వామ్మో యాడ్‌కు రూ.150 కోట్లు-రణ్‌వీర్, శ్రీలీల జోడీ-జవాన్ రేంజ్‌లో అట్లీ యాక్షన్-ఆ మూవీస్ కంటే ఎక్కువ బడ్జెట్-ఫస్ట్ లుక్
ప్రముఖ కంపెనీలన్నీ సెలబ్రిటీలతో యాడ్స్ చేయించి బిజినెస్ పెంచుకోవాలని చూస్తాయి. కానీ ఓ కంపెనీ మాత్రం యాడ్ కోసం ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ పెట్టింది. రణ్‌వీర్, శ్రీలీల, బాబీ డియోల్ నటించిన ఈ యాడ్ సండే రిలీజ్ కానుంది. కొన్ని సినిమాలకంటే ఈ యాడ్ బడ్జెట్ ఎక్కువ కావడం గమనార్హం.
నటుడు రణ్‌వీర్ సింగ్ మళ్లీ యాక్షన్ అవతార్‌లో కనిపించారు. అయితే ఇది అతని రాబోయే సినిమా 'ధురంధర్' గురించి కాదు. ఫుడ్ బ్రాండ్ 'చింగ్స్' కోసం తాను నటించిన కొత్త యాడ్ చిన్న టీజర్‌ను ఆయన పంచుకున్నారు. ఈ యాడ్ బడ్జెట్ వింటే వామ్మో అనాల్సిందే.

రూ.150 కోట్లు
రణ్‌వీర్, శ్రీలీల, బాబీ డియోల్ కలిసి నటించిన చింగ్స్ యాడ్ బడ్జెట్ ఏకంగా రూ.150 కోట్లు. అవును.. ఇది నిజం. చాలా సినిమాలకంటే ఈ యాడ్ బడ్జెట్ ఎక్కువ కావడం గమనార్హం. ఇందులో రణ్‌వీర్ స్పై ఏజెంట్‌గా నటించారు. శ్రీలీల హీరోయిన్‌గా, బాబీ డియోల్ విలన్ ప్రొఫెసర్‌గా నటించారు. అట్లీ తన చివరి హిట్ మూవీ 'జవాన్' (2023) శైలిలోనే ఈ యాడ్‌కు దర్శకత్వం వహించారు. పూర్తి యాడ్ అక్టోబర్ 19, ఆదివారం విడుదల అవుతుంది.
అతి పెద్ద యాడ్
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. “అట్లీ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్, బాబీ డియోల్, శ్రీలీల నటించిన చింగ్స్ దేశీ చైనీస్ యాడ్ క్యాంపెయిన్‌ను సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్, ప్రముఖ తారలతో రూపొందుతున్న ఈ యాడ్ ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద యాడ్ క్యాంపెయిన్‌లలో ఒకటిగా నిలుస్తుంది” అని తెలిసింది.
ఆ సినిమాల కంటే ఎక్కువ
సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ యాడ్ ఇటీవల వచ్చిన పలు బాలీవుడ్ సినిమాల నిర్మాణ వ్యయాన్ని మించిపోయిందని సమాచారం. ఉదాహరణకు విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' సినిమాను రూ.130 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ బయోగ్రాఫికల్ డ్రామా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి భారతదేశంలో రూ.600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ యాడ్ బడ్జెట్ 'రైడ్ 2' (రూ.120 కోట్లు), 'స్త్రీ 2' (రూ.60 కోట్లు), 'సైయారా' (రూ.45 కోట్లు) వంటి సూపర్ హిట్ సినిమాలను కూడా మించిపోయింది.
ఈ యాడ్స్ లో
రణ్‌వీర్ సింగ్ గతంలో కూడా చింగ్స్ దేశీ చైనీస్ కోసం పలు వాణిజ్య ప్రకటనలలో కనిపించారు. వాటిలో రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఓ షార్ట్ ఫిల్మ్ కూడా ఉంది. అతను తమన్నా భాటియాతో కలిసి ఓ ఇన్‌స్టంట్ నూడుల్స్ యాడ్‌లో కూడా నటించారు. ఇక సినిమాల విషయానికొస్తే రణ్‌వీర్ తదుపరి ఆదిత్య ధర్ దర్శకత్వంలో 'ధురంధర్' చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కూడా నటిస్తున్నారు.
అక్టోబర్ 16న విడుదలైన టైటిల్ ట్రాక్ లిరికల్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. 'ధురంధర్' డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. రణ్‌వీర్ చివరిగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన 'సింగం ఎగైన్'లో కనిపించారు. ఇందులో అజయ్ దేవగన్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, దీపికా పదుకొణె, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్ కూడా నటించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


