బిగ్ బాస్ విజేతగా కల్యాణ్ పడాల- ప్రైజ్ మనీతోపాటు ఖరీదైన కారు గిఫ్ట్- రెమ్యూనరేషన్‌తో కలిపి వచ్చిన సంపాదన ఇదే!

ఉత్కంఠభరితంగా సాగిన బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లో సామాన్యుడిగా అడుగుపెట్టిన కల్యాణ్ పడాల టైటిల్ విజేతగా నిలిచాడు. రూ. 35 లక్షల బిగ్ బాస్ నగదు బహుమతితో పాటు లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. ఈ రెండింటితోపాటు రెమ్యూనరేషన్‌ను కలుపుకుని కల్యాణ్ పడాల బిగ్ బాస్ ద్వారా సంపాదించింది ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.

Dec 21, 2025, 23:05:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్-9' గ్రాండ్ ఫినాలే ఆదివారం (డిసెంబర్ 21) రాత్రి అట్టహాసంగా ముగిసింది. గత 15 వారాలుగా కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ఈ షో విజేతగా సామాన్య కంటెస్టెంట్, మాజీ సైనికుడు కల్యాణ్ పడాల నిలిచాడు.

బిగ్ బాస్ విజేతగా కల్యాణ్ పడాల- ప్రైజ్ మనీతోపాటు ఖరీదైన కారు గిఫ్ట్- రెమ్యూనరేషన్‌తో కలిపి వచ్చిన సంపాదన ఇదే!
బిగ్ బాస్ విజేతగా కల్యాణ్ పడాల- ప్రైజ్ మనీతోపాటు ఖరీదైన కారు గిఫ్ట్- రెమ్యూనరేషన్‌తో కలిపి వచ్చిన సంపాదన ఇదే!

టైటిల్ విజేతగా

ఆరంభంలో అంచనాలు లేకపోయినా, తనదైన శైలిలో ఆడుతూ 'మొదటి ఫైనలిస్ట్'గా రికార్డు సృష్టించిన కల్యాణ్ చివరికి టైటిల్ ఎగరేసుకుపోయి 'జై జవాన్' అనిపించుకున్నారు. రన్నరప్‌గా సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి నిలిచింది.

సూట్‌కేస్ ట్విస్ట్!

టాప్-3 కంటెస్టెంట్లుగా కల్యాణ్ పడాల, తనూజ, డీమాన్ పవన్ మిగిలిన సమయంలో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మాస్ మహారాజా రవితేజ హౌస్‌లోకి అడుగుపెట్టి రూ. 15 లక్షల సూట్‌కేస్ ఆఫర్ ప్రకటించారు. చాలా సేపు ఆలోచించిన తర్వాత డిమాన్ పవన్ ఆ మొత్తాన్ని తీసుకుని రేసు నుంచి తప్పుకున్నాడు.

దీనివల్ల విజేతకు దక్కాల్సిన రూ. 50 లక్షల ప్రైజ్ మనీ నుంచు 15 లక్షలు పోగా రూ. 35 లక్షలు మిగిలాయి. అంటే టైటిల్ విజేతకు ప్రైజ్ మనీగా రూ. 35 లక్షలు మాత్రమే వచ్చాయన్నమాట.

కల్యాణ్ పడాల అందుకున్న బహుమతులు ఇవే:

విజేతగా నిలిచిన కల్యాణ్ పడాలకు హోస్ట్ నాగార్జున ట్రోఫీతో పాటు భారీ బహుమతులను అందజేశారు.

నగదు బహుమతి: రూ. 35 లక్షలు (సూట్‌కేస్ ఆఫర్ పోను).

లగ్జరీ కారు: మారుతి సుజుకి వెక్టోరిస్ (Maruti Suzuki Vectoris).

అదనపు బోనస్: రాఫ్ టైల్స్ వారి నుంచి మరో రూ. 5 లక్షల నగదు.

కల్యాణ్ పడాల రెమ్యూనరేషన్

బిగ్ బాస్ హౌజ్‌లో పాల్గొన్నందుకు కల్యాణ్ పడాలకు రోజుకు రూ. 10 వేల పారితోషికం ఇచ్చారు. అంటే, అందరిలాగే వారానికి రూ. 70 వేల రెమ్యూనరేషన్. ఈ లెక్కన 15 వారాలకు రూ. 10 లక్షల 50 వేలు బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు సంపాదించాడు కల్యాణ్ పడాల.

కారు ధర

బిగ్ బాస్ ప్రైజ్ మనీ, రెమ్యూనరేషన్‌తో కలిపి రూ. 45 లక్షల 50 వేలు అవుతుంది. మారుతి సుజుకి వెక్టోరిస్ ధర సుమారుగా రూ. 10 నుంచి 20 లక్షల మధ్య ఉంటుంది. దాంతోపాటు రాఫ్ టైల్స్ వారి నుంచి రూ. 5 లక్షల నగదు కూడా కల్యాణ్ పడాలకు అందింది.

కల్యాణ్ పడాల సంపాదన

ఇవన్నీ లెక్కేస్తే బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ద్వారా కల్యాణ్ పడాల సుమారుగా రూ. 60 నుంచి 70 లక్షల వరకు సంపాదించినట్లు సమాచారం. ఆర్మీ జవాన్‌గా సేవలు అందించి, కామనర్‌గా బిగ్ బాస్‌లోకి అడుగుపెట్ట ఈ రేంజ్‌లో పేరు, మనీ సంపాదించడం కల్యాణ్ పడాలకే దక్కిందని అభిమానులు పొగుడుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More