నేను చచ్చేదాకా నా పేరు పక్కన ఆయన ఉండాలనే ఆ పేరు పెట్టుకున్నా- బిగ్ బాస్ బజ్‌లో శివాజీనే ఏడిపించిన తనూజ పుట్టస్వామి

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ పూర్తయింది. విన్నర్‌గా కల్యాణ్ పడాల టైటిల్ గెలిస్తే.. రన్నరప్‌గా తనూజ పుట్టస్వామి నిలిచింది. బిగ్ బాస్ పూర్తయిన తర్వాత బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి తనూజ గౌడ హాజరు అయింది. ఈ ఇంటర్వ్యూలో హోస్ట్ శివాజీనే ఏడిపించేసింది సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ.

Published on: Dec 23, 2025, 13:06:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ముగిసిపోయింది. బిగ్ బాస్ తెలుగు 9 టైటిల్ విజేతగా కల్యాణ్ పడాల గెలిస్తే.. రన్నరప్‌గా సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి నిలిచింది. బిగ్ బాస్ అనంతరం టాప్ 5 ఫైనలిస్ట్‌లు బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే, దానికి సంబంధించిన ప్రోమోను, ఎపిసోడ్స్‌లను రోజుకొకటిగా విడుదల చేస్తున్నారు.

నేను చచ్చేదాకా నా పేరు పక్కన ఆయన ఉండాలనే ఆ పేరు పెట్టుకున్నా- బిగ్ బాస్ బజ్‌లో శివాజీనే ఏడిపించిన తనూజ పుట్టస్వామి
నేను చచ్చేదాకా నా పేరు పక్కన ఆయన ఉండాలనే ఆ పేరు పెట్టుకున్నా- బిగ్ బాస్ బజ్‌లో శివాజీనే ఏడిపించిన తనూజ పుట్టస్వామి

బిగ్ బాస్ బజ్ తనూజ ఇంటర్వ్యూ

డిసెంబర్ 22న కల్యాణ్ పడాల బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ రాగా ఇవాళ (డిసెంబర్ 23) తనూజ గౌడ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ బిగ్ బాస్ 9 తెలుగు బజ్ ఇంటర్వ్యూలో ది లేడి టైగర్ అంటూ తనూజ గౌడను ఆహ్వానించాడు హోస్ట్ శివాజీ. అలాగే, తనూజకు పులి బొమ్మ ఉన్న ట్రోఫీ కూడా అందించాడు శివాజీ.

ఏడ్చాము, కోప్పడ్డాము..

"ఈ జర్నీ సాటిస్‌ఫైడ్ అమ్మా" అని శివాజీ అడిగితే.. "అవును, నవ్వాము. ఏడ్చాము. కోప్పడ్డాము. ఒకలాంటి బ్యూటిఫుల్ మిక్స్‌డ్ జర్నీ అంటే బిగ్ బాస్ అనే చెబుతాను" అని తనూజ గౌడ అంది. "తనూజకు నచ్చినప్పుడేమో నాన్న అంటది.. నచ్చనప్పుడేమో భరణి సార్ అంటది.. ఎందుకు.." అని శివాజీ అడిగాడు.

అది పక్కన పెడితేనే ఆడగలుగుతా

"అక్కడికి నేను వెళ్లింది నా గేమ్ నేను ఆడటానికి. గెలవడానికి. నాలో ఎంత ప్రేమ, గౌరవం ఉన్నా అది పక్కన పెడితేనే నేను ఆడగలుగుతా" అని తనూజ తెలిపింది. "తనూజను ఒక అవకాశవాది అనే ఒపినీయన్ అయితే ఉంది" అని శివాజీ అన్నాడు. "నాకు సెల్ఫిష్‌నెస్ ఉంటే ఇంకొకరు గేమ్ బాగా ఆడాలని కోరుకునేదాన్ని కాదు. ఇంకొకరిని ఎంకరేజ్ చేసేదాన్ని కాదు" అని తనూజ చెప్పింది.

20 లక్షలు తీసుకోవాల్సిందేమో

"మా తనూజ 20 లక్షలు తీసుకుని ఉండాల్సిందేమో" అని శివాజీ అన్నాడు. "మనీ కోసం పని చేసే అమ్మాయిని అయితే నేను కాదు సర్.నాకు దేవుళ్లు అంటే ఆడియెన్స్. వాళ్లు చూసుకుంటారు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటేనే వాళ్ల వల్ల" అని తనూజ బాగా చెప్పింది. "నాగ్ సర్ విన్నర్‌ను ప్రకటించడానకి చేతులు ఎత్తారు కదా. ఆ క్షణం గుండెల్లో ఏమనిపించింది" అని శివాజీ అడిగాడు.

నా తండ్రి కూడా వస్తాడని

"టాప్ 5లో అందరి పేరంట్స్ వచ్చి కూర్చున్నారు. అమ్మ నాన్నా.. అమ్మ నాన్నా.. నా తండ్రి కూడా ఉంటారని చాలా ఆశపడ్డా. కప్‌ను తీసుకెళ్లి మా నాన్న ముందు పెట్టి ఇది నీ కూతురు. ప్రొఫెషన్ మారినంత మాత్రాన నీ కూతురు మారదు. ఎక్కడికి వెళ్లిన ఎక్కడ ఉన్న కూడా ఫ్యామిలీ పేరు నిలబెడతది" అని చాలా ఎమోషనల్‌గా చెప్పింది తనూజ గౌడ.

చచ్చేదాకా నా పేరు పక్కన ఉండాలని

"చాలా మంది అనుకుంటారు సర్ తనూజ పుట్టస్వామి అంటే నా ఇంటి పేరు అని. ఆయన (తనూజ తండ్రి) మీద ప్రేమ ఉంది కాబట్టే నేను చచ్చేదాకా నా పేరు పక్కన మీ పేరు నేను ఉంచుతానని అనేసి తనూజ పుట్టస్వామి అని పెట్టుకున్నాను" అని తనూజ పుట్టస్వామి కన్నీళ్లతో చెప్పింది. దాంతో శివాజీ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. మౌనంగా తను చెప్పేది వింటూ గొప్ప భావనతో తనూజను చూస్తు ఉండిపోయాడు శివాజీ.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More