిగించాయి. అయితే, ఇప్పుడు బిగ్ బాస్ ప్రయాణం ముగిశాక, తనపై వస్తున్న ఆ వార్తలపై తాన్య గ్వాలియర్‌లో స్పందించారు.

150 మంది బాడీగార్డ్స్ కాదు.. స్టాఫ్!

ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యాక్టరీని చూపిస్తూ తాన్య మిట్టల్ అసలు విషయం వెల్లడించారు. "నాకు 150 మంది బాడీగార్డ్స్ ఉన్నారని నేను ఎక్కడా చెప్పలేదు. ఇంటర్నెట్‌లో వెతికినా అలాంటి వీడియో మీకు ఎక్కడా దొరకదు. అదంతా సృష్టించిన ప్రచారం మాత్రమే" అని తాన్య మిట్టల్ అసలు కథ బయటపెట్టారు.

వ్యక్తిగత భద్రత ఉంది

అసలేం జరిగిందో వివరిస్తూ.. "నా దగ్గర 150 మందికి పైగా సిబ్బంది (Staff) పనిచేస్తున్నారని జైషాన్ ఖాద్రీతో సరదాగా చెప్పాను. ఆయన దానిని జోక్ చేస్తూ బాడీగార్డ్స్ అని మార్చేశారు. నాకు వ్యక్తిగత భద్రత ఉంది. అది గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతోంది. కానీ, సంఖ్య మాత్రం ఆ స్థాయిలో లేదు" అని తాన్య మిట్టల్ వివరించారు.

వ్యాపార సామ్రాజ్యంపై స్పష్టత

తన ఆర్థిక స్థితిగతులపై వస్తున్న విమర్శలకు కూడా తాన్యా మిట్టల్ గట్టిగానే బదులిచ్చారు. "నాకు టెక్ట్స్‌టైల్స్, ఫార్మా, గిఫ్ట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇవన్నీ మీకు చూపించాలని లేదు. కానీ, నన్ను సపోర్ట్ చేసిన వారు నేను అబద్ధాల కోరు కాదని, నేను ఎప్పుడూ నిజాయితీగానే ఉన్నానని నిరూపించుకోవడానికే ఈ ఫ్యాక్టరీ టూర్ చేస్తున్నాను" అని తాన్య పేర్కొన్నారు.

ఏక్తా కపూర్ ప్రాజెక్ట్‌లో ఛాన్స్

స్పిరిచ్యువల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన తాన్యా మిట్టల్‌కు బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ లభించింది. ఫైనలిస్ట్‌గా నిలవడమే కాకుండా ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశాన్ని కూడా తాన్య మిట్టల్ దక్కించుకున్నారు. త్వరలోనే తాన్య నటిగా తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More