నెట్‌ఫ్లిక్స్‌లోకి రెండు రోజుల్లో నాలుగు భాషల్లో మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్.. తెలుగు డిజాస్టర్ కూడా..
నెట్‌ఫ్లిక్స్ లోకి రెండు రోజుల్లో నాలుగు సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అవి కూడా నాలుగు భాషలకు చెందినవి కావడం విశేషం. తెలుగు నుంచి రవితేజ డిజాస్టర్ మూవీ మాస్ జాతర కూడా ఈ లిస్టులో ఉంది.
నెట్‌ఫ్లిక్స్ లోకి ఈవారం రెండు రోజుల వ్యవధిలోనే నాలుగు భాషల్లో మూడు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం. ఈ గురు, శుక్రవారాల్లో ఇవి రాబోతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో వస్తున్న ఈ మూవీస్, సిరీస్ గురించి తెలుసుకుందాం.

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1
నెట్‌ఫ్లిక్స్ పాపులర్ వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 గురువారం (నవంబర్ 27) స్ట్రీమింగ్ కానుంది. ఈ కొత్త సీజన్ తొలి వాల్యూమ్ అందుబాటులోకి రానుంది. ఇందులో నాలుగు ఎపిసోడ్లు ఉంటాయి. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతాయి. ఉదయం 6.30 గంటలకు ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ మొదలవుతుంది.
సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి
జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ నటించిన హిందీ మూవీ సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి. ఈ సినిమా కూడా గురువారమే స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ విషయాన్ని బుధవారం (నవంబర్ 26) ఆ ఓటీటీ వెల్లడించింది. ముహూర్తం ఫిక్సయింది అనే క్యాప్షన్ తో ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ట్వీట్ చేసింది.
మాస్ జాతర
రవితేజ డిజాస్టర్ మూవీ మాస్ జాతర శుక్రవారం (నవంబర్ 28) డిజిటల్ ప్రీమియర్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ మాస్ హీరోకి మరో చేదు అనుభవాన్ని మిగిల్చిన సినిమా ఇది. అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. ఇందులో శ్రీలీల కూడా నటించగా.. భాను భోగవరపు డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా తెలుగుతోపాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుండటంతో ఓటీటీలో మెరుగైన రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.
ఆర్యన్
తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆర్యన్. విష్ణు విశాల్ నటించి, ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా కూడా శుక్రవారం (నవంబర్ 28) స్ట్రీమింగ్ కు వస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. మరి నెట్‌ఫ్లిక్స్ లో ఏం చేస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


