తనూజ కోసం అందుకు రెడీ అయ్యావ్, అంతా మీ గర్ల్‌ఫ్రెండ్స్, ఎక్స్‌లేగా- బిగ్ బాస్ బజ్‌లో విన్నర్ కల్యాణ్ పడాలతో శివాజీ

బిగ్ బాస్ తెలగు 9 టైటిల్ విన్నర్‌గా కల్యాణ్ పడాల నిలిచి ట్రోఫీ అందుకున్నాడు. అయితే, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తోపాటు ఫైనల్ విన్నర్‌ను బిగ్ బాస్ బజ్‌లో ఇంటర్వ్యూ చేస్తారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి హాజరైన కల్యాణ్ పడాలతో హోస్ట్ శివాజీ ముచ్చటించాడు.

Published on: Dec 22, 2025, 15:18:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ గ్రాండ్ ఫినాలేతో ముగిసిపోయింది. బిగ్ బస్ తెలుగు 9 సీజన్ టైటిల్ విన్నర్‌గా కల్యాణ్ పడాల నిలిచాడు. హోస్ట్ నాగార్జున చేతుల మీదుగా ట్రోఫీ అందుకుని విజేతగా నిలిచాడు కల్యాణ్ పడాల.

తనూజ కోసం అందుకు రెడీ అయ్యావ్, అంతా మీ గర్ల్‌ఫ్రెండ్స్, ఎక్స్‌లేగా- బిగ్ బాస్ బజ్‌లో విన్నర్ కల్యాణ్ పడాలతో శివాజీ
తనూజ కోసం అందుకు రెడీ అయ్యావ్, అంతా మీ గర్ల్‌ఫ్రెండ్స్, ఎక్స్‌లేగా- బిగ్ బాస్ బజ్‌లో విన్నర్ కల్యాణ్ పడాలతో శివాజీ

బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో

అయితే, బిగ్ బాస్ పాల్గొన్నవారంత అనంతరం బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంటారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి కల్యాణ్ పడాల హాజరయ్యాడు. హీరో, బిగ్ బాస్ శివాజీ హోస్ట్‌గా చేస్తున్న బజ్ ఇంటర్వ్యూలో కల్యాణ్ పడాల పాల్గొన్న ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.

తనను తాను చెక్కుకున్న శిల్పి

బజ్ ఇంటర్వ్యూలోకి ట్రోఫీతో ఎంట్రీ ఇచ్చాడు కల్యాణ్ పడాల. "నీ గురించి ఒకటి చెప్పాలని ఉందయ్యా.. తనను తాను చెక్కుకున్న శిల్పివీడు" అని శివాజీ అన్నాడు. "నీ గేమ్ చేంజ్ అవ్వడానికి కారణం మాత్రం దివ్య అంటే ఒప్పుకుంటావా. నీలో స్పిరిట్‌ను రగిలించింది తను" అని శివాజీ అంటే కల్యాణ్ థ్యాంక్యూ చెప్పాడు.

మీ గర్ల్‌ఫ్రెండ్, ఎక్స్‌లు

కానీ, ఫినాలేలో మాత్రం తనకు మెంటార్‌గా తనూజ గౌడ ఉందని కల్యాణ్ చెప్పుకొచ్చాడు. "హౌజ్‌లో ఏంటీ మీ చుట్టాలే కనిపిస్తారు ఏంటీ. మీ అత్తమ్మా, మీ గర్ల్‌ఫ్రెండ్, ఎక్స్‌లు" అని శివాజీ అడిగితే.. కల్యాణ్ సిగ్గు పడుతూ, నవ్వుతూ దండం పెట్టాడు. "నాకు కాదు వాళ్లు అడుగుతున్నారు. వాళ్లకు చెప్పు" అని శివాజీ అన్నాడు.

ఏం ఫీలింగ్ లేదా

"తనూజ కోసం ఏంటీ నామినేషన్స్‌లోకి వెళ్లిపోడానికి రెడీ అయ్యావ్. అవును, నీ ఫ్రెండ్ ఓ 15 తీసుకెళ్లాడే. ఏం ఫీలింగ్ లేదా. ఇద్దరు కలిసి బాగా పంచుకున్నారు అయితే. అగ్నీ పరీక్షకు వచ్చి ఇద్దరు పంచేసుకున్నారన్న మాట" అని డిమాన్ పవన్ గురించి శివాజీ అన్నాడు.

గ్రేట్ యాక్టర్ అనిపించుకోవాలి

"వాడు మిడిల్ క్లాసే" అని కల్యాణ్ అన్నాడు. "ఎలాంటి సినిమాలు చేద్దామనుకుంటున్నావ్" అని శివాజీ అడిగితే.. "స్టార్ హీరో అవన్నీ కాకుండా నాకు గ్రేట్ యాక్టర్ కావాలని ఉంది. అసలు నేను ఎవడిని సర్ నాలుగు నెలలకు ముందు. నేను ఎవరో మా ఊళ్లో కూడా తెలియదు. అలాంటిది నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి రుణపడి ఉంటాను సర్" అని కల్యాణ్ చేతులెత్తి మొక్కి చెప్పాడు.

కేక్ కటింగ్‌తో

తర్వాత కల్యాణ్ పడాలతో కేక్ కటింగ్ చేయించాడు శివాజీ. ఇలా చాలా ఎంటర్టైనింగ్‌గా శివాజీతో కల్యాణ్ పడాల బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ ప్రోమో సాగింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More