న్యూ నేషనల్ క్రష్‌గా గిరిజా ఓక్- యూట్యూబ్ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్లు- ఎలా చేయాలో చెప్పేవారంటూ కాంతార నటుడు!
సోషల్ మీడియాలో ఇటీవల న్యూ నేషనల్ క్రష్‌గా మారింది బ్యూటిపుల్ గిరిజా ఓక్. అయితే, ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ వెబ్ సిరీస్‌లో గిరిజా ఓక్‌తో చేసిన ఇంటిమేట్ సీన్ల గురించి కాంతార చాప్టర్ 1 నటుడు గుల్షన్ దేవయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఒక్క ఇంటర్వ్యూతో ట్రెండింగ్‌లోకి వచ్చిన ముద్దుగుమ్మ గిరిజా ఓక్. గతంలో హీరోయిన్‌గా అట్రాక్ట్ చేసిన గిరిజా ఓక్‌కు ఇప్పుడు అంతకంటే ఎక్కువ క్రేజ్ వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో స్లీవ్‌లెస్ బ్లౌజ్, చీరలో, బ్లూ శారీ ఫొటోల్లో గిరిజా ఓక్‌ను చూసిన నెటిజన్స్ ఆమె అందానికి ఫిదా అయిపోయారు.

న్యూ నేషనల్ క్రష్‌గా
సోషల్ మీడియాలో న్యూ నేషనల్ క్రష్‌గా గిరిజా ఓక్ ట్రెండ్ అయింది. అయితే, గిరిజా ఓక్‌తో చేసిన ఇంటిమేట్ సీన్ల గురించి కాంతార చాప్టర్ 1 నటుడు గుల్షన్ దేవయ్య చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం డ్రామా సిరీస్‌లలో ట్రెండింగ్‌లో ఉన్న వెబ్ సిరీస్ 'పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ'. మనోజ్ పహ్వా, సీమా పహ్వా, గుల్షన్ దేవయ్య, గిరిజా ఓక్, కావేరి సేథ్, నేహా ధూపియా, హిర్వ త్రివేది, రొనావ్ వాస్వానీ వంటి ప్రముఖ నటీనటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.
విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి ఈ సిరీస్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. నవంబర్ 28 నుంచి యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ సిరీస్‌కు సచిన్ పాఠక్ దర్శకత్వం వహించారు. పాలక్ భాంబ్రి క్రియేట్ చేశారు. నటుడు పంకజ్ త్రిపాఠి, జార్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు.
గిరిజాతో ఇంటిమేట్ సీన్
ఈ యూట్యూబ్ సిరీస్‌లో భార్యాభర్తలుగా నటించిన గుల్షన్ దేవయ్య, గిరిజా మధ్య ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గుల్షన్ దేవయ్య 'పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ'లో గిరిజా ఓక్‌తో కలిసి నటించిన ఇంటిమేట్ సన్నివేశం గురించి ఓపెన్ అయ్యారు.
గుల్షన్ దేవయ్య ఆ సన్నివేశం గురించి మాట్లాడుతూ.. "ఇటువంటి సన్నివేశాలలో నటించడం ఎప్పుడూ చాలా కష్టమైన పని. ఎందుకంటే, మనం దాటకూడని ఒక గీత అక్కడ ఉంటుంది. సాన్నిహిత్యాన్ని లేదా హింసను అనుకరించడం చాలా క్లిష్టంగా ఉంటుంది. ఆ హద్దులు దాటకుండానే.. ఆ సన్నివేశం నిజమైన అనుభూతిని కలిగిస్తున్నట్లు భ్రమ కలిగించాలి. కాబట్టి, ఆ దృశ్యాన్ని చాలా బాధ్యతాయుతంగా చిత్రీకరించడానికి మార్గాలు అన్వేషించాలి" అని ఐఏఎన్‌ఎస్‌తో అన్నారు.
ఎలా చేయాలో చెప్పేవారు
ఇలాంటి సన్నివేశాల కోసం ఈ రోజుల్లో 'ఇంటీమసీ కో ఆర్డినేటర్లు' (Intimacy Coordinators) కూడా అందుబాటులో ఉంటున్నారని గుల్షన్ వివరించారు. అంటే షూటింగ్ సమయంలో ఇంటిమేట్ సీన్ ఎలా చేయాలి, ఎలా స్పందించాలి అని పక్కన ఉండి ఆ కో ఆర్డినేటర్స్ చెబుతుంటారని దేవయ్య అన్నారు.
"కొన్నిసార్లు ఇంటీమసీ కో ఆర్డినేటర్లు ఉంటారు. ఉదాహరణకు 'ఉల్జా' (Ulajh) సినిమాకు యూకేకు చెందిన ఒక కోఆర్డినేటర్ ఉన్నారు. ఆ ప్రక్రియలో ఆమె ప్రతి అడుగులోనూ మాకు మార్గ నిర్దేశం చేసి అందరూ సౌకర్యంగా ఉండేలా చూసుకున్నారు. కానీ ఆ సన్నివేశాల్లో మూడు వంతులు కత్తిరించారు. ఫైనల్ వెర్షన్‌లో పెద్దగా ఏమీ మిగల్లేదు. కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది" అని గుల్షన్ దేవయ్య తన అనుభవాన్ని పంచుకున్నారు.
పాత రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేది?
"కాలక్రమేణా, ఇటువంటి సన్నివేశాలలో నటించడంలో నాకు మరింత అనుభవం వచ్చింది. 2012లో మేము 'హేట్ స్టోరీ' (Hate Story) షూటింగ్ చేస్తున్నప్పుడు, మాకు సహాయం చేయడానికి ఇంటీమసీ కోఆర్డినేటర్లు వంటివారు ఎవరూ ఉండేవారు కాదు" అని గుల్షన్ దేవయ్య తెలిపారు.
"అప్పుడు మేము అన్ని విషయాలను సొంతంగానే తెలుసుకోవాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ, నేను పాయోలీ దామ్‌తో కలిసి పనిచేశాను. ఆమె ఎంతో సహకరించారు. షూటింగ్ అంతా నేను సౌకర్యంగా ఉండేలా చూసుకున్నారు" అని గుల్షన్ దేవయ్య పాత రోజులను గుర్తు చేసుకున్నారు.
కాంతార చాప్టర్ 1లో గుల్షన్
ఇదిలా ఉంటే, 'పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ'కి ముందు గుల్షన్ దేవయ్య దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన 'కాంతారా చాప్టర్ 1'లో కనిపించారు. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఆ పౌరాణిక యాక్షన్ డ్రామా చిత్రంలో గుల్షన్ దుష్ట రాజు కులశేఖర పాత్ర పోషించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


