ఒక్క రోజులోనే ఓటీటీ ట్రెండింగ్‌ నంబర్‌వ‌న్‌గా త‌మిళ థ్రిల్ల‌ర్‌- అదిరే ట్విస్ట్- తెలుగులోనూ స్ట్రీమింగ్‌- ఓ లుక్కేయండి

ఓటీటీలోకి వచ్చిన ఒక్క రోజులోనే తమిళ థ్రిల్లర్ మూవీ ట్రెండింగ్ నంబర్ వన్ ప్లేస్ లోకి దూసుకొచ్చింది. ఓటీటీలో ఈ మూవీకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను మీరు చూశారా? 

Published on: Nov 22, 2025, 19:01:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ థ్రిల్లర్ మూవీ ‘డీజిల్’ ఓటీటీలో అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఒక్క రోజులోనే ఈ సినిమా ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. డీజిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీ ట్రెండింగ్ లో తమిళ థ్రిల్లర్
ఓటీటీ ట్రెండింగ్ లో తమిళ థ్రిల్లర్

డీజిల్ ఓటీటీ

తమిళ యాక్షన్ థ్రిల్లర్ డీజిల్ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ సత్తాచాటుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 21న అడుగుపెట్టింది ఈ మూవీ. ఒక్క రోజులోనే ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది డీజిల్ చిత్రం.

తెలుగులోనూ

తమిళ మూవీ డీజిల్ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అంతే కాకుండా ఈ మూవీ ఒకే రోజు నాలుగు ఓటీటీల్లో రిలీజ్ కావడం విశేషం. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్ట్స్, సింప్లీ సౌత్, ఆహా తమిళ్ ఓటీటీల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో డీజిల్ సినిమా ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో హరీష్ కల్యాణ్, అతుల్యా రవి, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు.

డీజిల్ కథ ఏమిటంటే?

చేపలు పట్టే తమ పనికి అడ్డంకిగా మారిన చమురు పైప్ లైన్ నే ఉపాధిగా మార్చుకునే గ్రామాల్లోని ప్రజల కథ డీజిల్. చెన్నై సముద్ర తీరంలో డీజిల్ మూవీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. 1979లో సముద్ర తీరంలో 17 కిలోమీటర్ల మేర ప్రభుత్వం ఒక పైప్ లైన్ ఏర్పాటు చేస్తుంది. సముద్రంలోని క్రూడ్ ఆయిల్ ను సరఫరా చేసే పైప్ లైన్ ఇది. అయితే ఈ పైప్ లైన్ కారణంగా జాలరులు చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లలేని పరిస్థితి తలెత్తుతుంది.

క్రూడ్ ఆయిల్ దొంగతనం

క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ కారణంగా చేపలు పట్టడానికి ఛాన్స్ లేకుండా పోయిందని ప్రజలు పోరాడతాడు. ఈ పోరాటంలోనే ఢిల్లీ బాబు ప్రాణాలు కోల్పోతాడు. అతని కొడుకు వాసుదేవ (హరీష్ కల్యాణ్) అనాథ అవుతాడు. అతణ్ని మనోహర్ (సాయి కుమార్) చేరదీస్తాడు. క్రూడ్ ఆయిల్ ను దొంగతనం చేసి, ముంబయిలోని గ్యాంగ్ కు అమ్మాలని మనోహర్ నిర్ణయం తీసుకుంటాడు.

ఈ ఆయిల్ దొంగతనంతో గ్రామాలను ఆదుకుంటాడు మనోహర్. వాసుదేవ కూడా ఇదే పని చేస్తూ డీజిల్ వాసుగా పేరు తెచ్చుకుంటాడు. కానీ ఆ తర్వాతే ఓ ట్విస్ట్ కథను మలుపు తిప్పుతుంది. విలన్ అత్యాశను హీరో ఎలా తిప్పికొట్టాడు? తన ప్రజలను ఎలా ఎదుర్కొన్నాడన్నది మిగతా కథ.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More