ఈ వారమే ఓటీటీలోకి రవితేజ 75వ సినిమా.. థియేటర్లో డిజాస్టర్.. మాస్ జాతర స్ట్రీమింగ్ డేట్‌పై లేటెస్ట్ బజ్!
మాస్ జాతర అంటూ ఎన్నో ఆశలతో, భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ. కానీ తీవ్రమైని నిరాశ తప్పలేదు. డిజాస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ధమాకా సినిమాతో హిట్ పెయిర్ గా నిలిచింది రవితేజ-శ్రీలీల జోడీ. ఈ జంట మరోసారి స్క్రీన్ పై రొమాన్స్ చేసిన మూవీ ‘మాస్ జాతర’. వరుసగా ఫ్లాఫ్ సినిమాలతో సాగిపోతున్న రవితేజ మాస్ జాతరపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. రొటీన్ స్టోరీతో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది మాస్ జాతర.

మాస్ జాతర ఓటీటీ రిలీజ్ డేట్
రవితేజ, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ మాస్ జాతర. థియేటర్లో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో ఈ వారమే స్ట్రీమింగ్ కాబోతుందని తెలిసింది. లేటెస్ట్ బజ్ ప్రకారం మాస్ జాతర ఈ నెల 28 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుందని టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
భారీ డిజాస్టర్
రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా వచ్చిన మాస్ జాతర.. ఆయన కెరీర్ లోనే దారుణమైన కలెక్షన్లు సాధించిన మూవీగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. అక్టోబర్ 31, 2025న మాస్ జాతర మూవీ రిలీజైంది. దీనికి భాను భోగవరపు డైరెక్టర్. ఈ మూవీని రూ.90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. చివరకు ఈ సినిమా రూ.20 కోట్లు మాత్రమే ఖాతాలో వేసుకుంది. మాస్ జాతర సినిమాను సితారా ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
మాస్ జాతర సినిమాలో రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్రవీణ్, సముద్రఖని, వీటీవీ గణేష్, హైపర్ ఆది, మురళీ శర్మ తదితరులు నటించారు.
వరుస ఫ్లాప్ లు
మాస్ మహారాజ్ గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే రవితేజ కెరీర్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత రవితేజకు మరో హిట్ దక్కలేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్.. ఇలా వరుసగా ఫ్లాప్ లే ఎదురయ్యాయి. ఇప్పుడేమో మాస్ జాతర కూడా రవితేజను సక్సెస్ బాటలోకి నడిపించలేకపోయిది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని ఖాతాలో వేసుకుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


