చనిపోయిన వ్యక్తి చేసే హత్యలు-కొత్త పాయింట్‌తో త‌మిళ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌-సూపర్ ట్విస్ట్- ఓటీటీలోకి తెలుగులోనూ!

చనిపోయిన వ్యక్తి హత్యలు చేయడం అనే కొత్త పాయింట్ తో తెరకెక్కిన తమిళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఉత్కంఠ రేపే ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. వివరాలు మీ కోసం. 

Published on: Nov 22, 2025, 16:24:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఉత్కంఠ రేపుతూ, అదిరిపోయే థ్రిల్ పంచే తమిళ సినిమా దూసుకొస్తోంది. కొత్త పాయింట్ తో తెరకెక్కిన ‘ఆర్యన్’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ కన్ఫామ్ అయింది. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఈ నెలలోనే డిజిటల్ డెబ్యూ చేయనుంది. మరి ఆర్యన్ సినిమా ఏ ఓటీటీలోకి? ఎప్పుడు? వస్తుంది, మూవీ స్టోరీ ఏంటీ? అన్నది ఇక్కడ చూసేయండి.

ఓటీటీలో తమిళ థ్రిల్లర్ (x/Netflix_INSouth)
ఓటీటీలో తమిళ థ్రిల్లర్ (x/Netflix_INSouth)

ఆర్యన్ ఓటీటీ రిలీజ్ డేట్

తమిళ థ్రిల్లర్లకు ఓటీటీలో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఇదే జోనర్లో తెరకెక్కిన ఆర్యన్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఆర్యన్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ (నవంబర్ 22) అనౌన్స్ చేశారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆర్యన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ శనివారం అనౌన్స్ చేసింది.

నెల రోజుల్లోపే

ఆర్యన్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే డిజిటల్ డెబ్యూ చేయనుంది. విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి, సెల్వ రాఘవన్ తదితరులు నటించిన ఆర్యన్ సినిమా అక్టోబర్ 31, 2025న థియేటర్లలో రిలీజైంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టింది. ఐఎండీబీలో దీనికి 7 రేటింగ్ ఉంది. ఇప్పుడు నెల రోజుల్లోనే అంటే నవంబర్ 28న ఓటీటీలో అడుగుపెట్టనుంది ఈ థ్రిల్లర్.

ఆర్యన్ కథ

ప్రవీణ్ కె దర్శకత్వం వహించిన ఆర్యన్ మూవీ ఓ కొత్త పాయింట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇది మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్. ఆత్రేయ (సెల్వ రాఘవన్) ఓ ఫెయిల్యూర్ రైటర్. నయన (శ్రద్ధా శ్రీనాథ్) పాపులర్ టీవీ ఛానెల్ లో యాంకర్. ఆమె నిర్వహించే ఓ టాక్ షోకు ప్రేక్షకుడిగా ఆత్రేయ వెళ్తాడు. కానీ అక్కడికి గెస్ట్ గా వచ్చిన ఒకరిని గన్ తో కాల్చి చంపుతాడు ఆత్రేయ.

లైవ్ షోలోనే తాను రాసిన ఒక థ్రిల్లర్ కథ గురించి చెప్తాడు. ఆ స్టోరీ ప్రకారం తాను ఆత్మహత్య చేసుకున్న తర్వాత చనిపోయిన ఓ వ్యక్తి వరుసగా అయిదుగురిని మర్డర్ చేస్తాడని ఆత్రేయ చెప్తాడు. ఆ వెంటనే తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఆత్రేయ చెప్పినట్లుగా హత్యలు జరుగుతాయి. ఈ కేసును డీసీపీ నంది (విష్ణు విశాల్) టేకప్ చేస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? హత్యలు చేసింది ఎవరు? అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More