ఓటీటీలో కడుపుబ్బా నవ్వించే బెస్ట్ 6 తెలుగు కామెడీ సినిమాలు- ఒకేదాంట్లో ఏకంగా 4 స్ట్రీమింగ్- ఎక్కడెక్కడ చూడాలంటే?
ఓటీటీలో హాయిగా నవ్వుకునేందుకు బెస్ట్ 6 తెలుగు కామెడీ సినిమాలను సజెషన్ కింద ఇక్కడ తెలుసుకుందాం. వీటిలో నాలుగు సినిమాలు ఒకే ఒక్క ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ఆహా, జీ5లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ తెలుగు కామెడీ సినిమాలపై లుక్కేద్దాం.
ఓటీటీలో ఎన్ని రకాల జోనర్స్‌లలో సినిమాలు ఉన్నప్పటికీ ఆడియెన్స్‌ను ఎక్కువగా అట్రాక్ట్ చేసేది కామెడీ. అందుకే కామెడీ జోనర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ జోనర్‌లో వచ్చిన ఓటీటీ సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు ప్రేక్షకులు. మరి ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించే బెస్ట్ 6 తెలుగు కామెడీ ఓటీటీ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

సూపర్ సుబ్బు ఓటీటీ
సెక్స్ ఎడ్యుకేషన్‌పై కామెడీగా తెరకెక్కిన సిరీస్ సూపర్ సుబ్బు. సందీప్ కిషన్, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా బ్రహ్మానందం, మురళి శర్మ, సంపూర్ణేష్ బాబు, హైపర్ ఆది ముఖ్య పాత్రల్లో నటించారు.
సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా సందీప్ కిషన్ చేసిన సూపర్ సుబ్బు నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది. అయితే, సూపర్ సుబ్బు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ, ఈ సిరీస్ బాగా నవ్విస్తుందని ఇటీవల విడుదలైన టీజర్ ద్వారా తెలుస్తోంది.
మజాకా ఓటీటీ
త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ మజాకా. సందీప్ కిషన్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా, రావు రమేష్, అన్షు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా కామెడీ పరంగా మంచి టాక్ తెచ్చుకుంది. జీ5 ఓటీటీలో మజాకా స్ట్రీమింగ్ అవుతోంది.
బ్రహ్మ ఆనందం ఓటీటీ
తెలుగు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన కుమారుడు గౌతమ్ తాత, మనవడుగా నటించిన కామెడీ చిత్రం బ్రహ్మ ఆనందం. వెన్నెల కిశోర్ మరో కీలక పాత్రలో నవ్వించిన ఈ సినిమాను ఆహా ఓటీటీలో వీక్షించవచ్చు. 70 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకునే కథతో ఈ సినిమా నవ్విస్తుంది.
కీడా కోలా ఓటీటీ
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటించి దర్శకత్వం వహించిన డార్క్ కామెడీ చిత్రం కీడా కోలా. థియేటర్లలో హాయిగా నవ్వించిన ఈ సినిమాలో చైతన్య రావు మదాడి, రాగ్ మయూర్, విష్ణు ఓయి, జీవన్ కుమార్, రవీంద్ర విజయ్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. ఆహాలోనే కీడా కోలా ఓటీటీ రిలీజ్ అయింది.
మై డియర్ దొంగ ఓటీటీ
ఓ ఇంట్లోకి ఆహారం కోసం చొరబడిన దొంగ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. అభినవ్ గోమఠం దొంగగా, షాలిని కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్ ఇతర పాత్రలు పోషించారు. ఆహాలో డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన మై డియర్ దొంగ నవ్వించేందుకు బెస్ట్ ఆప్షన్.
సామజవరగమన ఓటీటీ
తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కామెడీ సినిమాల్లో సామజవరగమన ఒకటి. శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో నరేష్, వెన్నెల కిశోర్ ఇతర పాత్రల్లో నవ్వించారు. ఈ సినిమాను కూడా ఆహా ఓటీటీలో వీక్షించవచ్చు.
ఇలా టాప్ 6 తెలుగు కామెడీ సినిమాల్లో 4 ఆహా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


