అఫీషియల్.. ఓటీటీలోకి రవితేజ, శ్రీలీల మాస్ జాతర.. నవీన్ చంద్ర విలనిజం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
రవితేజ లేటెస్ట్ యాక్షన్ మూవీ మాస్ జాతర ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలో అందుబాటులో ఉంటుందో చూసేయండి.
రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘మాస్ జాతర’. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. మాస్ జాతర మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్, రిలీజ్ డేట్ వివరాలు మీ కోసం.

మాస్ జాతర ఓటీటీ డేట్
రవితేజ 75వ సినిమాగా తెరకెక్కిన మాస్ జాతర ఓటీటీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. వచ్చే శుక్రవారం అంటే నవంబర్ 28 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ లో అందుబాటులో ఉండనుంది ఈ మూవీ. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కమింగ్ ఫ్రైడే అని మాస్ జాతర అప్ డేట్ ఉంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ మాస్ జాతర ఓటీటీ ప్లే అవనుంది.
75వ సినిమా
రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా వచ్చిన మాస్ జాతర.. ఆయన కెరీర్ లోనే దారుణమైన కలెక్షన్లు సాధించిన మూవీగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. అక్టోబర్ 31, 2025న మాస్ జాతర మూవీ రిలీజైంది. దీనికి భాను భోగవరపు డైరెక్టర్. ఈ మూవీని రూ.90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. చివరకు ఈ సినిమా రూ.20 కోట్లు మాత్రమే ఖాతాలో వేసుకుంది. మాస్ జాతర సినిమాను సితారా ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
మాస్ జాతర సినిమాలో రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్రవీణ్, సముద్రఖని, వీటీవీ గణేష్, హైపర్ ఆది, మురళీ శర్మ తదితరులు నటించారు.
మాస్ జాతర కథ
మాస్ జాతర మూవీ ఓ నిజాయతీ కలిగిన రైల్వే పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. లక్ష్మణ్ భేరి (రవితేజ) ఓ సిన్సియర్ రైల్వే పోలీస్. అన్యాయం జరుగుతుంటే తన లిమిట్స్ లో ఉందా? లేదా? అని ఆలోచించకుండా రంగంలోకి దూకేస్తుంటాడు. వరంగల్ లో ఇలాగే ఓ మంత్రి కొడుక్కి తగిన బుద్ధి చెప్తాడు. ఆ తర్వాత అడవివరం రైల్వే స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ అవుతాడు.
గంజాయి స్మగ్లింగ్
ట్రాన్స్ ఫర్ అయిన లక్ష్మణ్ భేరి అక్కడి గంజాయి స్మగ్లింగ్ గ్యాంగ్ ను టార్గెట్ చేసుకుంటాడు. ఆ ప్రాంతాన్ని శివుడు (నవీన్ చంద్ర) గుప్పిట్లో పెట్టుకుని రైతులతో గంజాయి పండించి, కోల్ కతాకు స్మగ్లింగ్ చేస్తుంటాడు. మరి శివుడును లక్ష్మణ్ ఎలా ఆపాడు? మధ్యలో తులసి (శ్రీలీల)తో లవ్ స్టోరీ ఏంటీ? అన్నది సినిమాలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


