ఓటీటీలో మాస్ జాతర.. రవితేజ 75వ సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. శ్రీలీల అందం.. కలెక్షన్లలో చెత్త రికార్డు
మాస్ మహారాజ రవితేజ మరోసారి పోలీస్ గెటప్ లో కనిపించిన సినిమా ‘మాస్ జాతర’. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఇవాళ ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ విశేషాలపై ఓ లుక్కేయండి.
రీసెంట్ గా తెలుగులో వచ్చిన సినిమాల్లో భారీ డిజాస్టర్ గా నిలిచిన సినిమాల్లో ‘మాస్ జాతర’ ఒకటి. రవితేజ హీరోగా వచ్చిన ఈ కాప్ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో దారుణమైన ప్రదర్శన చేసింది. రొటీన్ స్టోరీతో ఆడియన్స్ ను తీవ్రంగా డిసప్పాయింట్ చేసింది. కలెక్షన్లలో చెత్త రికార్డునూ ఖాతాలో వేసుకుంది. ఇవాళ (నవంబర్ 28) ఈ మూవీ ఓటీటీలో రిలీజైంది.

మాస్ జాతర ఓటీటీ
రవితేజ, శ్రీలీల జంటగా నటించిన పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ మాస్ జాతర మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (నవంబర్ 28) నుంచి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది ఈ సినిమా. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమాను చూడొచ్చు.
75వ సినిమా
మాస్ జాతర ఓటీటీ రిలీజ్ సందర్భంగా ఓ సారి ఈ మూవీ విశేషాలపై ఓ లుక్కేద్దాం. రవితేజ కెరీర్ లో ఇది 75వ సినిమా. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసి, ఏ సపోర్ట్ లేకుండా హీరోగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు కెరీర్. ఆయన కెరీర్ లో మాస్ జాతరకు స్పెషల్ ప్లేస్ ఉంది. ఇది ఆయనకు 75వ సినిమాగా నిలిచిపోయింది.
రవితేజ, శ్రీలీల
రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో ఇది రెండో మూవీ. 2022లో వచ్చిన ధమాకా సినిమా కోసం వీళ్లు ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో మాస్ జాతర కోసం మళ్లీ జతకట్టారు. కానీ మాస్ జాతర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది.
డెబ్యూ డైరెక్టర్
మాస్ జాతర మూవీకి డైరెక్టర్ భాను భోగవరపు. అతనికి దర్శకుడిగా ఇదే ఫస్ట్ మూవీ. కథ కూడా భానుదే. మాస్ జాతర మూవీతో రవితేజ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వాలనుకున్న భానుకు రిజల్ట్ మాత్రం నెగెటివ్ గా వచ్చింది. ఈ మూవీకి ఫస్ట్ నుంచే నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి.
కలెక్షన్ల రికార్డు
కలెక్షన్ల పరంగా మాస్ జాతర చెత్త రికార్డు సొంతం చేసుకుంది. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ఈ మూవీ దారుణమైన రిజల్ట్ అందుకుంది. రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ డే ఇండియాలో కనీసం ఒక కోటి రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది. చివరికి ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. ఇది అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


