తమన్నాది మిల్కీ బాడీ.. ఆమెను చూసే 70 ఏళ్ల చిన్న పిల్లలు కూడా ఉంటారు: నటుడి కామెంట్స్‌పై ఫ్యాన్స్ మండిపాటు

తమన్నా శరీరంపై సీనియర్ నటుడు అన్నూ కపూర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ అతనికి క్లాస్ పీకుతున్నారు. కాస్త గౌరవం ఇవ్వు అని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

Oct 13, 2025, 22:03:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నటుడు అన్నూ కపూర్.. సినీ నటి తమన్నా భాటియాపై చేసిన కామెంట్స్ మళ్లీ వివాదానికి దారి తీశాయి. తమన్నాను "దుధియా బదన్" (పాలలాంటి శరీరం) అని అనడం, ఆమె హిట్ సాంగ్ 'ఆజ్ కీ రాత్' గురించి చేసిన వ్యాఖ్యలపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అన్నూ కపూర్ వేసిన జోకులు సోషల్ మీడియాలో విమర్శలకు గురయ్యాయి. అతని కామెంట్స్ "అశ్లీలం"గా ఉన్నాయని నెటిజన్లు తీవ్రంగా ఖండించారు.

తమన్నాది మిల్కీ బాడీ.. ఆమెను చూసే 70 ఏళ్ల చిన్న పిల్లలు కూడా ఉంటారు: నటుడి కామెంట్స్‌పై ఫ్యాన్స్ మండిపాటు
తమన్నాది మిల్కీ బాడీ.. ఆమెను చూసే 70 ఏళ్ల చిన్న పిల్లలు కూడా ఉంటారు: నటుడి కామెంట్స్‌పై ఫ్యాన్స్ మండిపాటు

అన్నూ కపూర్ ఏమన్నాడంటే?

బాలీవుడ్ నటుడు అన్నూ కపూర్ ఇటీవల శుభాంకర్ మిశ్రాతో ఆయన యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా గురించి మాట్లాడారు. ఈ సంభాషణలో, 'ఆజ్ కీ రాత్' పాట క్లిప్‌ను తాను చూసినట్లు అన్నూ కపూర్ చెప్పగా.. దానికి హోస్ట్ ఆ పాట నచ్చిందా.. తమన్నాను ఆరాధిస్తారా అని అడిగారు.

దీనికి ఉత్సాహంగా స్పందించిన అన్నూ కపూర్.. "ఓహ్ మై గాడ్, ఆమెకు ఎంతటి పాల వంటి శరీరం ఉందో" అని అన్నాడు. ఈ కామెంట్ తో హోస్ట్.. తమన్నా తన హిట్ పాట 'ఆజ్ కీ రాత్' వింటూ పిల్లలు నిద్రపోతారని చేసిన కామెంట్ ను ప్రస్తావించారు.

అప్పుడు అన్నూ కపూర్ ఇలా జోక్ చేశాడు. "ఎంత వయసున్న పిల్లలు నిద్రపోతారు.. 70 ఏళ్ల వయసున్న వ్యక్తి కూడా పిల్లవాడు కావచ్చు కదా.. నేను ఉంటే ఎంత వయసున్న పిల్లలు నిద్రపోతారని అడిగేవాడిని. ఇంగ్లిష్ లో అతనికి 70 ఏళ్లు అని అంటారు, కానీ అతను 70 ఏళ్ల పిల్లాడు.. అతను 11 ఏళ్ల ముసలివాడు" అని అన్నాడు.

అన్నూ కపూర్ ఇంకా ఏమన్నాడంటే?

"సోదరీ.. నీ పాటతో, నీ శరీరంతో, నీ పాల వంటి ముఖంతో మా పిల్లలను నిద్రపుచ్చుతున్నావు.. అది చాలా మంచి విషయం. మా దేశంలోని పిల్లలు మంచి, ఆరోగ్యకరమైన నిద్రపోతే.. అది ఈ దేశానికి మంచి చేస్తుంది. ఆమెకు ఇంకా ఏమైనా కోరికలు ఉంటే, ఆ కోరికలను తీర్చుకునే సామర్థ్యాన్ని భగవంతుడు ఆమెకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదే నా ఆశీర్వాదం ఆమెకు" అని అన్నూ కపూర్ అన్నాడు.

సోషల్ మీడియా స్పందన

తమన్నాపై అన్నూ కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు అతని కామెంట్స్ ను అశ్లీలంగా, వయసుకు తగనివిగా అభివర్ణించారు. మర్యాదగా ఉండాలని ఆయనను చాలా మంది విమర్శించారు.

"దయచేసి గౌరవంగా ఉండండి. మీకు కూతురు లేదా మనవరాళ్లు లేరా" అని ఒకరు రాశారు. "అసహ్యం. అతను అశ్లీలం" అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. "అది ఏం భాష?" అని ఒకరు ప్రశ్నించారు. "మీ సొంత కూతురితో కూడా ఇలాగే మాట్లాడుతారా" అని మరొకరు నిలదీశారు.

'మిల్కీ బ్యూటీ' అని పిలవడంపై తమన్నా అభిప్రాయం

తనను మిల్కీ బ్యూటీ అని పిలవడంపై తమన్నా ఈ ఏడాది మొదట్లో స్పందించింది. పారానార్మల్ థ్రిల్లర్ 'ఓదెల 2' లో 'శివ శక్తి' పాత్రను పోషించడంపై వచ్చిన ప్రశ్నకు తమన్నా గతంలో సమాధానం ఇచ్చింది. "మీరు మిల్కీ బ్యూటీ అంటున్నారు. కానీ శివ శక్తి కాలేనని ఎందుకు అనుకుంటున్నారు? మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. అతను (దర్శకుడు అశోక్ తేజ) మిల్కీ బ్యూటీని చూసి సిగ్గుపడాల్సిన లేదా బాధపడాల్సిన అవసరం లేదని భావించారు. ఒక మహిళలోని గ్లామర్‌ను మనం ఉత్సవంగా జరుపుకోవాలి. మనం మహిళలమే మనల్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి" అని తమన్నా చెప్పింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More