ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే తెలుగులో వచ్చిన 5 సినిమాలు- 850 కోట్ల బ్లాక్ బస్టర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు- ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా తెలుగు భాషలో ఐదు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో రూ. 850 కోట్లు కొల్లగొట్టిన మిస్టరీ సినిమా నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు ఉన్నాయి. మరి ఈ ఐదు సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 31, 2025, 20:19:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఇవాళ (అక్టోబర్ 31) ఒక్కరోజు సుమారుగా 20 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో తెలుగు భాషలో ఐదు వరకు మూవీస్ ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే తెలుగులో వచ్చిన 5 సినిమాలు- 850 కోట్ల బ్లాక్ బస్టర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే తెలుగులో వచ్చిన 5 సినిమాలు- 850 కోట్ల బ్లాక్ బస్టర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు- ఇక్కడ చూసేయండి!

కాంతార చాప్టర్ 1 ఓటీటీ

కన్నడ ఇండస్ట్రీలో రిలీజ్ అయి దేశవ్యాప్తంగా పాకి సూపర్ హిట్ అయిన సినిమా కాంతార. ఆ మూవీకి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన సినిమానే కాంతార చాప్టర్ 1. పీరియాడిక్ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 మూవీకి హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి మెయిన్ లీడ్ రోల్ చేశాడు.

రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరాం తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించిన కాంతార చాప్టర్ 1 సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఘన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 852 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది రికార్డులు క్రియేట్ చేసింది.

అలాంటి కాంతార చాప్టర్ 1 ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ అయింది. కన్నడతోపాటు తెలుగు, మలయాళం, తమిళం వంటి నాలుగు భాషల్లో కాంతార 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు ఓటీటీ

తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ తెలుగు ఓటీటీ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయభాను మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. తప్పిపోయిన కూతురు కోసం తండ్రి చేసే అన్వేషణ చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది.

జీ5లో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జీ5 ఒరిజినల్ సిరీస్‌గా రూపొందిన డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది.

జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి

సీనియర్ హీరో, నటుడు జగపతి బాబు హోస్ట్‌గా మారిన సెలబ్రిటీ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా. ప్రతి వారం సరికొత్త ఎపిసోడ్‌తో అలరించి ఈ టాక్ షో ఇవాళ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో జయమ్ము నిశ్చయమ్మురా ఓటీటీ రిలీజ్ అయింది. నేటి ఎపిసోడ్‌కు మ్యూజిక్ రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ గెస్టుగా హాజరయ్యారు.

రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్ ఓటీటీ

హిందీ భాషలో తెరకెక్కిన లేటెస్ట్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్. బిహార్‌లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ ఓటీటీ సిరీస్ కూడా జీ5లోనే స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో తెలుగు, తమిళం, హిందీ వంటి మూడు భాషల్లో రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

కొత్త లోక చాప్టర్ 1 చంద్ర ఓటీటీ

ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన సూపర్ హీరో యాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా కొత్త లోక చాప్టర్ 1 చంద్ర. కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ కె గఫూర్ నటించిన కొత్త లోక జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ, మరాఠీ వంటి ఆరు భాషల్లో హాట్‌స్టార్‌లో కొత్త లోక ఓటీటీ రిలీజ్ అయింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More