ఓటీటీలోకి నిన్న రిలీజైన రవితేజ, శ్రీలీల మాస్ జాతర.. దారుణమైన రేటింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి మాస్ మాహారాజా రవితేజ, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల మరోసారి జంటగా నటించిన సినిమా మాస్ జాతర. రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అయిన ఈ మాస్ జాతర నిన్న థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో మాస్ జాతర ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. మరి మాస్ జాతర ఓటీటీ రిలీజ్ ఎక్కడో చూద్దాం.

Published on: Nov 1, 2025, 20:25:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాస్ మహారాజా రవితేజ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆయన సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అయితే, గత కొంతకాలంగా రవితేజ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి. కానీ, వచ్చే ప్రతి సినిమాకు మంచి హైప్ మాత్రం వస్తుంది.

ఓటీటీలోకి నిన్న రిలీజైన రవితేజ, శ్రీలీల మాస్ జాతర.. దారుణమైన రేటింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన రవితేజ, శ్రీలీల మాస్ జాతర.. దారుణమైన రేటింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ధమాకా హిట్ తర్వాత

రవితేజ నటించిన లేటెస్ట్ తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీనే మాస్ జాతర. ఈ సినిమాలో హీరోయిన్‌గా డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల చేసింది. ధమాకా హిట్ తర్వాత రవితేజ, శ్రీలీల కలిసి నటించిన రెండో సినిమా ఇది. దీంతో ఈ మూవీపై భారీ బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహించారు.

డైరెక్టర్‌గా డెబ్యూ ఎంట్రీ

తెలుగులో పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు మాస్ జాతర సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా మాస్ జాతర సినిమాను నిర్మించారు.

అక్టోబర్ 31న రిలీజ్

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన మాస్ జాతర సినిమాలో హీరో హీరోయిన్లతోపాటు నవీన్ చంద్ర, రాజేంద్రప్రసాద్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సాంగ్స్, టీజర్, ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న మాస్ జాతర నిన్న (అక్టోబర్ 31) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

రవితేజ ఐకానిక్ సీన్స్

అయితే, మాస్ జాతర సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. మిశ్రమంగానే రివ్యూస్ చెప్పారు. మాస్ జాతర రొటీన్ స్టోరీ లైన్‌తో, అంతగా ఆకట్టుకోలేని మ్యూజిక్, యాక్షన్ సీక్వెన్స్‌తో సాగుతుందని రివ్యూలలో తెలిపారు. కానీ, రవితేజ ఐకానిక్ హిట్ సినిమాల్లోని సీన్స్‌ను రెఫరెన్స్‌గా తీసుకుని చేసిన కామెడీ బాగుందని టాక్ వచ్చింది.

ఐఎమ్‌డీబీ రేటింగ్

అలాగే, రవితేజ కామెడీ టైమింగ్ బాగుందని, డైలాగ్స్ కూడా బాగున్నాయని సమాచారం. విలన్‌గా చేసిన నవీన్ చంద్ర యాక్టింగ్ బాగుందని ప్రశంసలు వచ్చాయి. ఇలాంటి రెస్పాన్స్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన మాస్ జాతర సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 5.1 రేటింగ్ వచ్చింది.

మాస్ జాతర ఓటీటీ

సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ అయిన కొన్ని రోజులకు రేటింగ్ పడిపోతుంటుంది. కానీ, మాస్ జాతర సినిమాకు తొలిరోజునే ఇలా దారుణమైన రేటింగ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మాస్ జాతర ఓటీటీ స్ట్రీమింగ్‌పై బజ్ క్రియేట్ అయింది. మాస్ జాతర ఓటీటీ రైట్స్‌ను దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.

కలెక్షన్స్, టాక్‌ను బట్టి

కాబట్టి, నెట్‌ఫ్లిక్స్‌లోనే మాస్ జాతర ఓటీటీ రిలీజ్ కానుంది. కాకపోతే, ఆడియెన్స్ రెస్పాన్స్, బాక్సాఫీస్ కలెక్షన్లను బట్టి మాస్ జాతర ఓటీటీ స్ట్రీమింగ్ ఆధారపడి ఉంటుంది. సుమారుగా 4 వారాల తర్వాత లేదా అంతకుముందే మాస్ జాతర ఓటీటీ ప్రీమియర్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More